SCREEN ON

Loading File

Chapter 21

Chapter 20
Chapter 21
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 20

Shunyam

Chapter 21
Chapter 20
Chapter 21

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 21

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

Active
21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

FINAL EPISODE

Chapter // 20

EPISODE 20

ప్రణీత్ ముకుంద్ కోసం వాళ్ల ఇంటి గేటు దగ్గర వెయిట్ చేస్తున్నాడు.

"రేయ్ ముకుంద్... ఎంత సేపురా, త్వరగా రారా బాబూ," అని గట్టిగా అరుస్తున్నాడు.

అప్పుడు ముకుంద్ తన రూమ్ కిటికీలోంచి, "వాష్ రూమ్‌కి వెళ్లి వస్తా, ఆగు," అని సైగ చేస్తాడు.

ముకుంద్ వాష్ రూమ్‌లో యూరిన్ పాస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది చాలా కష్టంగా, విపరీతమైన నొప్పితో కూడుకుని ఉంటుంది. కడుపులో, నరాల్లో ఎప్పుడూ లేని విధంగా చాలా అన్‌ఈజీగా అనిపిస్తుంది. ఎంతో నరకం అనుభవిస్తూ ఎలాగోలా కంప్లీట్ చేసి... గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు.

'దేవుడా... ఏదో తేడా కొడుతోంది, నాకెప్పుడూ ఇలా అవ్వలేదే!' అని తన పరిస్థితి చూసి తనకే భయం వేస్తుంది.

తనకున్న జబ్బు గురించి ఇక దాచలేక, కిందకు వెళ్లి అమ్మతో చెప్పాలనుకుంటాడు.

భారమైన అడుగులతో వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లి... "అమ్మా... నీతో ఒక విషయం చెప్పాలి. అసలు ఇది నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేనిది, కానీ చెప్పకపోతే నేను చచ్చి..." అని ముకుంద్ తన వ్యాధి గురించి చెప్పబోయేలోపే...

'పట్' మని ముకుంద్ వాళ్ల అమ్మ సడన్‌గా వాడి చెంప చెల్లుమనిపిస్తుంది.

పాపం వాళ్ల అమ్మ తననెందుకు కొట్టిందో ముకుంద్‌కు అర్థం కాలేదు. తన ప్రాణసంకటాన్ని చెప్పుకుందామనుకున్న వాడికి అది పెద్ద షాక్.

"ఏమన్నావురా నిన్న మీ నాన్నని? ఆయన నన్ను కొడతాడు, చంపుతాడు... మా మధ్యలో నువ్వెవడివి రా?" అని ఆవేశంగా అరుస్తుంది ఆమె.

"ఏమైందమ్మా?" అని ముకుంద్ షాక్‌లో అడుగుతాడు.

ఇంతలో పక్కనుంచి నిత్య కంగారుగా వచ్చి, "నాన్న ఉదయం నుంచి కనిపించట్లేదు అన్నయ్యా..." అంటుంది.

"నాకు తెలుసులే, ఆయన ఎక్కడుంటాడో..." అని క్యాజువల్‌గా అంటాడు ముకుంద్.

"ఆల్రెడీ తెలిసిన వైన్ షాప్‌కి ఫోన్ చేసి కనుక్కున్నాం, అక్కడ లేరు. నిన్న రాత్రి నువ్వన్న మాటలకే ఆయన ఎటో వెళ్లిపోయి ఉంటారు," అని వాళ్ల అమ్మ ఏడుస్తూ అరుస్తుంది.

"ఆ షాప్ కాకపోతే వేరే షాప్‌లో ఉంటాడమ్మా... ఉండు, నేను వెళ్లి వెతుకుతాను," అని చెప్పి ముకుంద్ కంగారుగా బయటకు వస్తాడు.

సరిగ్గా అప్పుడే ఆద్య కూడా అక్కడికి వస్తుంది. బయటకు వచ్చిన ముకుంద్‌ని చూసి ప్రణీత్, "ఏరా... ఇంతసేపు బాత్‌రూమ్‌లో ఏం చేస్తున్నావు రా?" అని జోక్ చేస్తాడు.

తనలో ఉన్న భయం, ప్రాణం పోతోందన్న టెన్షన్, ఫ్రస్ట్రేషన్ అన్నీ కట్టలు తెంచుకుని... ముకుంద్ కోపంగా ప్రణీత్ చెంప మీద ఒకటి కొట్టి, "ముందు బైక్ స్టార్ట్ చేయరా!" అని అరుస్తాడు.

లోపల ఏం జరిగిందో నిత్యను అడిగి తెలుసుకున్న ఆద్య, వెంటనే నిత్యను తన స్కూటీ మీద ఎక్కించుకుని ముకుంద్ నాన్న కోసం వెతకడానికి బయలుదేరుతుంది. ఇంట్లో వాళ్ల అమ్మ మాత్రం తీవ్రమైన టెన్షన్‌లో తెలిసినవాళ్లందరికీ ఫోన్ చేస్తూ, తన భర్త వచ్చాడేమో అని ఆరా తీస్తుంటుంది పాపం.

మరోవైపు బైక్ మీద ప్రణీత్ వెనక కూర్చున్న ముకుంద్‌కు... నాన్న ఏమయ్యాడో అన్న టెన్షన్ వల్ల సడన్‌గా హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోతుంది. ఆ ఆయాసానికి మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. ప్రణీత్‌కి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ బైక్ స్పీడ్, గాలి హోరు వల్ల ముకుంద్ మాటలు ప్రణీత్‌కు వినిపించట్లేదు.

గుండెల్లో నొప్పి, నరాల లాగుడుతో స్పృహ కోల్పోతున్న ముకుంద్, రన్నింగ్ బైక్ మీద నుంచి పక్కకు పడిపోబోతుంటాడు. సడన్‌గా పక్కనుంచి వేగంగా ఒక కారు వస్తుంది. ఆ కారు కిటికీలోంచి ఆదికేశవ తన చెయ్యి బయటకు పెట్టి, ముకుంద్‌ కింద పడిపోకుండా గట్టిగా పట్టుకుని సపోర్ట్ ఇస్తాడు.

వెంటనే ప్రణీత్ బైక్ స్లో చేస్తాడు, అదే సమయానికి ఆదికేశవ కారు కూడా స్లో అవుతుంది.

ముకుంద్‌కు ఏమైందో ప్రణీత్‌కు అర్థం కాలేదు. ముకుంద్ తల పైకెత్తి చూసేసరికి... ముకుంద్ మెడ మీద నరాలన్నీ ఉబ్బిపోయి, ఆకుపచ్చ (Green) రంగులో చాలా స్పష్టంగా, భయంకరంగా కనిపిస్తున్నాయి.

అది చూసిన ఆదికేశవ, "ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా కారు ఎక్కించు, హాస్పిటల్‌కి తీసుకువెళ్దాం!" అని అరుస్తాడు. వెంటనే ప్రణీత్ సాయంతో ముకుంద్‌ను ఆదికేశవ కారులోకి ఎక్కించి వేగంగా హాస్పిటల్‌కి తీసుకువెళ్తారు.

Shunyam

By Storytravel

Published: March 5, 2026 at 3:04 AM

© 2026 Storytravel. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...