SCREEN ON

Loading File

Chapter 8

Chapter 7
Chapter 8
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 7

Shunyam

Chapter 8
Chapter 7
Chapter 8

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 8

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

Active
08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

FINAL EPISODE

Chapter // 07

EPISODE 7

ముకుంద్, ప్రణీత్ ఇద్దరూ కాలేజీకి నడుచుకుంటూ వెళ్తూ... ఇండియన్ క్రికెట్ టీమ్ ఆడిన లాస్ట్ మ్యాచ్ గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. అలా వెళ్తుండగా సడన్‌గా ముకుంద్ ఎడమ కాలి చెప్పు గ్రిప్ వదిలేసింది.

"ఏంట్రా... నడుస్తుంటే నా కాలికి అసలు పట్టు దొరకట్లేదు," అన్నాడు ముకుంద్ ఇబ్బందిగా అడుగులు వేస్తూ.

"ఏం కాదులేరా... కాలు ఏమైనా బెణికిందేమో. అయినా, ఆ చెప్పులు కొనుక్కుని రెండు సంవత్సరాలవుతోంది... ఇంకా ఎన్ని రోజులు వాడతావురా వాటిని? కొత్తవి కొనుక్కోవచ్చుగా," అన్నాడు ప్రణీత్.

"నీలా వారానికో జత కొనుక్కునేంత డబ్బు లేదులేరా మాకు," అన్నాడు ముకుంద్ నిట్టూరుస్తూ.

అది విన్న ప్రణీత్ కాస్త వెటకారంగా, "ఇదిగో... మాటిమాటికీ నన్ను డబ్బున్నవాడిలా అనకు. ఈ చెప్పులు బాగున్నాయని మొన్నే శివాలయం దగ్గర దొబ్బేశా," అన్నాడు క్యాజువల్‌గా.

"ఛీ... కొంచెం కూడా సిగ్గు లేదురా నీకు," అని వాడిని తిట్టుకుంటూ ముందుకు నడిచాడు ముకుంద్. కానీ ముకుంద్ నడిచే విధానం కొద్దిగా మారింది. గ్రిప్ లేకపోవడంతో అతను నడుస్తుంటే ఎడమ కాలు కొంచెం ఎబ్బెట్టుగా వంగుతోంది. పాపం ఎలాగోలా కష్టపడుతూ బస్టాప్‌కి చేరుకున్నారు.

అక్కడ ఆద్య నిలబడి ఉంది. ముకుంద్‌ను చూడగానే ఆమె పెదవులపై అందమైన చిరునవ్వు వికసించింది.

అది చూసిన ముకుంద్‌కు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. బిడియంగా ఓ చిన్న నవ్వు నవ్వి, ఆమెకు కాస్త దూరంగా వెళ్లి నిలబడ్డాడు.

అది గమనించిన ప్రణీత్ ముకుంద్‌ను గిల్లి, "ఒరేయ్... ఆ రోజు బస్సులో నువ్వు సీటు ఇవ్వకపోయినా సరే, ఆ అమ్మాయి నిన్నే ఎందుకురా అలా చూస్తోంది?" అని గుసగుసలాడాడు.

"అది చాలా పెద్ద కథరా... క్లాస్‌లో చెబుతాలే," అన్నాడు ముకుంద్ నెమ్మదిగా.

మరోవైపు ఆద్య మనసులో, 'ఏంటి ఈ అబ్బాయి... కనీసం పలకరించాలన్న బేసిక్ మ్యానర్స్, మర్యాద కూడా లేవు... ఛీ,' అని కొద్దిగా విసుక్కుంది.

ముకుంద్ లోపల మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతోంది... 'అమ్మాయిలతో ఎలా మాట్లాడాలిరా బాబూ... కనీసం వాళ్ల మొహం చూసే ధైర్యం కూడా లేదు నాకు. అందులో ఈ అమ్మాయంటే ఎందుకో ఇంకా భయం... అయినా నాకున్న దరిద్రానికి మనకి ఇవన్నీ సెట్ అవ్వవులే,' అని తనలో తాను సరిపెట్టుకున్నాడు.

బస్సెక్కి కాలేజీకి చేరుకున్నారు. ముకుంద్ ఎంత బాగా చదివినా సరే ఎప్పుడూ లాస్ట్ బెంచ్‌లోనే కూర్చుంటాడు. పైగా అతనే లాస్ట్ సెమిస్టర్ టాపర్ కూడా! ఆద్య మాత్రం వెళ్లి సెకండ్ బెంచ్‌లో కూర్చుంది.

ముకుంద్ పక్కన కూర్చున్న ప్రణీత్, "రేయ్... ఏదో చెబుతా అన్నావుగా, చెప్పు," అని ఆరా తీశాడు.

అప్పుడు ముకుంద్... ఆద్య సత్యమూర్తి గారి కూతురని, గూండాల గొడవ గురించి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు.

మొత్తం విన్న ప్రణీత్ ఓరగా చూస్తూ... "ఒరేయ్, నాకో డౌట్ రా... నీ పాస్ట్‌లో నువ్వు ఏ అమ్మాయి వంకా కన్నెత్తి చూడలేదని, నిన్నో శ్రీరామచంద్రుడు అనుకుని కావాలనే ఆ అమ్మాయి నీకు లైన్ వేస్తోందేమో పాపం," అన్నాడు నవ్వుతూ.

వెంటనే ముకుంద్ సీరియస్ అయిపోయి, "రేయ్... బుర్ర లేకుండా మాట్లాడకు. ఆ అమ్మాయి అలాంటిది కాదు. అయినా తను చాలా సింపుల్‌గా, పద్ధతిగా ఉండే అమ్మాయి రా. వాళ్ల నాన్నకు అంత డబ్బున్నా సరే, ఎలాంటి ఆడంబరాలు లేకుండా మనలాగే ఆర్టీసీ బస్సులో వస్తుంది కాలేజీకి," అని ఆద్యను వెనకేసుకొచ్చాడు.

దానికి ప్రణీత్ నవ్వుతూ, "తమరు ఆర్టీసీ బస్సులో వస్తారని తెలిసే తను కూడా ఆ బస్సులో వస్తోందేమో ఎవడికి తెలుసు? ఏదేమైనా సరే... ఆ అమ్మాయికి మాత్రం నీ మీద ఏదో ఉంది మావా," అని కన్నుగీటాడు.

Shunyam

By Storytravel

Published: March 5, 2026 at 2:11 AM

© 2026 Storytravel. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...