SCREEN ON

Loading File

Chapter 20

Chapter 19
Chapter 20
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 19

Jaya Janardana

Chapter 20
Chapter 19
Chapter 20

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 20

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

Active
20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

Final Episode

Chapter // 19

EPISODE 19

అప్పటి దాకా పక్కనే నిలబడి ఉన్న తేజ, జనార్దన్ దగ్గరికి వచ్చి,

“ఏ రా... వెళ్లిపోయిందా ఆ?” అని చిన్నగా నవ్వుతూ అడిగాడు.

జనార్దన్ కూడా చిరునవ్వు నవ్వి,

“వెంటనే వస్తా అని చెప్పింది,” అన్నాడు.

అలా చెబుతూనే తన జేబులో నుంచి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేయడానికి ప్రయత్నించాడు. అది గమనించిన తేజ,

“ఎవరికి రా ఫోన్ చేస్తున్నావ్?” అని అడిగాడు.

“వెంకట్‌కి. సాయంత్రం మనం వాళ్ల ఇంట్లో ఉండబోతున్నాం. అసలే లేట్ అయిపోతే వెళ్లడం కష్టం అవుతుంది. ముందే చెప్పేస్తే బెటర్ అనిపించింది,” అని జనార్దన్ సమాధానం ఇచ్చాడు.

అని చెప్పి వెంటనే వెంకట్‌కి కాల్ చేశాడు.

“హలో రా వెంకట్!” అన్నాడు జనార్దన్.

“అరే జనార్దన్! చెప్పు రా,” అని అటు వైపు నుంచి వెంకట్ ఉత్సాహంగా అన్నాడు.

“నేను, తేజ ఇద్దరం ఈ రోజు రాత్రి మీ ఇంట్లోనే ఉంటాం అనుకుంటున్నాం. ఆలస్యం అవుతుంది. నీకు ఓకేనా?”

“అరే దానికేం అడుగుతున్నావ్ రా! మీరు వస్తే నాకు సంతోషమే. నేరుగా వచ్చేయండి,” అని వెంకట్ ఆనందంగా చెప్పాడు.

“సరే రా, సాయంత్రం కలుద్దాం,” అని కాల్ ముగించాడు జనార్దన్.

ఫోన్ పెట్టగానే తేజ మొహం కొంచెం విచిత్రంగా మారింది.

“ఏమైంది రా?” అని అడిగాడు జనార్దన్.

“నిజం చెప్పాలంటే నాకు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంది రా,” అన్నాడు తేజ.

“ఎందుకు?”

“ఎందుకంటే ఆయన నీ చిన్నప్పటి ఫ్రెండ్. నాకు అసలు తెలియదు. నేను ఎప్పుడూ ఎవరి ఇంట్లోనైనా వెళ్లి ఉండలేదు. కొత్త వాళ్ల ఇంట్లో నైట్ స్టే అంటే నాకు చాలా ఇబ్బంది రా.”

జనార్దన్ నవ్వుతూ,

“అయ్యో! వెంకట్ చాలా మంచోడు రా. నువ్వు ఒకసారి కలిస్తే చాలు. మనిషి ఎంత సింపుల్‌గా ఉంటాడో తెలుస్తుంది,” అని చెప్పాడు.

“అది కాదు రా... నేను అక్కడికి వెళ్లాక ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అన్న టెన్షన్ ఉంటుంది.”

“నువ్వు ఎక్కడైనా ఎలా ఉంటావో అలాగే ఉండు. ఎవ్వరూ జడ్జ్ చేయరు,” అని జనార్దన్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.

కానీ తేజ మాత్రం తల ఊపాడు.

“లేదు రా. నాకు ఇంకా డౌటే.”

కొన్ని క్షణాలు ఆగి మళ్లీ అడిగాడు.

“ఒక ముఖ్యమైన విషయం... వాళ్ల ఇంట్లో వెస్టర్న్ టాయిలెట్ ఉందా?”

అది విన్న జనార్దన్ ఒక్కసారిగా నవ్వేశాడు.

“అదే నీ పెద్ద కంగారానా?”

“అవును రా! వెస్టర్న్ టాయిలెట్ ఉంటేనే వస్తా. లేకపోతే హోటల్ చూసుకుందాం!” అన్నాడు తేజ చాలా సీరియస్‌గా.

జనార్దన్ నవ్వుతూనే,

“అది కూడా ఫోన్ చేసి కన్ఫర్మ్ చేయాలా ఇప్పుడు?” అన్నాడు.

“చేయ్ రా! ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్,” అన్నాడు తేజ.

ఇద్దరూ అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటుండగా, కొద్దిదూరంలో అనూష తన ఫ్రెండ్స్‌తో కలిసి వస్తూ కనిపించింది.

అయితే ఈసారి అనూష ముఖంలో ఉదయం కనిపించిన ఆ ఉత్సాహం లేదు. ఆమె కళ్లలో ఏదో తెలియని భయం, మనసులో ఏదో భారంగా ఉన్న భావన కనిపించింది.

జనార్దన్ అది వెంటనే గమనించాడు.

“ఏదో ఉంది...” అని మనసులో అనుకున్నాడు.

అనూష వాళ్ల దగ్గరికి వచ్చి కొంచెం ఇబ్బందిగా నవ్వింది.

“జనార్దన్...” అని పిలిచింది.

“చెప్పు అనూష.” అని అన్నాడు జనార్దన్ .

“మా ఫ్రెండ్స్ పేరెంట్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు. వాళ్లు వెంటనే ఇంటికి రావాలని చెబుతున్నారు. అందుకే మేము ఇప్పుడే బయలుదేరాలి.” అని అంది అనుష.

జనార్దన్ ముఖం మీద నవ్వు అలాగే ఉన్నా, అతని మనసు మాత్రం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది.

“అలానా...” అని అన్నాడు జనార్దన్

“అవును. ఇంకా కొంతసేపు మీతో ఉండాలని అనుకున్నాం. కానీ పరిస్థితి అలా లేదు. సారీ...” అని అనుష అంది

అనూష మాటల్లో సాధారణత ఉన్నా, ఆమె కళ్లలో మాత్రం చెప్పలేని బాధ కనిపించింది.

జనార్దన్ ఆమెను చూస్తూ నిలబడ్డాడు.

ఈ కొన్ని నెలల్లో వాళ్లు ఎంత మాట్లాడుకున్నారో అతనికి గుర్తొచ్చింది.

కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, ప్రతి రోజు ఒకరినొకరు పలకరించుకునేవారు.

జనార్దన్ కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి ధైర్యం చెప్పింది అనూషే.

అతను బాధగా ఉన్నప్పుడు గంటల తరబడి మాట్లాడి నవ్వించింది కూడా ఆమెనే.

వాళ్లు ఎన్నో నెలలు ఎదురు చూసింది ఈ ఒక్క రోజు కోసమే.

కొన్ని గంటల పాటు అయినా కలిసి గడపాలని.

గోదావరి ఒడ్డున కూర్చొని మాట్లాడాలని.

గుడిలో కలిసి దర్శనం చేసుకోవాలని.

ఒకరినొకరు నిజంగా చూసి ఆ జ్ఞాపకాలను జీవితాంతం దాచుకోవాలని.

కానీ ఇప్పుడు ఆ సమయం చేతుల మధ్య ఇసుకలా జారిపోతోంది.

అయినా తన మనసులోని బాధను బయటకు చూపించకుండా,

“ఇట్స్ ఓకే అనూష. మీరు వెళ్లండి. మళ్లీ కలుద్దాం,” అన్నాడు జనార్దన్.

అతని పెదవులపై చిరునవ్వు ఉంది.

కానీ ఆ చిరునవ్వు వెనుక దాగి ఉన్న బాధను అతని గుండె మాత్రమే అర్థం చేసుకుంది.

ఎందుకంటే...

మొదటిసారి ఆమెను చూసిన ఆ క్షణం నుంచి అతనికి తిరిగి వెళ్లాలని అసలు అనిపించలేదు.

ఆమెతో గడిపిన ప్రతి నిమిషం అతనికి ఎంతో విలువైనది.

అనూష కూడా తల ఊపి,

“సరే... బై,” అని చెప్పింది.

ఆమె ఫ్రెండ్స్ ముందుకు నడవడం ప్రారంభించారు.

జనార్దన్ కూడా “బై” చెప్పి అక్కడే నిలబడ్డాడు.

వాళ్లు దూరమవుతున్నారు.

అతని మనసు మాత్రం ఒక్కసారి వెనక్కి తిరిగి అనూష ఇంకా కనిపిస్తుందా అని చూడమని చెబుతోంది.

కానీ అతను చూడలేదు.

ఉద్దేశపూర్వకంగానే చూడలేదు.

ఎందుకంటే మరోసారి ఆమెను చూస్తే తన భావోద్వేగాలను దాచుకోలేనని అతనికి తెలుసు.

అందుకే తల తిప్పకుండా అలాగే నిలబడ్డాడు.

కానీ...

కొన్ని అడుగులు వేసిన తర్వాత అనూష మాత్రం ఆగింది.

నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది.

దూరంగా నిలబడి ఉన్న జనార్దన్ కనిపించాడు.

అతను మాత్రం ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు.

ఆ దృశ్యం చూసిన అనూష కళ్లలో నీళ్లు మెరిశాయి.

మనసులో మాత్రం ఒక్క మాట మార్మోగింది.

“ఐ యామ్ సారీ జనార్దన్... బహుశా మనం మళ్లీ ఎప్పటికీ కలవకపోవచ్చు...”

అని ఆమె మనసులోనే చెప్పుకుంది.

గోదావరి గాలి నెమ్మదిగా వీచింది.

సాయంత్రపు వెలుతురు క్రమంగా చీకటిలో కలిసిపోతోంది.

ఒక వైపు ఇద్దరి హృదయాల్లో చెప్పని మాటలు...

మరో వైపు విధి రాసిన నిశ్శబ్ద వీడ్కోలు...

అలా వారి మొదటి కలయిక, ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి ముగింపు వైపు నడిచింది.

Jaya Janardana

By Ajay

Published: June 10, 2026 at 7:49 AM

© 2026 Ajay. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...