SCREEN ON

Loading File

Chapter 14

Chapter 13
Chapter 14
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 13

Shunyam

Chapter 14
Chapter 13
Chapter 14

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 14

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

Active
14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

26

FINAL EPISODE

Chapter // 13

EPISODE 13

ముకుంద్ తడబడుతూనే "లేదు... జస్ట్ ఆడుకోవడానికి... అంతే..." అని చెప్పాడు.

"ఇఫ్ యూ డోంట్ మైండ్, నాతో ఒక చోటికి తోడు వస్తావా ముకుంద్?" అని అడిగింది ఆద్య.

పక్కనే ఉన్న ప్రణీత్ హాస్యంగా, "నేను ముందే అనుకున్నా... తీసుకెళ్లు, నా బెట్ డబ్బులైనా మిగులుతాయి," అని నవ్వాడు.

ముకుంద్ 'ఓకే' అని చెప్పడానికి ఆలోచిస్తుండగానే, అది పట్టించుకోకుండా ఆద్య ఎంతో ఉత్సాహంగా, "థ్యాంక్స్... ఇప్పుడే స్కూటీ తీసుకుని వస్తా, ఇక్కడే ఆగు," అని మళ్లీ ఇంట్లోకి పరుగులు తీసింది.

ప్రణీత్ ఆశ్చర్యంగా, "ఈ డబ్బున్న వాళ్ల ఇళ్లల్లో ఏకంగా వెహికిల్ షోరూమే ఉంటుందేమోరా... బైక్, కారు, స్కూటీ ఆఖరికి ఒక సైకిల్ కూడా ఉంది," అన్నాడు.

ఈలోగా ఆద్య స్కూటీ మీద వచ్చింది. ముకుంద్ స్కూటీ ఎక్కి, కొంచెం భయంగా ఆద్యకు తగలకుండా బాగా వెనక్కి జరిగి కూర్చున్నాడు.

వాళ్లు వెళ్తుంటే వెనక నుంచి ప్రణీత్, "హెల్మెట్ పెట్టుకో నాన్నా... ఏ డివైడర్‌కో గుద్దేస్తావు," అని అరిచాడు. కానీ ముకుంద్ వాడి మాటలు పట్టించుకోలేదు.

"ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఆద్యా?" అని అడిగాడు ముకుంద్.

"సినిమాకి... అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా! అది కూడా ఫస్ట్ డే... చూస్తే ఆ కిక్కే వేరుంటుంది," అంది ఆద్య గాల్లో తేలిపోతూ.

ఆ మాట వినగానే ముకుంద్ కంగారు పడిపోయి, "ఆద్యా... నా దగ్గర డబ్బుల్లేవు," అన్నాడు.

దానికి ఆద్య అదే జోష్‌లో, "పీఎస్‌పీకే అంటే డబ్బులంటావేంటి ముకుంద్..." అని స్కూటీని థియేటర్ వైపు పోనిచ్చింది.

వాతావరణం అంతా మబ్బులు పట్టి ఉంది, ఏ క్షణమైనా వర్షం పడేలా కనిపిస్తోంది. వాళ్లు థియేటర్ దగ్గరికి చేరుకున్నారు. ఫస్ట్ డే కావడంతో అక్కడ విపరీతమైన రష్ ఉంది.

"ఆద్యా... ఎప్పుడో సిక్స్త్ క్లాస్‌లో థియేటర్‌కి వెళ్లాను. మళ్లీ ఇప్పుడు నీతోనే వస్తున్నాను," అన్నాడు ముకుంద్ ఆశ్చర్యంగా ఆ సందడిని చూస్తూ.

"ముకుంద్, అక్కడ చూడు... పద, మనం కూడా ఫ్యాన్స్‌తో కలిసి డాన్స్ చేద్దాం," అని ఎగ్జైట్‌మెంట్‌తో అడిగింది ఆద్య.

కానీ ముకుంద్ భయంగా, "ఇది నా లోకల్ ఏరియా ఆద్యా, పొరపాటున మా అమ్మకి గానీ తెలిసిందో... అంతే సంగతులు," అన్నాడు.

"ఏం పర్లేదు రారా..." అని ఆద్య బతిమాలుతుండగానే సడన్‌గా అక్కడికి ఆదికేశవ వచ్చాడు.

పూర్తి నలుపు రంగు దుస్తుల్లో ఉన్నాడు. అతనితో పాటు ఇంకో ముగ్గురు తెల్ల చొక్కాలు వేసుకుని వచ్చారు. సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

ఆద్య ఆదికేశవను చూడటం అదే మొదటిసారి. అతన్ని చూస్తే ఓ నలభై ఏళ్ల వయసున్నవాడిలా ఉన్నాడు.

అందరూ సైలెంట్‌గా ఆదికేశవనే చూస్తుండిపోయారు. అప్పుడు ఆదికేశవ వాళ్లందరి మధ్యలోకి సీరియస్‌గా వచ్చి... ఒక్కసారిగా ఊర మాస్ స్టెప్ వేశాడు. అంతే... మళ్లీ అరుపులు, కేకలు. అందరూ నవ్వుతూ ఆదికేశవతో కలిసి డాన్స్ వేయడం మొదలుపెట్టారు.

ఆద్య ముకుంద్‌ను పక్కకి లాగి, "ఏంటి ముకుంద్, ఏమైంది? అతను కూడా ఫ్యాన్ అనుకుంటా," అంది ఆశ్చర్యంగా.

కానీ ముకుంద్‌కు తెలుసు, తర్వాత ఏం జరగబోతోందో!

అలా సరదాగా డాన్స్ వేస్తూ వేస్తూనే... సడన్‌గా ఆదికేశవ తన చేతిలో ఉన్న కత్తితో డాన్స్ చేస్తున్న వాళ్లలో ఒకడిని దారుణంగా పొడిచాడు.

అంతే... సెకన్ల వ్యవధిలో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ భయంతో చెల్లాచెదురు అయిపోయారు.

ఆద్య భయంతో ముకుంద్ చేతిని గట్టిగా పట్టుకుని కళ్లు మూసుకుంది. అప్పుడే ఆకాశం గట్టిగా గర్జించింది. భారీ వర్షం కురవడం మొదలైంది.

ఆదికేశవకు ఎదురుగా పన్నెండు మంది రౌడీలు నిలబడ్డారు.

"బుల్లెబ్బాయి!" అని గట్టిగా అరిచాడు ఆదికేశవ.

అప్పుడు ఆ ముగ్గురిలో ఒకడు కారులోంచి ఒక పెద్ద కత్తి తీసి ఆదికేశవ చేతికి విసిరాడు. జనం అందరూ చూస్తుండగానే, ఆదికేశవ ఆ పన్నెండు మందిని అతి కిరాతకంగా నరికాడు. ఆ పోరాటంలో ఆదికేశవ ముఖానికి, ఎడమ చేతికి, ఎడమ కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి.

అందులో ఒకడు జనం వెనక నుంచి అందరినీ తోసుకుంటూ వచ్చి... ఆద్య మెడ మీద కత్తి పెట్టి, "కేశవా! నన్ను వదిలేసి వెళ్లిపో... ఇంకో అడుగు ముందుకు వేశావో ఈ అమ్మాయిని చంపేస్తా," అని బెదిరించాడు.

ఆద్య పీక మీద కత్తి ఉండటం చూసి ముకుంద్‌కు ప్రాణం పోయినంత పనైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తన జేబులో ఉన్న సెల్‌ఫోన్ తీసి, ఆ రౌడీ ముఖానికి బలంగా విసిరాడు.

ఆ దెబ్బకు వాడు తడబడటం, ఆ డిస్ట్రాక్షన్‌ను వాడుకున్న ఆదికేశవ కర్రతో వాడిని కొట్టడం ఒక్క క్షణంలో జరిగిపోయాయి.

ముకుంద్ ఆద్యను పక్కకి లాగే క్రమంలో, ఆదికేశవ వెనక నుంచి ఇంకొందరు దాడికి దిగారు. ముకుంద్ వాళ్లను ఆపి వెనక్కి తోశాడు.

"వెళ్లొద్దు ముకుంద్... ప్లీజ్," అని ఆద్య ఏడుస్తూ ఆపడానికి ప్రయత్నించింది. కానీ ముకుంద్ ఆమె మాటలు పట్టించుకోకుండా ఆదికేశవను కాపాడటానికి వెళ్లాడు. వాళ్లు ముకుంద్‌ను దారుణంగా కొట్టడం మొదలుపెట్టారు.

అది చూసిన ఆదికేశవకు ఎక్కడలేని కోపం తన్నుకొచ్చింది. రెచ్చిపోయి వాళ్లందరినీ కొట్టి తరిమేశాడు. రొప్పుతూ ముకుంద్ దగ్గరికి వచ్చి, "ఎవరు బాబు నువ్వు? నా కోసం ఎందుకురా ప్రాణాలకు తెగించి ఇలా చేశావు?" అని అడిగాడు ఆశ్చర్యంగా.

దెబ్బల నొప్పితో మూల్గుతూనే ముకుంద్, "వాడు ఆద్యను అడ్డుపెట్టుకున్నప్పుడు... ఆమె మీకు ఏమీ కాకపోయినా సరే, మీరు ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. అప్పుడే నాకు అర్థమైంది, మీరు నిజానికి చెడ్డవారు కారని. మీరు ఎంచుకున్న మార్గం తప్పు కావొచ్చు, కానీ మీరు కాదు," అన్నాడు ఆయాసంగా.

ఇదంతా చూస్తున్న ఆద్య ఏడుస్తూ, "ఇదంతా నా వల్లే! ఇంట్లో హ్యాపీగా ఉండేవాడివి... అనవసరంగా సినిమా అని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను," అని బాధపడింది.

"చిన్న దెబ్బలేలే అమ్మా, ముందు పదండి హాస్పిటల్‌కి వెళ్దాం," అన్నాడు ఆదికేశవ వాళ్లను సముదాయిస్తూ.

Shunyam

By Storytravel

Published: March 5, 2026 at 2:28 AM

© 2026 Storytravel. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...