SCREEN ON

Loading File

Chapter 23

Chapter 22
Chapter 23
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 22

Jaya Janardana

Chapter 23
Chapter 22
Chapter 23

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 23

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

Active
23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

Final Episode

Chapter // 22

EPISODE 22

మరుసటి రోజు...

మధ్యాహ్నం సమయం.

హైదరాబాద్ నగరం తన సాధారణ రద్దీతో ముందుకు సాగుతోంది. రోడ్ల మీద వాహనాల శబ్దాలు, దూరంగా వినిపిస్తున్న హార్న్లు, ఎండ వేడి—అన్నీ తమ పనిలో తాము ఉన్నాయి.

కానీ జనార్దన్ మనసులో మాత్రం ఇంకా నిన్న రాత్రి ముగియలేదు.

---

రైలులో గడిచిన ఆ రాత్రి అతని జీవితంలోనే అతి పొడవైన రాత్రిలా అనిపించింది.

నిద్ర లేదు.

ప్రశాంతత లేదు.

మనసులో మాత్రం జయ జ్ఞాపకాలు, ప్రసాద్ జ్ఞాపకాలు, తన నిర్ణయం...

అన్నీ కలగలిసి ఒక తుఫానులా తిరుగుతున్నాయి.

---

ఎట్టకేలకు మధ్యాహ్నానికి జనార్దన్, తేజ ఇద్దరూ తమ రూమ్ దగ్గరకు చేరుకున్నారు.

మెట్లెక్కి తమ గది ముందు వచ్చేసరికి తేజ కంటికి ఒక విషయం కనిపించింది.

---

తలుపు దగ్గర నేల మీద ఒక ఉత్తరం పడి ఉంది.

తెల్లటి కవర్.

దాని మీద ఎలాంటి పేరు లేదు.

---

“ఇదేంటి?” అని అనుకుంటూ తేజ దాన్ని తీసుకున్నాడు.

కొద్దిసేపు అటూ ఇటూ తిప్పి చూశాడు.

కానీ అలసట ఎక్కువగా ఉండడంతో,

“తర్వాత చూద్దాం,” అని అనుకుని గదిలోకి తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టేశాడు.

---

అప్పటికే జనార్దన్ పరిస్థితి పూర్తిగా అలసిపోయిన యోధుడిలా ఉంది.

రాత్రంతా నిద్రలేకపోవడం...

మానసికంగా విరిగిపోవడం...

ప్రయాణం...

అన్నీ కలిపి అతనిలోని శక్తినంతా పీల్చేశాయి.

---

గదిలోకి వచ్చిన వెంటనే బ్యాగ్ కూడా పక్కన పడేసి...

బట్టలు మార్చుకోకుండా...

అలాగే మంచం మీద పడిపోయాడు.

---

కొన్ని క్షణాల్లోనే గాఢ నిద్రలోకి జారిపోయాడు.

---

తేజ మాత్రం అతని వైపు చూస్తూ నిలబడ్డాడు.

---

“పాపం రా...వీడి జీవితమంతా సమస్యలే ఎందుకో...” అని అని మనసులో అనుకుని దగ్గరలో ఉన్న టవల్ తీసుకుని స్నానం చేయడానికి వెళ్లిపోయాడు తేజ

---

అదే సమయంలో...

జనార్దన్ గాఢ నిద్రలో ఉన్నాడు.

---

కానీ...

అది సాధారణ నిద్ర కాదు.

---

ఏదో తెలియని ప్రపంచంలోకి అతను నెమ్మదిగా జారిపోతున్నాడు.

---

అతని చుట్టూ ఒక్కసారిగా వెలుగు వ్యాపించింది.

---

కళ్లు తెరిచి చూసేసరికి...

తాను ఒక పాత దేవాలయం ప్రాంగణంలో నిలబడి ఉన్నాడు.

---

అది అమ్మవారి గుడి.

---

అతనికి చాలా పరిచయమైన ప్రదేశం.

చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు వచ్చిన ఆలయం.

---

గుడి లోపల గంటలు మోగుతున్నాయి.

ధూపం వాసన గాలిలో తేలుతోంది.

---

అమ్మవారి ముందు ఒక వృద్ధురాలు భక్తితో పూజ చేస్తోంది.

---

జనార్దన్ కాసేపు జాగ్రత్తగా చూసాడు.

ఆమె...

తన అమ్మమ్మ.

---

“అమ్మ...”

అని అనబోయాడు.

---

కానీ మాట బయటకు రాలేదు.

---

గుడి బయట ఉన్న అరుగుపై తాను, వెంకట్ ఇద్దరూ కూర్చుని ఉన్నట్టు కనిపించింది.

---

వెంకట్ ఏదో మాట్లాడుతున్నాడు.

కానీ శబ్దం వినిపించడం లేదు.

---

అంతలో...

గుడి ద్వారం వైపు నుంచి ఒక రూపం నెమ్మదిగా లోపలికి వచ్చింది.

---

జనార్దన్ చూపు అక్కడే ఆగిపోయింది.

---

అది...

అనూష (జయ)

---

ఆమెను చూసిన క్షణంలో అతను వెంటనే లేచి నిలబడ్డాడు.

---

ఆమె ఈసారి అతను ఎప్పుడూ చూడని రూపంలో ఉంది.

---

లేత ఎరుపు రంగు లంగా-వోణీ.

తలలో మల్లెపూలు.

నుదిటిపై చిన్న బొట్టు.

---

ఆమె నడుచుకుంటూ వస్తుంటే...

ఒక సాధారణ అమ్మాయి కాదు...

గుడి నుంచి బయటకు వచ్చిన దేవతలా కనిపిస్తోంది.

---

కానీ...

ఆమె కళ్లలో మాత్రం ప్రశాంతత లేదు.

అక్కడ ఆందోళన ఉంది ,భయం ఉంది, బాధ ఉంది.

ఆమె నేరుగా జనార్దన్ దగ్గరకు వచ్చింది.

కొన్ని క్షణాలు అతని కళ్లలోకి చూసింది.

తర్వాత...

ఏడుపు ముఖంతో అడిగింది.

“నన్ను మర్చిపోయావు కదా...?”

---

ఆ మాట విన్న క్షణంలో జనార్దన్ గుండె బరువెక్కింది.

అతనికి సమాధానం తెలుసు.

కానీ చెప్పలేకపోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా...

నెమ్మదిగా ఆమె పక్కనుండి వెళ్లిపోయాడు.

అనూష కళ్లలో నీళ్లు తిరిగాయి.

అయినా ఆమె ఇంకేమీ అనలేదు.

గుడిలోకి వెళ్లి అమ్మవారికి పూజ చేసింది.

కొద్దిసేపటి తర్వాత ప్రసాదం తీసుకుని బయటకు వచ్చింది.

---

ఆ ప్రసాదాన్ని జనార్దన్ అమ్మమ్మ చేతిలో పెట్టి...

“ఇది జనార్దన్‌కి ఇవ్వండి...” అని అంది జయ

---

కొద్దిసేపటి తర్వాత అమ్మమ్మ జనార్దన్ దగ్గరకు వచ్చింది.

చేతిలో ప్రసాదం ఉంది.

“ఈ ప్రసాదం ఆ అమ్మాయి ఇచ్చింది తీస్కో "అంది.

“ఆ పిల్ల ఎంత ముద్దుగా ఉందో చూశావా?”

“చాలా మంచిపిల్లలా అనిపించింది.”

అని నవ్వింది.

జనార్దన్ ప్రసాదం చేతిలో తీసుకున్నాడు.

అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది.

“అమ్మ...ఇది నాకు చెందాల్సిన ప్రసాదం కాదు ఇది... వేరే వాళ్లది.” అని అన్నాడు జనార్దన్

అలా చెప్పి...

గుడి వెనుక ఉన్న చీకటి వైపు నడిచాడు.

అక్కడ...

నల్లటి పొగలా ఒక ఆకారం నిలబడి ఉంది.

---

మొదట అది మనిషిలా కనిపించింది.

తర్వాత పొగలా మారింది.

అది ఒక ఆత్మ.

---

అంతులేని బాధతో...

అంతులేని వేదనతో...

ఎవరికోసం ఎదురు చూస్తున్న ఆత్మ.

---

జనార్దన్ ఆ ప్రసాదాన్ని దాని ముందు ఉంచాడు.

ఆ ఆత్మ నెమ్మదిగా దాన్ని స్వీకరించింది.

అప్పుడే...

దాని వెనుక మరికొన్ని ఆకారాలు కనిపించాయి.

నల్లటి నీడలు.

చిన్న చిన్న కుక్కపిల్లల ఆకారాల్లో ఉన్న భయంకరమైన ప్రేతరూపాలు.

వాటి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి.

ఆ నల్లని ఆత్మ ఆ ప్రసాదాన్ని తనకు మాత్రమే కాకుండా వాటికీ పంచింది.

ఒక్కసారిగా...

ఆకాశాన్ని చీల్చేలా ఒక అరుపు వినిపించింది.

ఆ ఆత్మ భయంకరంగా గర్జించింది...మరోసారి...మరింత బలంగా.

ఆ గర్జనతో గుడి మొత్తం కంపించింది.

ఆకాశం కంపించింది , భూమి కంపించింది.

అంతే..

“ఆఆఆఆఆఆఆఆఆ...!”

అని వినిపించిన ఆ గర్జనతో జనార్దన్ ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచిపోయాడు.

శరీరమంతా చెమటలతో తడిసిపోయింది.

---

ఊపిరి వేగంగా పీలుస్తున్నాడు

అప్పుడే స్నానం చేసి వచ్చిన తేజ అతన్ని చూసి భయపడ్డాడు.

---

“ఏమైంది రా?”

“పీడకల వచ్చిందా?” అని అడిగాడు తేజ

జనార్దన్ కొద్దిసేపు మౌనంగా కూర్చున్నాడు.

తన కల గురించి ఏమీ చెప్పలేదు.

కానీ...

ఆ కల అతని లోపల ఏదో మార్చేసింది, కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా అన్నాడు.

“నేను..కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లాలి.”

తేజ ఆశ్చర్యపోయాడు.

“నేను కూడా వస్తాను.” జనార్దన్ తల అడ్డంగా ఊపాడు.

“లేదు ఈసారి ఒంటరిగా వెళ్లాలి , అన్నిటికీ దూరంగా...”

మనుషులకు దూరంగా..గతానికి దూరంగా...నేను ఎవరో...నా అస్తిత్వం ఏంటో...తెలుసుకోవాలి.” అన్నాడు జనార్దన్

---

అదే సమయంలో...

టేబుల్ మీద ఉన్న ఆ ఉత్తరం గాలి తాకిడికి ఎగిరి జనార్దన్ కాళ్ల దగ్గర పడింది.

అతను చూడబోయేలోపే...

తేజ దాన్ని తీసుకుని మళ్లీ పక్కన పెట్టేశాడు.

“తర్వాత చూద్దాం."

అన్నాడు.

--

జనార్దన్ నెమ్మదిగా మంచం మీద నుంచి లేచాడు.

గదిలో మూలన ఉన్న తన కెమెరా తీసుకున్నాడు.

---

అదే క్షణంలో...

పక్క రూమ్ నుంచి ఒక పాట వినిపించింది.

"Just Beat It..."

మైఖేల్ జాక్సన్ గాత్రం గదిలోకి మెల్లగా ప్రవేశించింది.

ఆ పాట బీట్ గాలిలో మార్మోగుతోంద.

జనార్దన్ కెమెరా పట్టుకుని కిటికీ బయటకు చూశాడు.

ఆతని కళ్లలో మొదటిసారి ఒక ప్రశ్న కనిపించింది

" నేను ఎవరిని "?

Jaya Janardana

By Ajay

Published: June 11, 2026 at 6:39 AM

© 2026 Ajay. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...