Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్:
డాక్టర్లు ఐసీయూ (ICU)లో చాలా కష్టపడి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చి, చావుబతుకుల మధ్య ఉన్న ముకుంద్‌ను అతికష్టం మీద బతికించారు.
కాసేపటికి డాక్టర్ ఐసీయూ బయటకు రాగానే, ఆదికేశవ ఆత్రంగా వెళ్లి... "ఏంటి సార్... ఏమైంది ఆ కుర్రాడికి?" అని అడిగాడు.
డాక్టర్ భారంగా నిట్టూర్చి, "మీ దగ్గర ఒక నిజం దాచాం సార్... ఆ కుర్రాడికి 'రాకిస్-ఫేజ్' (Rachis-Phage) అనే చాలా రేర్ డిసీజ్ ఉంది," అని అసలు విషయం బయటపెట్టాడు.
ఆ మాట వినగానే పక్కనే ఉన్న ప్రణీత్ కంగారుగా, "దీనికి ట్రీట్‌మెంట్ ఏంటి డాక్టర్?" అని అడిగాడు.
ఆదికేశవ కలుగజేసుకుని, "చెప్పండి సార్... ఎంత ఖర్చయినా నేను భరిస్తాను. నా ప్రాణాలు పణంగా పెట్టి అయినా ఆ కుర్రాడిని నేను బతికించుకుంటాను," అన్నాడు ఎంతో నమ్మకంగా.
డాక్టర్ తడబడుతూనే... "అది... నిజానికి... అసలు దీనికి క్యూర్ లేదు సార్. ఆ అబ్బాయి పడుతున్న నరకం చూడలేక... నొప్పి లేకుండా వాడిని చంపేయడమే మంచిది (కారుణ్య మరణం)," అని బాంబు పేల్చాడు.
ఆ మాట వినగానే ప్రణీత్‌కు ఎక్కడలేని కోపం, ఆవేశం కట్టలు తెంచుకుని... "రేయ్... ఏంట్రా, పిచ్చిపిచ్చిగా వాగుతున్నావా?" అంటూ డాక్టర్ కాలర్ పట్టుకున్నాడు.
డాక్టర్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, "మీరు నన్ను చంపినా సరే... ఆ కుర్రాడిని బతికించడం ఎవరి తరం కాదు. ఆ వ్యాధి అప్పటికే అతని బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఈ కేస్ ఇక్కడ ఉంటే మా హాస్పిటల్ రెప్యుటేషన్‌కి ప్రాబ్లమ్ వస్తుంది. నా మాట విని ఆ కుర్రాడికి మీరే కారుణ్య మరణం ప్రసాదించండి. లేదంటే వాడు బతికినంత కాలం నరకం కన్నా దారుణమైన వేదన అనుభవిస్తాడు. ఇప్పటికే యూరినరీ ఫంక్షనింగ్ (Urinary functioning) పూర్తిగా దెబ్బతింది. నెక్స్ట్ వాడి బాడీలో ఏం జరుగుతుందో సైన్స్ కూడా చెప్పలేనంత దారుణంగా ఉంటుంది వాడి పరిస్థితి," అని నిస్సహాయంగా, కఠినంగా అన్నాడు.
ఆ మాటలకు ఆదికేశవలో ఉన్న రౌడీ ఒక్కసారిగా నిద్రలేచాడు. కళ్లు ఎర్రబడగా కోపంతో ఊగిపోతూ డాక్టర్ కాలర్ పట్టుకుని లాగి, తన జేబులోని గన్ తీసి నేరుగా డాక్టర్ నోట్లో పెట్టి బెదిరించాడు.
"వాడు బతికినంత కాలం... వాడికి ఎలాంటి నొప్పి తెలియకుండా ఇక్కడే ట్రీట్‌మెంట్ జరగాలి! వాడికి ఏమైనా జరిగిందో... నిన్ను ఇక్కడే లేపేస్తా!" అని సింహంలా గర్జించాడు.
ప్రాణభయంతో వణికిపోతున్న డాక్టర్‌కి ఏం చేయాలో తెలియక గజగజలాడుతూ 'సరే' అన్నట్లు తల ఊపాడు.
మరోవైపు ఇదంతా వింటున్న ప్రణీత్... ప్రాణానికి ప్రాణమైన తన స్నేహితుడికి ఇక నూకలు చెల్లాయని, వాడు బతకడని తెలిసి... ఆ నిజాన్ని తట్టుకోలేక అక్కడే నేల మీద కుప్పకూలిపోయాడు. గుండె పగిలేలా ఏడవడం మొదలుపెట్టాడు.
Shunyam
By Storytravel
Published: March 5, 2026 at 3:05 AM
Your input calibrates the database for others.
Ready to play...