SCREEN ON

Loading File

Chapter 8

Chapter 7
Chapter 8
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 7

Jaya Janardana

Chapter 8
Chapter 7
Chapter 8

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 8

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

Active
08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

Final Episode

Chapter // 07

EPISODE 7

మూడు నెలల తర్వాత...

నాని జుట్టు, గడ్డం బాగా పెంచేశాడు. సాధారణంగా అబ్బాయిలు జుట్టు పెంచారంటే అందులో కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. జీవితంలో ఏదైనా పెద్ద మార్పును కోరుకుంటున్నప్పుడు లేదా ఏదైనా తీవ్రమైన మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నప్పుడు మాత్రమే అలా చేస్తుంటారు. ఇప్పుడు నాని పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది.

నాని, తేజ కలిసి ఒక వెడ్డింగ్ షూట్‌లో ఉన్నారు. నాని ఫోటోలు తీస్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో జనాలు అడ్డుగా వస్తున్నారు. లోపల ఎంతో చిరాకు, కోపం ఉన్నా ఓపిక తెచ్చుకుని, “మేడమ్, కొంచెం ఆ వెనక్కి వెళ్తారా? ఫోటో సరిగ్గా రావడం లేదు,” అని అన్నాడు నాని.

మళ్లీ మధ్యలోకి చిన్నపిల్లలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఒకపక్క కెమెరా హీటెక్కిపోతోంది. మరోపక్క క్లైంట్స్ అస్సలు కోపరేట్ చేయడం లేదు. నానికి ఫుల్‌గా చెమటలు పట్టేశాయి. దానికి తోడు దాహంగా ఉండి నీళ్లు అడిగినా ఎవరూ పట్టించుకోలేదు.

అది గమనించిన తేజ, “రేయ్, నువ్వు కాసేపు కూర్చో, నేను తీస్తాలే,” అన్నాడు.

నాని వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. ఎవరినో ఒకరిని వాటర్ తీసుకురమ్మని అడిగాడు. వాళ్లు ఎంతసేపైనా తీసుకురాలేదు. దాంతో నానిలోని అసహనం కట్టలు తెంచుకుంది.

ఒక్కసారిగా పైకి లేచి, “ఏమనుకుంటున్నారు మీరంతా? డబ్బులిస్తే సరిపోతుందా? మేమూ మనుషులమే సార్! మమ్మల్ని ఎందుకిలా ట్రీట్ చేస్తారు?” అని గట్టిగా అరిచేశాడు.

అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యి నాని వైపే చూశారు. ఆ అరుపుకి దెబ్బకి అంతా సైలెంట్ అయిపోయారు.

వెంటనే తేజ పరుగెత్తుకుంటూ వచ్చి, “రేయ్, అందరూ చూస్తున్నారు. క్లైంట్స్ ఫీల్ అవుతారు, బాగోదు. కామ్ డౌన్! కోపం మనకి మొదటి శత్రువు అని నువ్వే కదరా చెప్పేవాడివి!” అని నానిని కూల్ చేశాడు.

అప్పుడు నానికి తను చేసిన తప్పు రియలైజ్ అయ్యి, “సారీ అండీ. నా పర్సనల్ లైఫ్ ఏం బాగోలేదు, ఆ ఫ్రస్ట్రేషన్‌లో అలా అరిచేశాను. తప్పు నాదే, ఐ యామ్ సారీ,” అని క్షమాపణ అడిగాడు.

సరిగ్గా అప్పుడే పక్కనుంచి ఒక చిన్న పాప వచ్చి, “అన్నయ్యా, నీకోసం ఫ్రిజ్‌లోంచి వాటర్ తీసుకొచ్చాను,” అని చాలా ముద్దుగా ఆ గ్లాస్ అందించింది.

నాని ఆ వాటర్ తీసుకుంటూ తాను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థం చేసుకుని, క్లైంట్ వైపు చూసి కళ్లతోనే మరోసారి సారీ చెప్పాడు.

షూట్ ముగిసింది.

నాని ఒక్కడే మేడ మీద (టెర్రస్ మీద) నిలబడి దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు.

తేజ కూడా పైకి వచ్చి, “ఏంట్రా, వాళ్లని అపార్థం చేసుకున్నానని ఫీల్ అవుతున్నావా?” అని అడిగాడు.

నాని ఆలోచనలోంచి బయటపడి, “అదేం లేదు రా. అమ్మమ్మని చూసి ఐదు నెలలవుతోంది. ఇంటికి వెళ్లి సరదాగా కొన్ని రోజులు ఉండాలనిపిస్తోంది,” అన్నాడు.

అప్పుడు తేజ, “సరే వెళ్లిరా. ఎలాగూ మనకి పెళ్లిళ్ల సీజన్ అయిపోయింది కదా, నీ ఇష్టం. నేను కూడా మా ఇంటికి వెళ్లిపోతాను మరి,” అంటూ మనసులో మాత్రం (హమ్మయ్య, మొత్తానికి ఆరు నెలల తర్వాత ఇంటికి వెళ్తున్నా) అనుకుని సంతోషపడ్డాడు.

ఇంతలో హఠాత్తుగా నాని ఇన్‌స్టాగ్రామ్‌కి ఒక మెసేజ్ రిక్వెస్ట్ వచ్చింది. అది బ్లాంక్ మెసేజ్.

నాని దాన్ని యాక్సెప్ట్ చేసి, ఎవరో ఏంటో తెలుసుకుందామని “?” అని రిప్లై పెట్టాడు.

అవతలి వ్యక్తి నుంచి “సారీ అండీ, అనుకోకుండా సెండ్ అయ్యింది,” అని రిప్లై వచ్చింది.

అది చూసిన తేజ, “రేయ్, అనుకోకుండా ఎవరూ అలా మెసేజ్ చేయరు! ఎవరో కావాలనే నీతో ఆడుకుంటున్నారు, జాగ్రత్త,” అన్నాడు.

నాని నవ్వుతూ, “నేనేమన్నా ఈ దేశానికి అందగాడినా రా, నాతో ఆడేసుకోవడానికి? ఎదవ!” అని తేజను ఆటపట్టించి... ఫోన్‌లో “ఇట్స్ ఓకే అండీ,” అని రిప్లై ఇచ్చాడు.

అప్పుడు ఆ అమ్మాయి, “అండీ ఎందుకండి. నేను మీకన్నా ఏజ్‌లో చిన్నదాన్నే. జయ అని పిలవండి చాలు!” అని పెట్టింది.

నాని ఆశ్చర్యంగా తేజ వైపు చూసి, “రేయ్ తేజా, ఎవరో అమ్మాయి రా,” అన్నాడు.

అప్పటికే కిందకి వెళ్దామనుకున్న తేజ, ఆత్రం ఆపుకోలేక మళ్లీ వెనక్కి వచ్చాడు.

నాని మెసేజ్ చేస్తూ, “సరే జయ, ఇంతకీ నాకెందుకు మెసేజ్ చేసినట్టు?” అని అడిగాడు.

“మా అక్క పెళ్లి ఉంది. షూట్‌కి వస్తారా? నేను మా పెద్దనాన్నకి మీ కాంటాక్ట్ ఇస్తాను,” అని అడిగింది జయ.

“సరే ఓకే,” అని జవాబిచ్చాడు నాని.

అది చూసిన తేజ గుండె గుభేల్ మంది. ‘అమ్మో మళ్లీ షూటా! ఇక్కడి నుంచి మెల్లగా జారుకుందాం,’ అనుకుని ఆ మెసేజ్ చూడనట్టుగా కిందకి మెల్లగా అడుగులు వేశాడు.

కానీ నాని వెంటనే, “అన్నా తేజా! కాస్త ఆ లెన్స్ క్లీన్ చెయ్యి అమ్మా!” అన్నాడు.

తేజ నిరాశగా తల కొట్టుకుంటూ, “కిందకి పోయేవాడిని అనవసరంగా వెనక్కి వచ్చాను! తూ… ఇక నేను ఇంటికి వెళ్లినట్టే,” అని గొణుక్కున్నాడు.

నాని ఫోన్ చూస్తూనే, “రేయ్, ఇంతకీ తను నిజంగా క్లైంట్ అయితే ఫోన్ చేయాలి గానీ... ఇలా నా పర్సనల్ అకౌంట్‌కి మెసేజ్ ఎందుకు చేసిందంటావ్?” అని డౌట్ వ్యక్తం చేశాడు.

దానికి తేజ నవ్వుతూ, “ఏమోరా... బహుశా మీ శ్రీనివాస్ గాడికే నీ మీద ఫీలింగ్స్ వచ్చాయేమో!” అని సెటైర్ వేశాడు.

ఆ మాట వినగానే నానికి కోపం వచ్చి, పక్కనే ఉన్న వాటర్ బాటిల్ విసిరికొట్టబోయాడు. తేజ నవ్వుకుంటూ కిందకి పారిపోయాడు.

Jaya Janardana

By Ajay

Published: March 14, 2026 at 10:44 AM

© 2026 Ajay. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...