SCREEN ON

Loading File

Chapter 10

Chapter 9
Chapter 10
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 9

Jaya Janardana

Chapter 10
Chapter 9
Chapter 10

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 10

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

Active
10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

Final Episode

Chapter // 09

EPISODE 9

ఉదయాన్నే నిద్రలేచిన జయ, స్నానం చేసి దేవుడికి పూజ చేసింది. ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసింది. ఆ సువాసనకి ఇల్లంతా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోంది. ఎంతో పద్ధతిగా తయారైన జయ, ముందుగా హాల్‌లో టీవీ చూస్తున్న వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి హారతి ఇచ్చింది. ఆ తర్వాత అక్కడే ఉన్న వాళ్ల అన్నయ్యకి ఇవ్వబోతుంటే—

“ఎదవ ఓవర్ యాక్టింగ్! దీనికేం తక్కువ లేదు. నాన్నగారు ఏమైనా పాకెట్ మనీ ఎక్స్‌ట్రా ఇచ్చారా ఏంటి?” అని వెటకారంగా అడిగాడు వాళ్ల అన్నయ్య.

“పోరా గాడిదా! నేనేమన్నా నీలాంటోడిని అనుకున్నావా ఏంటి!” అని కసిరి, వేగంగా వంటగదిలోకి వెళ్లిపోయింది.

అక్కడ వాళ్ల అమ్మ వంట చేస్తోంది. ఆమెకు హారతి చూపించి—

“అమ్మా, రేపు నేను, వైష్ణవి కలిసి గుడికి వెళ్తాం. తను ఒక్కతే వెళ్తోందట, నన్ను కూడా తోడు రమ్మంది,” అని అడిగింది.

“చాలా కష్టపడ్డావ్ లే అను! కానీ కుదరదు,” అని ముఖం మీదే చెప్పేసింది వాళ్ల అమ్మ.

“అమ్మా ప్లీజ్ అమ్మా! ఎందుకలా అంటావ్? నేనేం చిన్నపిల్లను కాదు కదా గుడికి వెళ్లడానికి,” అని బ్రతిమిలాడింది జయ (అను).

సరిగ్గా అప్పుడే వెనక నుంచి వాళ్ల అన్నయ్య వచ్చి, ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు నటిస్తూ... “ఇది చిన్నపిల్ల ఏంట్రా, చైనా పిల్ల! పురుగులు, తేళ్లు తినే రకం,” అని ఎగతాళి చేశాడు.

అది వినగానే జయకు చిర్రెత్తుకొచ్చింది. కోపంతో తన చేతిలో ఉన్న వేడి వేడి హారతి స్టాండ్‌ను తీసుకెళ్లి వాళ్ల అన్నయ్య చేతిలో పెట్టి, కోపంగా ముఖం తిప్పుకుని వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లిపోయింది. వేడి తగలగానే పాపం వాళ్ల అన్నయ్య చేతులు కాలిపోయి గెంతులు వేశాడు.

“నాన్నా! నాన్నా! చూడు నాన్నా, నేను గుడికి వెళ్తానంటే అమ్మ వెళ్లనివ్వట్లేదు! పైగా అన్నయ్య గాడు కూడా వెక్కిరిస్తున్నాడు!!” అని నాన్న దగ్గర కంప్లైంట్ చేసింది.

“పోనీలే అమ్మా, వాడెలాగూ నీకు అన్నయ్యే కదా. నువ్వు బాధపడకు, రేపు నిన్ను, మీ ఫ్రెండ్‌ని నేనే స్వయంగా గుడి దగ్గర దిగబెడతాను, సరేనా!” అని కూతురికి భరోసా ఇచ్చాడు సత్యరాజు.

అది విన్న వాళ్ల అమ్మ వంటగదిలోంచి బయటకు వచ్చి, “మీకసలు ఏమైనా అర్థమవుతోందా అండీ? దానికి మీరు వంత పాడటం తప్ప, ఒక సమయం సందర్భం ఉండొద్దా... అది అడగడం, మీరు సరే అనడం!” అని విసుక్కుంది.

“సరేలేవే... పిల్లలు గుడికి వెళ్లడం మంచిదే కదా. అయినా, అను నా కూతురు! నా ఇష్టం!” అని ముద్దు చేశాడు వాళ్ల నాన్న.

“ఏదో ఒకటి చేసుకోండి. నాకెందుకు మధ్యలో? మీరిద్దరూ ఒకటైపోయారు. నేను, నా కొడుకు ఒక వైపు. అంతా ఒకటో తారీఖున చెప్తా మీ పని (పాకెట్ మనీ అడిగినప్పుడు)!” అని సరదాగా బెదిరిస్తూ వంటగదిలోకి వెళ్లిపోయింది.

అది విని జయ, వాళ్ల నాన్న ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు.

సడన్‌గా టీవీలో హీరో నాని సినిమా వస్తోంది. అది చూడగానే జయకు ఒక్కసారిగా తన ‘నాని’ (మన కథానాయకుడు) గుర్తొచ్చాడు.

“అయ్యో! మన నాని గారి సంగతి మర్చిపోయానేంటి! పాపం నేను తనను మర్చిపోయానని ఫీల్ అవుతున్నాడేమో... ఫోన్ చేసి రెచ్చగొట్టాలి,” అని మనసులో అనుకుంటూ తన గదిలోకి పరుగెత్తింది.

మరోవైపు...

నాని తన బ్యాగ్ వేసుకుని అమ్మమ్మ వాళ్ల ఇంటికి చేరుకున్నాడు. అలసటగా లోపలికి అడుగుపెడుతూనే—

“అమ్మా! కాస్త మంచినీళ్లు ఇవ్వు!” అని కేక వేశాడు. (చిన్నప్పటి నుంచి నాని, వాళ్ల అమ్మమ్మనే ‘అమ్మ’ అని పిలుస్తాడు).

కానీ, లోపలికి వెళ్లి పక్కకు తిరిగి చూసేసరికి... అక్కడ నాని వాళ్ల సొంత అమ్మ, నాన్న కూర్చుని ఉన్నారు!

నానిని చూడగానే వాళ్ల నాన్న ఒక్కసారిగా కోపంగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. వాళ్ల అమ్మ మాత్రం కొడుకును చూసిన ఆనందంతో, “ఎలా ఉన్నావ్ బాబూ?” అని ఆప్యాయంగా అడిగింది.

కానీ నాని ఆమె ప్రశ్నకు జవాబు చెప్పకుండా, కనీసం వాళ్ల వంక కూడా చూడకుండా... వచ్చిన దారినే మౌనంగా బయటకు నడిచాడు.

అలా నడుస్తున్న నానికి, గతంలో వాళ్ల నాన్న అన్న మాటలు గుండెల్లో గునపాల్లా దిగిన ఆ రోజు గుర్తొచ్చింది.

గతం —

“అసలు నువ్వు నాకే పుట్టావురా! కాస్తయినా సిగ్గు లేదా, ఇంత వయసొచ్చినా ఇంకా నా సంపాదన మీద బ్రతకడానికి? నీతోటి కుర్రాళ్లు ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావ్ పనీపాటా లేకుండా?” అని గట్టిగా అరుస్తూ, కోపంతో నాని తింటున్న అన్నం ప్లేట్‌ను కాలితో తన్నాడు వాళ్ల నాన్న.

ఆ హఠాత్పరిణామానికి, నోట్లో పెట్టుకున్న ముద్ద మింగలేక, ఉక్కిరిబిక్కిరవుతూ బయటకు ఉమ్మేశాడు నాని.

అది చూసి తట్టుకోలేక వాళ్ల అమ్మ అడ్డువచ్చి, “అయ్యో! అవేం మాటలండీ! కూడును అలా కాలితో తంతారా? అయినా వాడేం రోడ్ల మీద బలాదూర్ గా తిరగడం లేదు కదా,” అని కొడుకును వెనకేసుకొచ్చింది.

దానికి వాళ్ల నాన్న మరింత రెచ్చిపోయి, “నీ కొడుక్కి సిగ్గు లేదు! బయట వాడి వయసు కుర్రాళ్లు వాళ్ల నాన్నలకి ఎలా సాయంగా ఉంటున్నారో చూసి నేర్చుకోమను. నాకు నీతులు చెప్పడం కాదు!” అని వాళ్ల అమ్మ మీదే అరిచాడు.

ఆ మాటలకి నానిలో ఎన్నాళ్ల నుంచో అణచిపెట్టుకున్న కోపం కట్టలు తెంచుకుంది.

“సరే... అయితే... నేను మీకు భారమైపోయాను కదా! ఇప్పుడే చెప్తున్నా విను— నువ్వెవరివో నాకు తెలీదు. ఇది నా ఇల్లు కాదు. నువ్వు, అమ్మ, చెల్లి... నేను లేకుండా సంతోషంగా ఉండండి! నా వల్లే కదా నువ్వు బయట తలెత్తుకోలేకపోతున్నావు? ఇప్పుడు చెప్తున్నా విను— నేను నీ కొడుకునే కాదు... అసలు నీకు పుట్టనేలేదు!” అని ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు.

‘పెట్’ మని ఓ శబ్దం! నాని చెంప పగిలింది. వాళ్ల అమ్మ కోపంగా నానిని లాగిపెట్టి కొట్టింది.

అంతే, ఇంక ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా, నాని తన బ్యాగ్ తీసుకుని ఇంట్లోంచి బయటకు నడిచాడు. పాపం వాళ్ల అమ్మ, చెల్లి ఎంతో బ్రతిమిలాడారు, నానిని ఆపడానికి ప్రయత్నించారు. కానీ నాని వాళ్ల చేతులు విడిపించుకుని, కన్నీళ్లను దిగమింగుకుంటూ అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోయాడు.

ప్రస్తుతం —

బయటకొచ్చి నిలబడ్డ నాని మెదడు ఆలోచనలతో మొద్దుబారిపోయింది. తన తల్లిదండ్రులు అసలు అమ్మమ్మ వాళ్ల ఇంటికి ఎందుకు వచ్చారో అతనికి అర్థం కాలేదు. గతపు చేదు జ్ఞాపకాలతో నాని మనసు బరువెక్కిపోయింది.

సరిగ్గా అప్పుడే నాని ఫోన్ రింగ్ అయ్యింది. స్క్రీన్ మీద జయ పేరు!

అప్పటిదాకా గతం తాలూకు చీకటి ఆలోచనల్లో ఉన్న నాని, ఆ పేరు చూడగానే... అతనికి తెలియకుండానే పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వికసించింది.

Jaya Janardana

By Ajay

Published: March 16, 2026 at 3:12 PM

© 2026 Ajay. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...