SCREEN ON

Loading File

Chapter 13

Chapter 12
Chapter 13
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 12

Jaya Janardana

Chapter 13
Chapter 12
Chapter 13

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 13

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

Active
13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

Final Episode

Chapter // 12

EPISODE 12

నాని 'రుక్మిణీ కళ్యాణం' కథను పూర్తి చేయగానే, జయ ఎంతో మధురమైన అనుభూతిలో తేలిపోయింది. కథ వింటున్నంతసేపూ ఆమె తనను రుక్మిణిగా, నానిని కృష్ణుడిగా ఊహించుకుంది మరి!

"ఎంత బాగుందో కదా! అయినా రుక్మిణికి చాలా ధైర్యం ఎక్కువ. ఆ కాలంలోనే సమాజానికి ఎదురు నిలబడింది. తన ప్రేమ కోసం ఎంత సాహసం చేసిందో! అయినా ఒకసారి ప్రేమిస్తే లైఫ్-లాంగ్ కలిసి ఉండాలి. మధ్యలో వదిలేసి వెళ్లడాలు ఉండకూడదు," అంది జయ.

అప్పుడు నాని నవ్వుతూ, "ఈ కథ ఫస్ట్ టైమ్ విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది... అసలు ఒక మనిషిని చూడకుండానే అలా ఎలా ప్రేమిస్తారు?" అని కాస్త వెటకారంగా అన్నాడు.

ఆ మాట వినగానే జయకి కోపం వచ్చింది. "ఎందుకు ప్రేమించరు? అలా కూడా ప్రేమిస్తారు! ఇప్పుడు నేను..." అని తన మనసులోని మాటను పొరపాటున బయటపెట్టబోయి, వెంటనే నాలుక కరుచుకుని ఆగిపోయింది.

అది గమనించిన నాని, "ఏంటీ… లాస్ట్‌లో ఏదో అన్నావ్?" అని ఆరా తీశాడు.

కవర్ చేసుకుంటూ జయ, "నేనేమన్నాను? ఏమీ అనలేదే! అయినా నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు కదా!" అంటూ చాలా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేసింది. కొంచెం ఉంటే నానికి అక్కడే ప్రపోజ్ చేసేదేమో!

ఆ మాట వినగానే నాని ఉత్సాహంగా, "నువ్వు ఏమనుకున్నా సరే, నాకు మాత్రం నిన్ను చూడాలని ఉంది!" అన్నాడు.

"సరే, నేను ప్లాన్ చేస్తా. రేపు కలుద్దాం… ఫస్ట్ సినిమాకి వెళ్దాం, ఆ తర్వాత గోదావరి ఒడ్డున అలా కాసేపు కూర్చుని బోలెడు కబుర్లు చెప్పుకుందాం. సన్‌సెట్ (Sunset) చూశాక ఎవరి దారిన వాళ్లు ఇంటికి వెళ్లిపోదాం," అని ప్లాన్ చెప్పింది జయ.

"ఫస్ట్ టైమ్ వింటున్నా… నువ్వు ఇంత ఎక్సైటెడ్‌గా మాట్లాడటం. సరే, తప్పకుండా వస్తా," అన్నాడు నాని.

"కానీ ఒక కండిషన్... ఎవరి ఖర్చులు వాళ్లే పెట్టుకోవాలి. ఒకవేళ నేను నీకు ఏమైనా ఇస్తే, వద్దు అనకుండా తీసుకోవాలి," అని షరతు పెట్టింది జయ.

దానికి నాని, "సరే, ప్రేమతో ఇస్తే నేను దేన్నీ కాదననులే," అన్నాడు.

"సరే, నీకోసం ఏదో ఒకటి తెస్తాలే. ఉంటాను మరి," అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసింది జయ.

"అలా కాదు జయా... ఏంటి అప్పుడే కట్ చేసిందా? సరిపోయింది!" అనుకున్నాడు నాని.

మొత్తానికి రేపు తనను కలవబోతున్నానన్న ఆనందంలో నాని మేడ మీదే చిన్నగా స్టెప్పులేశాడు. డాన్స్ చేస్తూ వెనక్కి తిరిగేసరికి... సరిగ్గా అక్కడే వాళ్ల అమ్మమ్మ నిలబడి ఉంది!

షాకైన నాని, "మొత్తం వినేశావా అమ్మా?" అని కంగారుగా అడిగాడు.

"ఏంటి వినేది? అయినా ఆ జుట్టు, ఆ వాలకం ఏంట్రా? నా మనవడు అంటే ఎలా ఉండాలి, ఎలా తయారయ్యావు!?" అని విసుక్కుంది.

'హమ్మయ్య… అమ్మ ఏమీ వినలేదు,' అని మనసులో ఊపిరి పీల్చుకున్నాడు నాని.

"ఇది స్టైల్ బేబీ... నీకేం తెలుసు! పోయి ఆ తెల్ల జుట్టుకి రంగు వేసుకో పో," అని అమ్మమ్మ బుగ్గలు గిల్లి ఆటపట్టించాడు. దానికి ఆవిడ చేతిలో ఉన్న గరిటెతో కొట్టబోతుంటే, నాని నవ్వుకుంటూ కిందకు పారిపోయాడు.

నాని వెళ్లగానే, 'మనవడు మనవరాలిని తెచ్చే పనిలో ఉన్నాడన్నమాట!' అని మనసులోనే మురిసిపోయింది ఆవిడ. నిజానికి నాని ఫోన్ కాల్‌ను వాళ్ల అమ్మమ్మ మొత్తం వినేసింది!

తర్వాతి రోజు ఉదయం...

జయను కలవడానికి నాని ఎంతో ఉత్సాహంగా రెడీ అవుతున్నాడు. మామూలుగా బట్టల మీద పెద్దగా ధ్యాస పెట్టని నాని, ఈరోజు మాత్రం అద్దం ముందు నిలబడి ఏకంగా పది షర్టులు మార్చాడు. నాని పడుతున్న పాట్లు చూసి వాళ్ల అమ్మమ్మ, తాతయ్యలు తలుపు చాటు నుంచి ముసిముసిగా నవ్వుకుంటున్నారు.

"మొదట్లో నీకోసం నేను కూడా ఇలానే రెడీ అయ్యేవాడిని తెలుసా!" అని తాతయ్య తన ఫ్లాష్‌బ్యాక్ చెప్పుకొచ్చాడు.

"చాల్లే ఊరుకోండి, వాడు చూస్తాడు మళ్లీ!" అని ఆవిడ సిగ్గుపడింది.

నాని రెడీ అయ్యి బయటకు రాగానే... "నానీ, ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. దేనికైనా పనికొస్తాయి," అని తాతయ్య డబ్బులు ఇవ్వబోయాడు.

"నాకెందుకులే తాతయ్యా, నా దగ్గర ఉన్నాయి," అని కంగారుగా అక్కడి నుంచి బయలుదేరాడు నాని.

మరోవైపు...

జయ కూడా చాలా అందంగా తయారై, వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లింది.

"అమ్మా, నేను వైష్ణవితో కలిసి సినిమాకి వెళ్తున్నా. ఈవినింగ్‌కల్లా వచ్చేస్తా, ప్లీజ్ అమ్మా," అని అడిగింది అను (జయ).

"సినిమాకా? మూడు గంటల సినిమాకి సాయంత్రం దాకా పనేంటి బయట?" అని నిలదీసింది వాళ్ల అమ్మ.

"అదేంటమ్మా, నిన్న నిన్ను అడిగే కదా టికెట్లు బుక్ చేసుకున్నాను! నేను వెళ్లకపోతే ఆ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి," అని బుకాయించింది జయ.

"సరే అయితే, మధ్యాహ్నం 3 గంటలకల్లా ఇంట్లో ఉండాలి," అని కండిషన్ పెట్టింది వాళ్ల అమ్మ.

దానికి జయ చిరాకుగా, "ఏంటమ్మా? 3 గంటలంటే అది సాయంత్రమా ఏంటి? ఇంకెందుకు, మధ్యాహ్నమే వచ్చేస్తాలే," అని విసుక్కుంటూ బయటకు వెళ్లిపోయింది.

జయ తన స్నేహితురాలు వైష్ణవితో కలిసి సినిమా థియేటర్ దగ్గర నాని కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది. నానికి ఫోన్ చేసింది, కానీ అతని ఫోన్ 'అవుట్ ఆఫ్ నెట్‌వర్క్ కవరేజ్ ఏరియా' వస్తోంది.

సరిగ్గా అప్పుడే వాళ్ల వెనక ఉన్న టీ కొట్టు రేడియోలోంచి...

"ఏదే కుమారుడే లేని వేళలో... వింతలు రగిలేనే రాధ గుండెలో... పాపం రాధ... యమునా తీరంలో నల్లనాయకై ఎదురుచూసేనే రాధ..." అనే పాట వినిపిస్తోంది.

ఆ పాట జయ పరిస్థితికి అద్దం పడుతోంది. నానికి పదే పదే కాల్ చేస్తోంది, కానీ లైన్ కలవట్లేదు. జయకి ఏం చేయాలో అర్థం కాలేదు. పాపం ఆమెకు విసుగు, బాధ ముంచుకొచ్చాయి.

కళ్లు చెమరుస్తుండగా, "నేను ఇంటికి వెళ్తున్నా, నువ్వు సినిమా చూడు," అని నిరాశగా వెనుతిరిగింది.

వైష్ణవి ఆమెను ఆపి, "నేనొక్కదాన్ని ఎలా చూస్తానే? పదా ఇద్దరం కలిసే వెళ్లిపోదాం," అంది.

ఆ మాటకి జయ తట్టుకోలేక వైష్ణవిని హగ్ చేసుకుని, "వస్తానని మాట ఇచ్చి రాలేదు చూశావా..." అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

వైష్ణవి ఆశ్చర్యంగా, "ఏంటే? అసలు ఆ వ్యక్తి నీకేం అవుతాడు? ఎందుకంతలా ఫీల్ అవుతున్నావ్?" అని అడిగింది.

ఆ ప్రశ్న జయ మనసులో గట్టిగా నాటుకుపోయింది. దానికి ఏం బదులివ్వాలో, అతనెవరో ఆమెకు అర్థం కాలేదు. కళ్లు తుడుచుకుని, కవర్ చేసుకుంటూ... "పదా ఇంటికి పోదాం… ఏదో ఎమోషనల్ అయిపోయాను అంతే," అంది.

జయ మాట దాటేసినా, వైష్ణవికి మాత్రం అసలు విషయం అర్థమైపోయింది.

Jaya Janardana

By Ajay

Published: March 18, 2026 at 1:45 PM

© 2026 Ajay. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...