SCREEN ON

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

Active
21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

Final Episode

Chapter // 20

EPISODE 20

Ajay
Drama , love , Comedy
1 Min Read
Pub: Mar 12, 2026

సాయంత్రం పూర్తిగా చీకటిలో కలిసిపోయే సమయానికి జనార్దన్, తేజ ఇద్దరూ వెంకట్ ఇంటి దగ్గరకు చేరుకున్నారు.

ఇంటి ముందు నిలబడి ఉన్న వెంకట్ వాళ్లను చూసి ఆనందంగా నవ్వాడు.

“అరే రా జనార్దన్! ఎన్నాళ్లకి కనిపిస్తున్నావ్!” అంటూ ముందుకు వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు.

“ఎలా ఉన్నావ్ రా?” అని అడిగాడు వెంకట్.

“బాగున్నా,” అని చిన్న నవ్వుతో సమాధానం చెప్పాడు జనార్దన్.

“నువ్వేనా తేజ?” అని వెంకట్ అడగగానే,

“అవును బ్రదర్,” అని తేజ చేయి కలిపాడు.

“రండి రండి... ఇంట్లోకి రండి.”

అని వాళ్లను లోపలికి తీసుకెళ్లాడు వెంకట్ .

---

వెంకట్ ఇల్లు చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉంది.

గోడల మీద కుటుంబ ఫోటోలు, చిన్ననాటి జ్ఞాపకాలు, దేవుళ్ల ఫ్రేములు కనిపిస్తున్నాయి.

వెంకట్ ఇంటి ప్రతి మూల చూపిస్తూ,

“ఇది మా హాల్... అది కిచెన్... పైకి బెడ్రూమ్స్ ఉంటాయి...” అంటూ వివరించసాగాడు.

కానీ...

తేజ మాత్రం వెంకట్ మాటలు ఏవీ వినడం లేదు.

అతని చూపు మాత్రం ఒకే దిశలో తిరుగుతోంది.

వాష్‌రూమ్ ఎక్కడుందా అని వెతుకుతోంది.

అది గమనించిన జనార్దన్ అతని చేతిని పట్టుకుని దగ్గరకు లాగి చెవిలో నెమ్మదిగా,

“అది వాష్‌రూమ్ రా... ఢాబా కాదు. అలా ఆకలితో చూస్తున్నట్టు చూడకు, చాలా చండాలంగా వుంది ” అన్నాడు.

తేజ వెంటనే,

“ లేదు ఈ ఇంట్లో రెండు కిచెన్స్ ఉన్నాయి ఏమో అని ” అని గుసగుసలాడాడు.

“ అది నీ మొకం చూస్తే నీ అర్థం అవుతుంది " అన్నాడు జనార్దన్.

---

కొద్దిసేపటికి ముగ్గురూ హాల్లోని సోఫాల మీద కూర్చున్నారు.

వెంకట్ వాళ్లకు టీ తీసుకొచ్చి ఇచ్చాడు.

“అయితే చెప్పండి బాబూ... జీవితాలు ఎలా సాగుతున్నాయి?” అని అడిగాడు వెంకట్.

కొద్దిసేపు కాలేజ్, ఉద్యోగాలు, పాత జ్ఞాపకాలు, చిన్ననాటి అల్లరులు గురించి మాట్లాడుకున్నారు.

మధ్య మధ్యలో నవ్వులు వినిపించాయి.

చాలా రోజుల తర్వాత కలిసిన స్నేహితుల మధ్య ఉండే ఆప్యాయత ఆ ఇంటి వాతావరణాన్ని మరింత హాయిగా మార్చింది.

---

కొంతసేపటి తర్వాత వెంకట్ ఒక్కసారిగా అడిగాడు.

“సరే రా... అసలు మీరు ఈ ఊరికి ఎందుకు వచ్చారు?”

అని టీ కప్పు పక్కన పెట్టి వాళ్ల వైపు చూశాడు.

జనార్దన్ ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు.

అతను ఏం చెప్పాలో ఆలోచించేలోపే తేజ ముందుకు వచ్చాడు.

“అదీ...బ్రదర్... అనూష అనే అమ్మాయి కోసం వచ్చాం.”

అన్నాడు.

---

ఆ మాట వినగానే వెంకట్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది.

“అనూషా?”

అని ఆశ్చర్యంగా అడిగాడు.

“అవును.” అని అన్నాడు జనార్దన్

“అనూష అంటే... జయనా?”

అన్నాడు వెంకట్.

జనార్దన్, తేజ ఇద్దరూ ఒకేసారి అతని వైపు చూశారు.

“జయా?”

“అవును రా. తన అసలు పేరు జయ.”

అని వెంకట్ చెప్పాడు.

తర్వాత కొంచెం సందేహంగా అడిగాడు.

“తనని మీకు తెలుసా?”

---

తేజ వెంటనే నవ్వుతూ,

“నాకు కాదు బ్రదర్... వీడికి,” అని పక్కనే ఉన్న జనార్దన్ వైపు చూపించాడు సైగ చేస్తూ.

వెంకట్ చూపు జనార్దన్ మీద పడింది.

“ఓహ్...”

అన్నాడు.

---

జనార్దన్ కొద్దిగా సిగ్గుపడుతూ తల దించుకున్నాడు.

తన పెదవుల మీద చిన్న నవ్వు కనిపించింది.

“అవును... తను...”

అని మొదలుపెట్టాడు.

“చాలా మంచి అమ్మాయి... ఇంకా చెప్పాలి అంటే...”

అని అనూష గురించి చెప్పబోతున్నాడు జనార్దన్ .

అతని కళ్లలో ఆమె జ్ఞాపకాలు మెరుస్తున్నాయి.

గోదావరి ఒడ్డున గడిపిన క్షణాలు...

ఆమె నవ్వు...

ఆమె చూపు...

ఆమె పలికిన ప్రతి మాట...

అన్నీ అతని మనసులో తిరుగుతున్నాయి.

---

కానీ...

జనార్దన్ మాట పూర్తవకముందే వెంకట్ ఒక్కసారిగా మాట్లాడాడు.

“పాపం రా...” అన్నాడు వెంకట్

ఆ స్వరంలో బాధ ఉంది.

---

“మన ప్రసాద్ గాడు ప్రేమించిన ఒకే ఒక్క అమ్మాయి జయ.”

అన్నాడు వెంకట్.

---

ఆ మాట వినగానే...

జనార్దన్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది.

అతని ముఖంలోని నవ్వు క్షణాల్లో మాయమైంది.

---

వెంకట్ మాత్రం కొనసాగించాడు.

“ప్రసాద్ లేడు కదా ఇప్పుడు...”

“వాడు పోయిన తర్వాత జయ చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.”

“మనకు స్నేహితుడిని కోల్పోయిన బాధే ఇంతగా ఉంటే... వాళ్లు ప్రేమించుకున్నారు రా... ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో.”

---

జనార్దన్ శరీరం మొత్తం ఒక్కసారిగా చల్లబడిపోయింది.

అతని చేతులు వణకడం మొదలయ్యాయి.

---

“ఇప్పుడు చూస్తే తను హ్యాపీగా ఉన్నట్టు నటిస్తుంది.”

“అందరితో నవ్వుతుంది.”

“సాధారణంగా తిరుగుతుంది.”

“కానీ అది నటన రా.”

“అది నాకు మాత్రమే తెలుసు.” అని చెప్తున్నాడు వెంకట్

---

వెంకట్ గొంతు కూడా భారంగా మారింది.

“తన ప్రేమ విషయం ఎవరికీ తెలియదు.”

“అందుకే తన బాధను తనలోనే దాచుకుని బ్రతుకుతోంది.”

“బయట నవ్వుతుంది... లోపల మాత్రం ప్రతి రోజు ఏడుస్తోంది.”

---

ఆ మాటలు ఒక్కొక్కటి జనార్దన్ గుండెల్లో బాణాల్లా దిగుతున్నాయి.

---

జయ...

అనూష...

తను ప్రేమించిన వ్యక్తి...

ప్రసాద్...

---

అదీ ఎవరో కాదు...

తన చిన్ననాటి స్నేహితుడు.

తనతో పెరిగిన వాడు.

తనతో నవ్విన వాడు.

ఇప్పుడు ఈ లోకంలో లేని వాడు.

---

జనార్దన్ కళ్ల ముందు ఒక్కసారిగా ప్రసాద్ ముఖం కనిపించింది.

వాళ్లు కలిసి గడిపిన రోజులు గుర్తొచ్చాయి.

---

"నేను ఏం చేస్తున్నాను...?"

అని అతని మనసు కేకలు వేసింది.

---

"నా స్నేహితుడు ప్రేమించిన అమ్మాయినే నేను ప్రేమిస్తున్నానా?"

---

ఆ ఆలోచన అతనికి అసహ్యంగా అనిపించింది.

తన మీద తనకే కోపం వచ్చింది.

తన మీద తనకే విరక్తి కలిగింది.

---

అతను ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోలేకపోయాడు.

కళ్లలో నీళ్లు చేరాయి.

కానీ వాటిని బయటకు రానివ్వలేదు.

---

కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత...

జనార్దన్ నెమ్మదిగా సోఫా నుండి లేచాడు.

---

“వెంకట్...” అని అన్నాడు జనార్దన్

“ఏమైంది రా?” అని అడిగాడు వెంకట్

---

జనార్ధన్:- “నేను వెళ్లాలి.”

---

వెంకట్ ఆశ్చర్యపోయాడు.

“అదేంటి రా ఒక్కసారిగా?”

“రేపు ఉదయం వెళ్దువుగాని.”

“ఇప్పుడు ఎక్కడికి?”

---

జనార్దన్ వెనక్కి తిరిగి చూశాడు.

అతని కళ్లలో ఈసారి నవ్వు లేదు.

బాధ మాత్రమే ఉంది.

---

“నేను వెళ్లాలి.”

అన్నాడు.

ఈసారి అతని స్వరం చాలా గట్టిగా ఉంది.

తిరస్కరించే అవకాశం లేని స్వరం.

---

వెంకట్ పూర్తిగా అయోమయంలో పడ్డాడు.

అసలు ఏమైందో అతనికి అర్థం కాలేదు.

---

తేజ మాత్రం పరిస్థితి గ్రహించాడు.

జనార్దన్ ముఖంలో కనిపిస్తున్న బాధను అతను స్పష్టంగా చూశాడు.

అతను వెంటనే వెంకట్ దగ్గరకు వెళ్లి,

“సారీ బ్రదర్.”

“వాడికి ఒక ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చింది.”

“ఏం అనుకోకు.”

“మేము మళ్లీ తప్పకుండా వస్తాం.”

అన్నాడు తేజ

---

వెంకట్ ఇంకా అయోమయంలోనే ఉన్నాడు.

కానీ బలవంతం చేయలేదు.

“సరే రా... జాగ్రత్తగా వెళ్లండి.”

అన్నాడు.

---

కొన్ని క్షణాల తర్వాత...

జనార్దన్, తేజ ఇద్దరూ ఆ ఇంటి బయటకు వచ్చారు.

---

రోడ్డుపై నిశ్శబ్దం అలుముకుంది.

దూరంగా వీధి దీపాల వెలుతురు మాత్రమే కనిపిస్తోంది.

---

జనార్దన్ ముందుకు నడుస్తున్నాడు.

తేజ వెనకే వస్తున్నాడు.

కానీ ఈసారి...

వాళ్ల మధ్య మాటలు లేవు.

---

ఎందుకంటే..

జనార్దన్ గుండెలో ఒక ప్రేమ చనిపోతుందా...

లేదా ఇంకో కొత్త బాధ పుడుతుందా...

అనే ప్రశ్నకు సమాధానం అతనికే తెలియడం లేదు.

(కొనసాగుతుంది...)

Jaya Janardana

By Ajay

Published: June 10, 2026 at 10:30 AM

© 2026 Ajay. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...