SCREEN ON

Loading File

Chapter 26

Chapter 25
Chapter 26
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 25

Shunyam

Chapter 26
Chapter 25
Chapter 26

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 26

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

EPISODE 24

25

EPISODE 25

Active
26

FINAL EPISODE

Chapter // 25

EPISODE 25

ఉలిక్కిపడి నిద్రలేచిన ఆద్యకు అదంతా కలేనని అర్థమైంది. కానీ ఆ కల తాలూకు భయం ఆమెను వణికిస్తోంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్... భయంతో పట్టిన చెమటలు తుడుచుకుంటూ పక్కనే మోగుతున్న ఫోన్ తీసి చూసింది.

స్క్రీన్ మీద ప్రణీత్ నుంచి అప్పటికే 27 మిస్డ్ కాల్స్ ఉన్నాయని నోటిఫికేషన్ కనిపించింది.

ఆద్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. వణుకుతున్న చేతులతో ప్రణీత్‌కు తిరిగి కాల్ చేసింది.

"హలో ప్రణీత్... ముకుంద్ ఎలా ఉన్నాడు?" అని భయంగా అడిగింది.

అవతలి వైపు నుంచి ప్రణీత్ గట్టిగా ఏడుస్తూ... "కాలి బూడిద అయిపోయాడు ఆద్యా... వాడి బాడీని ఎక్కువ సేపు ఉంచకూడదని డాక్టర్లు చెప్పడంతో, ఇప్పుడే శ్మశానంలో అంత్యక్రియలు కూడా పూర్తయిపోయాయి. అయినా ఇన్నిసార్లు ఫోన్ చేస్తే ఎందుకు అటెండ్ చేయలేదు ఆద్యా? చివరి చూపు కూడా దక్కకుండా ఎందుకిలా చేశావు?" అని కుమిలిపోయాడు.

ఆ మాటలు వినగానే ఆద్య చేతిలోంచి ఫోన్ జారి కిందపడిపోయింది. ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అలా గంటల తరబడి ఏడుపు కూడా రాకుండా, కదలకుండా శిలలా ఉండిపోయింది. చుట్టూ భయానకమైన నిశ్శబ్దం. ముకుంద్‌ను ఆఖరిసారిగా చూడలేకపోయానన్న నిజం ఆమె గుండెను కోసేస్తోంది. ఏం చేయాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఆమెకు అర్థం కాలేదు.

నెమ్మదిగా తేరుకుని బయటకు రాగానే... ఎదురుగా ముకుంద్ వాళ్ల నాన్న కనిపించాడు.

"అమ్మా... మా వాడు మీ కాలేజే కదా. వాడి ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా ఉన్నాడేమో కాస్త అడిగి చెప్తావా తల్లీ... ఏమనుకోకు," అని ఆశగా అడిగాడు.

ముకుంద్ చనిపోయాడన్న చేదు నిజాన్ని, గొంతు వరకు వస్తున్న దుఃఖాన్ని అతికష్టమ్మీద దిగమింగుకుని... "ఓకే అంకుల్," అంది ఆద్య.

ఇంతలో ముకుంద్ వాళ్ల అమ్మ బయటకు వచ్చి, "అమ్మా ఆద్యా... వాడు ఎక్కడున్నాడో నీకు చెప్పే ఉంటాడు కదమ్మా. ఇన్ని సంవత్సరాలుగా వాడి మీద ఎప్పుడూ చెయ్యి చేసుకోలేదు. కానీ నిన్న ఎందుకో కోపంలో అలా కొట్టేశాను. ఆ బాధలోనే వాడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు," అని కన్నీళ్లు పెట్టుకుంది.

ఆ మాటలు వినలేక ఆద్య వెంటనే వెనక్కి తిరిగి, తన కన్నీళ్లను తుడుచుకుంటూ స్కూటీ స్టార్ట్ చేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయింది.

ముకుంద్ మీద ఉన్న అంతులేని ప్రేమతో... వాడు ఇక లేడన్న నిజం తెలిస్తే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేరని, ఆ నిజాన్ని ఎవరికీ చెప్పకుండా తన గుండెల్లోనే పాతిపెట్టేసింది ఆద్య. ఆ నిజాన్ని బయటపెట్టొద్దని ప్రణీత్, ఆదికేశవలతో కూడా ఒట్టు వేయించుకుంది.

పాపం ముకుంద్ కుటుంబ సభ్యులంతా... తమ కొడుకు కోపంతో ఎటో వెళ్లిపోయాడని, ఏదో ఒకరోజు తిరిగి వస్తాడన్న భ్రమలోనే బతుకుతున్నారు.

కానీ ఆ నిజం ఎన్నో రోజులు దాగలేదు...

కొన్ని నెలల తర్వాత ఆ సైంటిస్ట్ ముకుంద్ ఇచ్చిన మాట ప్రకారం ఆ రేర్ డిసీజ్‌కు యాంటీబయాటిక్ (Antibiotic) కనిపెట్టాడు. ముకుంద్ చేసిన త్యాగానికి గుర్తింపుగా, ఇప్పుడు వాళ్ల కాలేజ్ గ్రౌండ్‌లోనే ముకుంద్ కోసం పెద్ద పెద్ద కటౌట్స్, స్టేజ్ వేయించి ఈ సభ ఏర్పాటు చేశాడు.

ప్రెజెంట్ (ప్రస్తుతం - కాలేజ్ గ్రౌండ్‌లో):

స్టేజ్ మీద ఉన్న సైంటిస్ట్ ఆరు నెలల క్రితం జరిగిందంతా కన్నీళ్లతో సభకు వివరించాడు. ఆ ప్రోగ్రామ్‌కు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్లు, డాక్టర్లు, అధికారులు వచ్చారు.

"ముకుంద్ తన బాడీని స్వార్థం లేకుండా రీసెర్చ్ కోసం అంకితం చేయడం వల్లే, అతని కణాల (Cells) మీద చేసిన ప్రయోగాలతోనే... ఈరోజు ప్రపంచాన్ని వణికించే మరో ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెట్టగలిగాం. ముకుంద్ మరణం వృథా కాలేదు!" అని సైంటిస్ట్ గర్వంగా ప్రకటించాడు.

మరోవైపు ఆద్య... ముకుంద్ ఎప్పటికైనా తిరిగి వస్తాడని వాళ్ల కుటుంబ సభ్యులను నమ్మిస్తూ, తనను తాను అబద్ధం అనే ముసుగులో బంధించుకుని ఇన్ని నెలలుగా ఎలా నలిగిపోయిందో తలుచుకుని కుమిలిపోతోంది.

చిన్నప్పటినుంచి తనతో కలిసి పెరిగిన ప్రాణస్నేహితుడు హఠాత్తుగా చనిపోవడంతో ఆ షాక్ నుంచి ప్రణీత్ ఇంకా బయటపడలేకపోతున్నాడు.

అక్కడ స్టేజ్ మీద ఆ సైంటిస్ట్‌కు ఘనంగా సన్మానం జరుగుతోంది. కింద ఉన్న స్టూడెంట్స్ అంతా...

Shunyam

By Storytravel

Published: March 5, 2026 at 3:10 AM

© 2026 Storytravel. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...