Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
"తమరు ఆర్టీసీ బస్సులో వస్తారని తెలిసే తను కూడా ఆ బస్సులో వస్తోందేమో ఎవడికి తెలుసు? ఏదేమైనా సరే... ఆ అమ్మాయికి మాత్రం నీ మీద ఏదో ఉంది మావా," అని ప్రణీత్ అన్న మాటలకు ముకుంద్ కంగారుపడుతూ... "రేయ్... నా దరిద్రం గురించి తెలిసి కూడా నన్నెందుకురా లవ్ చేస్తుంది?" అని అమాయకంగా అడిగాడు.
సరిగ్గా అదే సమయానికి ముందు బెంచ్‌లో ఉన్న ఆద్య వెనక్కి తిరిగి ముకుంద్ వైపు చూసింది.
అది గమనించిన ప్రణీత్ అతన్ని తట్టి, "రేయ్... నిన్నే చూస్తోందిరా, కనీసం ఓ 'హాయ్' చెప్పు," అని ఉత్సాహపరిచాడు.
కానీ ఆద్య కేవలం ఒక రెండు సెకన్లు అలా చూసేసరికే... ముకుంద్‌కు కళ్లు, చేతులు వణికిపోయాయి. ఆ చూపును ఫేస్ చేయలేక భయపడిపోయాడు.
అది చూసిన ప్రణీత్ తలపట్టుకుని... "నీ యబ్బ... ఒక అమ్మాయి అంత ధైర్యంగా వెనక్కి తిరిగి చూస్తుంటే, పలకరించలేని నువ్వున్నావూ... ఛీ దండగ," అని చిరాకు పడ్డాడు.
"ఏమో రా బాబూ... అలా సడన్‌గా చూసేసరికి నాకేం అర్థం కాలేదు," అని కంగారుగా అన్నాడు ముకుంద్.
మరోవైపు ఆద్య, తన పక్కన కూర్చున్న ఒక అమ్మాయిని ముకుంద్ గురించి మెల్లిగా అడిగింది.
దానికి ఆ అమ్మాయి వింతగా ముఖం పెట్టి, "వాడా... అడగక అడగక వాడి గురించా అడిగావు?" అంది ఆశ్చర్యంగా.
"ఏం... ఎందుకలా అన్నావు? అంత బ్యాడ్ బాయా తను?" అని ఆద్య ఆరా తీసింది.
"వాడు బ్యాడ్ అయినా బానే ఉండును... కానీ వాడు కనీసం ఇప్పటి వరకు మన క్లాస్‌లో ఏ అమ్మాయితోనూ మాట్లాడిందే లేదు. ఒకసారి నేనే వెళ్లి పలకరిస్తే... నన్ను ఏకంగా 'చెప్పండి' అని మరీ ఓవర్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. వాడి మాటలు వింటుంటే... నేనేదో ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉన్న ఫీలింగ్ వచ్చింది తెలుసా," అని ముఖం చిట్లించుకుంటూ విసుక్కుంది ఆ అమ్మాయి.
ఆ మాటలు విన్న ఆద్యకు నవ్వాగలేదు. 'ఓహో... అందుకే నేను పలకరించినా తిరిగి మాట్లాడేవాడు కాదన్నమాట! మరీ ఇంత భయమైతే ఎలా రా బాబూ,' అని మనసులో అనుకుని... ముకుంద్ వంక మళ్లీ వెనక్కి తిరిగి చూసింది.
అది గమనించిన ప్రణీత్, ముకుంద్ కుడి భుజాన్ని గోకుతూ... "ఒరేయ్... ఆ పిల్ల మళ్లీ నిన్నే చూస్తోంది రా," అన్నాడు.
వెంటనే ముకుంద్ చిరాకుగా, భయంగా... "అమ్మ దీనమ్మా... మావా, నాకెందుకో ఇది ఏదో తేడాగా కొడుతోంది రా. కొంపతీసి మా నాన్న, వాళ్ల నాన్న దగ్గర ఏమైనా అప్పు చేశాడంటావా? లేకపోతే మరీ ఇంతలా చూసేస్తోంది ఏంటి?" అన్నాడు.
ఆ మాటలకు ప్రణీత్‌కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. "చూడక చూడక ఒక అమ్మాయి చూస్తుంటే... అందులో కూడా దరిద్రాన్నే వెతుకుతున్నావేంట్రా? పిచ్చి నా డాష్..." అని గట్టిగా తిట్టాడు.
అది విన్న ముకుంద్ కొద్దిగా తేరుకుని, "నువ్వనేది కూడా కరెక్టే కదరా... ఎందుకు చూస్తోందో వెళ్లి అడిగేద్దాం పదా," అని కుర్చీలోంచి లేవబోయాడు.
Shunyam
By Storytravel
Published: March 5, 2026 at 2:14 AM
Your input calibrates the database for others.
Ready to play...