Loading File
Initializing...
Chapter 1
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
మనమందరం తెలిసో తెలియకో జీవితంలో ఎన్నో తప్పులు చేస్తుంటాం. అందులో కొన్నింటిని సరిదిద్దుకోగలం, మరికొన్నింటిని మాత్రం ఎప్పటికీ సరిదిద్దుకోలేం. ఇదిలా ఉండగా, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎవరో ఒకరిని చాలా గాఢంగా ప్రేమించిన అనుభవం ఉండే ఉంటుంది. ఎంతలా అంటే, మన మనసు ఎల్లప్పుడూ వాళ్ళ ఆలోచనలతోనే నిండిపోయేంతగా! ఆ జ్ఞాపకాలతో సతమతమవుతూ... 'అసలు ఎందుకు ప్రేమించానా?' అని కొన్నిసార్లు అనిపిస్తుంది. 'అసలు వాళ్ళు మన జీవితంలోకి ఎందుకు వచ్చారో, అర్థంతరంగా ఎందుకు దూరమైపోయారో' అర్థం కాని అయోమయం ఇంకొన్నిసార్లు కలుగుతుంది. సరిగ్గా ఇప్పుడు మన కథానాయకుడు 'జనార్దన్' కూడా అలాంటి మానసిక సంఘర్షణనే అనుభవిస్తున్నాడు.
జనార్దన్ వృత్తిరీత్యా ఒక కెమెరామెన్. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఫోటోగ్రఫీ చేస్తుంటాడు. గతం గురించి చెప్పాలంటే.. అతనికి తెలియకుండానే, అసలు అతని ప్రమేయమే లేకుండానే అతని జీవితంలో జరగకూడని ఒక పెద్ద తప్పు జరిగిపోయింది.
పగలంతా షూటింగ్స్‌తో తీరిక లేకుండా గడిపే అతనికి, రాత్రి పూట తోడుండే ఏకైక ప్రాణ స్నేహితుడు 'తేజ'. ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లోని ఒకే గదిలో ఉంటున్నారు. జనార్దన్ ఇతరులతో పెద్దగా కలవడు, మాట్లాడడు. ఉదయం లేచి షూట్‌కి వెళ్ళడం, రావడం, ఎడిటింగ్ చేసుకోవడం, పడుకోవడం... ఇదీ జనార్దన్ దినచర్య. కనీసం సొంత రూమ్‌మేట్ అయిన తేజతో కూడా తక్కువే మాట్లాడేవాడు.
ఒకరోజు అతను తన ఫోన్‌లో వాళ్ల ఫ్యామిలీ ఫోటోనే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు. అందులో వాళ్ల అమ్మ, నాన్న, అక్క ఉన్నారు. ఆ ఫోటో చూస్తున్నప్పుడు అతని కళ్లలో ఏదో చెప్పలేని బాధ స్పష్టంగా కనిపిస్తోంది.
తేజ, జనార్దన్‌కు కేవలం స్నేహితుడు మాత్రమే కాదు, అతన్ని అర్థం చేసుకున్న ఒక మంచి తోడు. వాళ్లు తమ వర్క్ మీద ముంబై, ఢిల్లీ, చెన్నై, పూణే లాంటి నగరాలన్నీ తిరిగి, చివరకు ప్రస్తుతం ఒక పని మీద విశాఖపట్నం చేరుకున్నారు.
ఒకరోజు తేజ గదిలోకి వస్తూనే ఉత్సాహంగా, "ఒరేయ్! ధోనీకి ఇదే లాస్ట్ సీజన్ అంటరా. ఎలాగో మన వైజాగ్‌లో ఢిల్లీతో మ్యాచ్ జరుగుతోంది. ఈరోజు మనం ఖాళీగానే ఉన్నాం కాబట్టి, అలా వెళ్లి చూసొద్దాం పదా!" అన్నాడు.
అది విన్న జనార్దన్ నిర్లిప్తంగా, "నా చిన్నప్పటి నుంచి అదే అంటున్నాడులే ఆయన..." అన్నాడు.
దానికి తేజ కాస్త నిరాశగా, "పోనీ, నన్నైనా వెళ్లమంటావా?" అని అడిగాడు.
జనార్దన్ ఒక్కసారిగా అతని వంక కాస్త కోపంగా చూస్తూ, "అరేయ్! నీకు కొంచెం కూడా వర్క్ మీద ఫోకస్ లేదురా... ఇలా అయితే ఎలా?" అని చివాట్లు పెడుతూనే, వెంటనే మాట మారుస్తూ... "సరే, పదా పోదాం స్టేడియానికి!" అన్నాడు.
ఆ చివరి మాట వినగానే తేజ ఎగిరిగంతేసి, "మావా... ewwuu... తలా ఫర్ ఎ రీజన్ (Thala for a reason) ⚡" అని గట్టిగా అరుస్తూ సంబరపడిపోయాడు.
Jaya Janardana
By Ajay
Published: March 12, 2026 at 3:20 PM
Your input calibrates the database for others.
Ready to play...