Loading File
Initializing...
Chapter 11
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
ఆద్య, ముకుంద్ వాళ్ల బస్టాప్‌లో దిగుతారు. ముకుంద్ ఆద్యతో మాట్లాడలేక చాలా వేగంగా ముందు నడుస్తుంటాడు. వెంటనే ఆద్య కూడా అతని వాకింగ్ స్పీడ్‌ను మ్యాచ్ చేయాలని ప్రయత్నిస్తుంది. ముకుంద్ స్పీడ్‌గా నడుస్తుంటే, ఆద్య అతని వెనకే పరిగెడుతూ...
"ముకుంద్... ఆగు," అంటుంది.
ఆ మాట వినగానే ముకుంద్ ఆగిపోతాడు. ఇద్దరూ పక్కపక్కనే నడుస్తుంటారు. కానీ ముకుంద్ మాత్రం ఏం మాట్లాడాలో పాలుపోక సైలెంట్‌గా ఉండిపోతాడు.
'ఈ సైలెన్స్‌ను ఎలా బ్రేక్ చేయాలిరా దేవుడా...' అని మనసులో అనుకుంటుంది ఆద్య. ఏం చేయాలో తెలియక...
"భలే డీల్ చేశావు ముకుంద్ ఆ సిట్యుయేషన్‌ని... నీ ప్లేస్‌లో నేనుంటే అంతగా ఆలోచించేదాన్ని కాదు," అంటుంది.
అప్పుడు ముకుంద్, ఆమె వైపు చూడకుండా పక్కకు చూస్తూ "హా... థ్యాంక్స్," అంటాడు.
అలా ముకుంద్ తన వంక చూడకుండా మాట్లాడుతుంటే, ఆద్యకు కోపం వచ్చి నేరుగా అతని ముందుకు వెళ్లి నిలబడుతుంది.
"ఆగు... చూడు, నేనేమన్నా నిన్ను తినేస్తానా? లేక నీకు రాక్షసిలా కనిపిస్తున్నానా? యు కాంట్ ట్రీట్ మీ లైక్ థిస్," అని కాస్త సీరియస్‌గా అడుగుతుంది.
పాపం ముకుంద్ భయం భయంగా ఆద్య కళ్లలోకి చూస్తూ... "ఐయామ్ సారీ," అంటాడు.
ముకుంద్ సారీ చెప్పిన విధానం, ఆ అమాయకత్వం చూసి ఆద్యకు భలే కామెడీగా అనిపించి గట్టిగా నవ్వేస్తుంది. వెంటనే ముకుంద్ కూడా తల కిందకు దించుకుని సిగ్గుగా నవ్వుతాడు.
"ఓయ్... లుక్ హియర్, వుయ్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్! కనీసం నా మొహం కూడా చూడకుండా మాట్లాడితే నేనేమనుకోవాలి చెప్పు?" అంటుంది ఆద్య నవ్వుతూ.
అప్పుడే ముకుంద్ మొదటిసారి ఆద్యను ఫేస్ టు ఫేస్, కళ్లలోకి చూస్తాడు.
సరిగ్గా అదే సమయానికి పక్కనుండి ఆద్య వాళ్ల నాన్న సత్యమూర్తి కారులో వచ్చి వాళ్లను ఇంటరప్ట్ చేస్తాడు.
"ఆద్యా... ఏంటమ్మా ఇంత లేట్ అయింది? నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది?" అని అడుగుతాడు.
ఆద్య కొద్దిగా భయంతో కూడిన గౌరవంతో, "బ్యాటరీ లో డాడీ," అంటుంది.
అప్పుడు సత్యమూర్తి ముకుంద్‌ను చూసి, "ఏంటి ముకుంద్ అలా నిలబడి చూస్తున్నావు... కారులో సీట్లు ఖాళీగానే ఉన్నాయి కదా, రా కూర్చో," అంటాడు.
ముకుంద్ మొహమాటంతో మొదట 'వద్దు' అని చెప్పినా... కారులో వెళ్లొచ్చనే ఎక్సైట్‌మెంట్‌తో "సరే అంకుల్" అని కారు వెనక సీట్లో కూర్చోబోతాడు.
కానీ కారు ఎక్కేటప్పుడు ముకుంద్‌కి కాలు మళ్లీ నొప్పిస్తుంది.
"ఏంటి, ఏమైంది?" అని ఆద్య ఆందోళనగా అడుగుతుంది.
"ఏం లేదు," అని కవర్ చేస్తూ కారులో కూర్చుంటాడు ముకుంద్.
తర్వాతి రోజు ఉదయం:
ఆద్య ఉదయాన్నే నిద్రలేచింది. చేతిలో కాఫీ మగ్‌తో... కుదురుగా ఒక చోట కూర్చోకుండా ఇంట్లో అటూ ఇటూ టెన్షన్‌గా తిరుగుతూ ఉంటుంది.
అది గమనించిన సత్యమూర్తి, "ఏంటమ్మా... ఏదో టెన్షన్‌లో ఉన్నట్టున్నావు?" అని అడుగుతాడు.
"ఏం లేదు నాన్న," అని అక్కడినుండి తప్పించుకుని మెల్లిగా తన రూమ్‌లోకి వెళ్లిపోతుంది ఆద్య.
గదిలోకి వెళ్లగానే డోర్ లాక్ చేసి, తన ఫ్రెండ్ సత్యకు ఫోన్ చేస్తుంది.
"ఏంటి సత్య... టికెట్స్ కూడా బుక్ చేసేశాను, వస్తున్నావా లేదా..." అని చాలా ఆత్రంగా అడుగుతుంది...
Shunyam
By Storytravel
Published: March 5, 2026 at 2:19 AM
Your input calibrates the database for others.
Ready to play...