SCREEN ON

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

Active
17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

Final Episode

Chapter // 16

EPISODE 16

Ajay
Drama , love , Comedy
1 Min Read
Pub: Mar 12, 2026

నాని, జయ (అనూష) ఇద్దరూ రోడ్డు మధ్యలో ఒకరినొకరు అలా కళ్లార్పకుండా చూసుకుంటూ ఉండిపోయారు.

తేజ కల్పించుకుని, "పదండి పదండి, మళ్లీ జనం గుడి దగ్గర లైన్ కట్టేస్తారు," అని తొందరపెట్టాడు.

అప్పుడు స్పృహలోకి వచ్చిన జయ, "పదండి," అని ఒక ఆటోని ఆపింది. నాని, జయలను అలా డైరెక్ట్‌గా చూసేసరికి అసలు తాటి గారెల విషయమే మర్చిపోయాడు.

ఆటో ఎక్కాక నాని కంగారుగా, "అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? నీకు ముందే చెప్పాను కదా ఒంటరిగా రావొద్దని! అంత దూరం నుంచి ఎలా వచ్చేశావు?" అని అడిగాడు.

అనూష నవ్వుతూ, "అబ్బా… రావాలని గట్టిగా అనిపించింది, అందుకే ఎలాగోలా వచ్చేశాను," అని సమాధానమిచ్చింది. తర్వాత నాని ఫోన్ తీసుకుని, "నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కోట్ (Quote) చదివాను, చూడు," అని స్క్రీన్ మీద చూపించింది.

అందులో "అలుపెరగని బాటసారి" అని రాసి ఉంది.

అది చదివిన నాని, "ఈ కోట్ నచ్చిందంటే... నీకు చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నట్టున్నాయే!" అన్నాడు ఆశ్చర్యంగా.

అనూష ఎక్సైటెడ్‌గా, "అవును, నీకెలా తెలుసు? ఒకటి కాదు… అనూషకి మిలియన్ డ్రీమ్స్ ఉన్నాయి. నా జీవితం మీద ఒక స్టోరీ బుక్ (Story book) కూడా రాసేయొచ్చు తెలుసా!" అంది.

నాని నవ్వుతూ, "నీ మీద బుక్ ఎవడు రాస్తాడులే," అన్నాడు.

"ఎవరో ఎందుకు? నువ్వున్నావుగా… నువ్వే రాసేయ్. నా గురించి మొత్తం నీకు తెలుసు కదా," అంది అనూష.

"ఏమో… అసలు నీ పేరు నిజంగా 'జయ' అవునో కాదో అన్న విషయం కూడా నాకు కచ్చితంగా తెలియదు," అన్నాడు నాని కాస్త అనుమానంగా.

అప్పుడు ఆమె నాలిక కరుచుకుని, "అయ్యో! ఆ టాపిక్ మర్చిపోయాను. నా పేరు జయ కాదు. అది మా పెద్దనాన్న గారి అమ్మాయి (చిన్న పాప) పేరు. నా అసలు పేరు అనూష," అని అసలు గుట్టు విప్పింది.

"పేరు చాలా బాగుంది. కానీ ఇన్ని రోజులు ఎందుకు దాచావ్?" అని అడిగాడు నాని.

అనూష మాట మారుస్తూ, "అవును… నేను ముగ్గురిని రమ్మన్నాను కదా, మీరు ఇద్దరే వచ్చారేంటి?" అని అడిగింది.

"అలా అయితే, నువ్వు కూడా ఇద్దరిని తెస్తానన్నావు, కానీ ఒక్కదానివే వచ్చావు కదా?" అని కౌంటర్ ఇచ్చాడు నాని.

"నేనొక్కదాన్నే రాలేదు, మా ఫ్రెండ్స్ నేరుగా గుడి దగ్గరికే వస్తున్నారు. వాళ్లు అక్కడే ఉంటారు," అంది అనూష.

"సరే, నేను కూడా మా లోకల్ ఫ్రెండ్ ఒకడిని పిలుస్తాలే. చిన్నప్పుడు నేను ఇక్కడే కదా పెరిగాను," అన్నాడు నాని.

అలా కబుర్లు చెప్పుకుంటూ వాళ్లు ఇస్కాన్ టెంపుల్ దగ్గరకు చేరుకున్నారు.

ఆటో దిగిన వెంటనే అనూష, "జనార్దన్! మీరు ఇక్కడే ఉండండి. నేను మా ఫ్రెండ్స్ ని తీసుకుని వస్తాను. ఒకవేళ నేను రావడం లేట్ అయితే లైన్ చూశారు కదా ఎంత పెద్దగా ఉందో... మీరు వెళ్లి లోపల లైన్‌లో ప్లేస్ ఉంచండి," అని చెప్పి వెళ్లిపోయింది.

అనూష తరఫున కూడా ఆటో డ్రైవర్‌కి డబ్బులు ఇచ్చాడు నాని. "సరే, ఒంటరిగా ఎలా వెళ్తావ్? నన్ను కూడా రమ్మంటావా?" అని అడిగాడు నాని.

అనూష నవ్వుతూ, "వద్దులే బాబూ. వాళ్ల ఇంటికి నిన్ను తీసుకెళ్తే అంతే సంగతులు," అని చెప్పి వెళ్లిపోయింది.

"సరే, జాగ్రత్తగా దించండి తనని," అని నాని ఆటో డ్రైవర్‌కి చెప్పాడు.

ఆమె వెళ్లగానే నాని తేజ వైపు తిరిగి, "సరే పదా, వెళ్లి లైన్‌లో నిలబడదాం," అని వెనక్కి చూశాడు.

అంతే… అక్కడ దర్శనం లైన్ గుడి ఆవరణ దాటి రోడ్డు మీదకు వచ్చేసింది.

అది చూసిన నాని చిన్నగా నవ్వి, "సరే, నాతో రా," అని లైన్‌తో సంబంధం లేకుండా నేరుగా మెయిన్ గేట్ వైపు నడిచాడు.

అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్లు కూడా నానిని ఆపలేదు. అది చూసిన తేజ, "అమ్మో! వీడితో వెళ్లకపోతే నన్ను కచ్చితంగా ఆపేస్తారు," అని గొణుక్కుంటూ నాని వెనకే పరుగులు తీశాడు.

లోపల ఎంతో మంది చిన్నారులు ముద్దుగా రాధా-కృష్ణుల వేషాలు వేసుకుని ఉన్నారు. వాళ్లని చూస్తూ నాని, తేజలు సమయం మర్చిపోయారు.

ఇంతలో నాని ఫోన్ రింగ్ అవుతోంది, కానీ ఆ హడావిడిలో అతను గమనించలేదు.

బయట అనూష తన స్నేహితురాళ్లతో కలిసి నాని, తేజల కోసం వెతుకుతోంది.

"ఏంటే, మీ చిన్నప్పటి ఫ్రెండ్ అన్నావు… కనీసం నిన్ను పట్టించుకోవడమే లేదు!" అని వాళ్ల స్నేహితురాలు అనూషను ఉడికించింది.

అప్పుడు అనూష కోపంగా మళ్లీ కాల్ చేసింది.

లోపల గుడిలో తేజ, "రేయ్ బాబూ! ఆ అమ్మాయిని చూసేసరికి నీ బ్రెయిన్ పనిచేయట్లేదు అనుకుంటా… రింగ్ అవుతున్నది నీ ఫోనేరా!" అని అరిచాడు.

నాని జేబులోంచి ఫోన్ తీసి చూసేసరికి అన్‌నౌన్ నెంబర్ (Unknown number). కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుంచి అనూష కోపంగా, "ఏంటి నానీ! నువ్వు ఎక్కడున్నావ్? ఒక అమ్మాయి నీకోసం వచ్చి ఫోన్ చేస్తుంటే… ఆన్సర్ చేయాలని కూడా తెలియదా?" అని కడిగేసింది.

నాని కంగారుగా, "కూల్ కూల్! మీరు రావడం లేట్ అయ్యేసరికి మేము లోపలికి వచ్చేశాం. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు?" అని అడిగాడు.

"ఈ పెద్ద లైన్‌లో ఉన్నాం! మేము రాకముందే మీరు లోపలికి వెళ్లిపోతారా?" అని అడిగింది అనూష.

నాని మనసులో, 'దేవుడా! తనే కదా లోపలికి వెళ్లి లైన్‌లో ఉండమంది!' అని తలబాదుకున్నాడు.

"సరే, నేను చెప్పినట్టు చేయండి. మీరు ఎగ్జిట్ గేట్ (Exit gate) దగ్గరకు రండి," అని ఒక ప్లాన్ చెప్పాడు.

కానీ అనూషకి తెలుసు, అంతమంది సెక్యూరిటీని దాటి, లైన్‌లో నిలబడకుండా గుడి లోపలికి వెళ్లడం అసాధ్యమని. అందుకే ఆమె ఎంతో బాధగా, "సరే, మాకోసం ఇంకా చూడకండి. మీరు వెళ్లి దర్శనం చేసుకోండి. మేము లైన్‌లోనే ఉండిపోయాం," అంది.

ఆ మాట విన్న నానికి ఎక్కడో కాలిపోయింది. "ఓయ్! నేను అంత దూరం నుంచి వచ్చింది నీతో కలిసి దర్శనం చేసుకోవడానికే! నువ్వు లేకపోతే నేను కూడా వెళ్లను. అయినా నేను చెప్తున్నాను ఆగు, డైరెక్ట్‌గా నువ్వు, మీ ఫ్రెండ్స్ లోపలికి వచ్చేలా చేసే పూచీ నాది," అన్నాడు జనార్దన్.

అనూష నవ్వుతూ, "ఏంటి, నువ్వేమన్నా శ్రీకృష్ణ పరమాత్మవి అనుకుంటున్నావా! అదేదో నీ సొంత గుడి అయినట్టు ఆర్డర్స్ వేస్తున్నావు!" అంది.

"సరేలే గానీ, మీరు ముందు ఆ ఎగ్జిట్ గేట్ దగ్గరకు రండి చెప్తా," అన్నాడు జనార్దన్.

వాళ్లు అక్కడికి రాగానే, నాని ఎగ్జిట్ గేట్ దగ్గరున్న సెక్యూరిటీ గార్డు దగ్గరికి వెళ్లి, "ఏంటి బాబాయ్ ఎలా ఉన్నావ్! నన్ను గుర్తుపట్టలేదా!" అని మాటల్లో పెట్టాడు.

అదే గ్యాప్‌లో అనూష వాళ్లని లోపలికి వచ్చేయమని సైగ చేశాడు. కానీ వాళ్లు సెక్యూరిటీని చూసి భయపడి ఆగిపోయారు.

అప్పుడు నాని ఓపిక కోల్పోయి, అమాంతం వెళ్లి అనూష చేయి పట్టుకుని లోపలికి లాగేశాడు.

సెక్యూరిటీ గార్డ్ గొడవ చేయడం మొదలుపెట్టాడు. "ఎవరు బాబూ వాళ్లు? లైన్లో రమ్మను," అన్నాడు.

"మా ఫ్రెండ్స్ బాబాయ్… పాపం తెలీక బయటకి వెళ్లిపోయారు," అని నాని కథలు చెప్పి మేనేజ్ చేయాలని చూశాడు.

కానీ ఆ సెక్యూరిటీ గార్డ్ అస్సలు ఒప్పుకోకుండా, "లోపలికి రానీయను," అని అడ్డుకున్నాడు.

అంతే, ఇంక చేసేదేం లేక నాని, అనూష చేయి గట్టిగా పట్టుకుని సెక్యూరిటీని దాటుకుని లోపలికి పరుగులు తీశాడు. అనూషకి ఆ క్షణం చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆమెకు కాలం స్తంభించిపోయినట్టు అనిపించింది. చుట్టూ ఎంతోమంది జనాలు ఉన్నా సరే, వాళ్లిద్దరూ ఏదో వేరే లోకంలో ఉన్నట్టు, ఆ గుడికి వాళ్లకి ఏదో తెలియని దైవిక సంబంధం ఉన్నట్టు అనిపించింది. ఆ క్షణంలో ఆమె పొందిన ఫీలింగ్ వర్ణనాతీతం!

అందరూ పరుగెత్తి కొంచెం దూరం వెళ్లి ఆగాక, రొప్పుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు.

అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.

అనూష పదే పదే నానిని "జనార్దన్" అని పిలుస్తోంది. నాని మాత్రం సమాధానం చెప్పకుండా అనూషనే తదేకంగా చూస్తున్నాడు.

"జనార్దన్ గారూ, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? పోగొట్టనులేండి," అని అడిగింది. నానికి ఆమె అలా 'గారు' అని పిలవడం ఎంతో కొత్తగా అనిపించింది.

వాళ్ల ఫ్రెండ్ ఎగ్జైట్ అవుతూ, "అబ్బా... అసలు లైన్ లేకుండానే లోపలికి వచ్చేశాం!" అని ఆనందపడింది.

అనూష ఫోన్ తీసుకుంటూ, "నువ్వు స్నాప్‌చాట్ (Snapchat) యూజ్ చేయవా?" అని అడిగింది.

దానికి నాని అమాయకంగా, "అదేమిటి? కచ్చితంగా వాడాలా?" అని అడిగాడు.

అనూష నవ్వుతూ, "పర్లేదులే… ముందు దర్శనం ఎలా చేసుకోవాలో ఆలోచించు," అంది.

"అది నువ్వే చెప్పాలి," అన్నాడు నాని.

"మా ఫ్రెండ్ ఒకమ్మాయి లోపలే ఉంది. ఆమె దగ్గర వీఐపీ పాస్ (VIP pass) ఉంది," అని చెప్పింది అనూష.

కానీ ఆ పాస్‌తో ఒకరికే అనుమతి ఉంటుంది.

నాని ధీమాగా, "అను… నువ్వు గట్టిగా అనుకో, అంతా అయిపోతుంది," అన్నాడు.

అనూష లోపలున్న వాళ్ల ఫ్రెండ్‌ని పిలిచింది. ఆమె రాగానే అందరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని లోపలికి నడిచారు. ఈసారి అనూషనే జనార్దన్ చేయి పట్టుకుని దారి తీసింది.

విచిత్రంగా ఈసారి కూడా వాళ్లని ఎవరూ ఆపలేదు.

కానీ మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్లాక చూసేసరికి… గుడి లోపల కూడా గర్భగుడి చుట్టూ ఇంకో పెద్ద లైన్ ఉంది.

ఇప్పుడు వాళ్లు ఆ లైన్‌లోకి ఎలా వెళ్తారు…?

చూడాలి — శ్రీకృష్ణుడి దర్శనం అవుతుందా… లేక ఎవరైనా ఆపేస్తారా…

Jaya Janardana

By Ajay

Published: March 20, 2026 at 3:44 PM

© 2026 Ajay. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...