Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
చరిష్మా మంచం మీద పడుకుంది.
దుప్పటి మొత్తం కప్పుకుంది.
ముఖం మీద నిస్సత్తువ కనిపించేలా నటించింది.
కొద్దిసేపటికే...
గది తలుపు తెరుచుకుంది.
అమర్ లోపలికి అడుగుపెట్టాడు.
అతని చూపు మొదట గది మొత్తం తిరిగింది.
గోడలు...
అలమారాలు...
టేబుల్...
పుస్తకాలు...
అన్నింటి మీదా ఒకే వ్యక్తి.
అతనే.
అమర్.
పోస్టర్లు.
ఫోటోలు.
కాన్సర్ట్ చిత్రాలు.
మ్యాగజైన్ కటింగ్స్.
స్కెచ్‌లు.
అతను వేసిన పాటల లిరిక్స్.
అది చూసిన అమర్ కళ్ళల్లో ఆశ్చర్యం మెరిసింది.
"ఇంత అభిమానమా?"
అని అనుకున్నాడు.
అతని చూపు చివరకు మంచం మీద పడుకుంది.
దుప్పటి కప్పుకుని పడుకున్న చారిష్మ కనిపించింది.
రామం వెంటనే అన్నాడు.
"తలనొప్పిగా ఉందని చెప్పింది సర్. టాబ్లెట్ ఇచ్చి పడుకోమన్నాను."
అంతలోనే...
చారిష్మ నిద్రలేచినట్టు నటించింది.
నెమ్మదిగా దుప్పటి నుంచి తల బయట పెట్టింది.
అమర్ ఆమె దగ్గరకు వచ్చాడు.
మంచం అంచున కూర్చున్నాడు.
ఆమె ముఖాన్ని చూసాడు.
జాలిగా.
సానుభూతితో.
ఒక అభిమానిని చూసే స్టార్‌లా కాదు...
బాధలో ఉన్న మనిషిని చూసే మనిషిలా.
కానీ...
చారిష్మ కళ్ళల్లో మాత్రం వేరే ప్రపంచం.
ఆశ్చర్యం.
ఆనందం.
నమ్మలేని ఉత్సాహం.
ఆమెకు కాలమే ఆగిపోయినట్టు అనిపించింది.
అమర్ మెల్లగా ఆమె నుదుటి మీద చేయి పెట్టాడు.
"యోర్ నేమ్ చారిష్మ రైట్?"
అని అడిగాడు.
ఆమె మౌనంగా చూసింది.
"నీ రూమ్ మొత్తం నేనే ఉన్నాను."
అని నవ్వాడు.
చారిష్మ ఇంకా అదే మైకంలో ఉంది.
ఇది కలా?
నిజమా?
అర్థం కావడం లేదు.
అమర్ మళ్లీ నవ్వుతూ అన్నాడు.
"హ్మ్... ఇలా చూస్తూ ఉంటే ఎప్పుడు మాట్లాడతారు అండి?"
ఆ మాట వినగానే...
చారిష్మ ఒక్కసారిగా లేచి అమర్‌ను గట్టిగా హత్తుకుంది.
గదిలో ఉన్న అందరూ షాక్ అయ్యారు.
కావ్య మాత్రం లోపల నవ్వుకుంది.
"అమ్మ దొంగా..."
"పరిస్థితిని భలే వాడుకుంటున్నావే!"
అని.
చారిష్మ మాత్రం వదలకుండా హత్తుకుంది.
తర్వాత కావ్య వైపు చూసి గెలిచినట్టు ముఖం పెట్టింది.
"నాకు తెలుసు అమర్..."
"మీరు వస్తారని."
"మా అన్నయ్య చెప్పాడు."
"ఒక్క ఆటోగ్రాఫ్ అడిగితే..."
"స్వయంగా మీరే వచ్చారు."
"ఇంకా నా జీవితానికి చాలు."
అని ఓవర్ యాక్టింగ్ మొదలుపెట్టింది.
పాపం అమర్‌కి ఏమీ అర్థం కాలేదు.
అతని మనసులో మాత్రం ఒకే భావన.
"పాపం..."
"కొన్ని నెలలే బ్రతుకుతుందట."
అందుకే ఆమె ప్రతి మాటను నిజంగానే నమ్ముతున్నాడు.
కొద్దిసేపు ఆలోచించిన తర్వాత అన్నాడు.
"షీ విల్ ఆల్వేస్ రిమైన్ మై బిగ్గెస్ట్ ఫ్యాన్."
"నా నెక్స్ట్ కాన్సర్ట్‌లో నాతో స్టేజ్ మీద నిలబడతావా?"
"పర్ఫార్మ్ చేయాల్సిన పని లేదు."
"నిలబడి ఉంటే చాలు."
అని నవ్వాడు.
చారిష్మ కళ్ళు మెరిశాయి.
కానీ వెంటనే తల ఊపింది.
"కాన్సర్ట్ కాదు సర్..."
"మీతో కేదార్‌నాథ్ వెళ్లాలి."
"ట్రైన్‌లో."
"ఒక వారం ప్రయాణం చేయాలి."
"అదే నా చివరి ట్రిప్ కావాలి."
ఆ మాట విన్న అమర్ ముఖం మారిపోయింది.
తనకు ఇప్పటికే మరో కాన్సర్ట్ షెడ్యూల్ ఉంది.
ఎలా సాధ్యం?
ఏం చెప్పాలి?
అర్థం కాలేదు.
కానీ...
తన ముందు ఆశతో చూస్తున్న ఆ అమ్మాయిని చూసి...
"సరే."
అన్నాడు.
"మాట ఇస్తున్నాను."
ఆ క్షణంలో చారిష్మ ఆనందానికి హద్దులే లేకపోయాయి.
మళ్లీ అమర్‌ను హత్తుకోవడానికి ప్రయత్నించింది.
అప్పుడే కావ్య దగ్గరకు వచ్చి మెల్లగా చెప్పింది.
"ముందు ఆరోగ్యంగా ఉండు."
"ఇలా దూకుతూ ఉంటే రేపే పోతావ్."
అని ఆమెకే వినిపించేలా చెప్పింది.
చారిష్మ మొహం చిన్నబోయింది.
అమర్ లేచి నిలబడ్డాడు.
చివరిగా తన చేయి ముందుకు చాపాడు.
చారిష్మ అతని చేతిని పట్టుకుంది.
ఆ స్పర్శతో...
ఆమె మనసు పూర్తిగా మరో లోకంలోకి వెళ్లిపోయింది.
హిమాలయాల మంచు పర్వతాలు...
కేదార్‌నాథ్ మార్గం...
పక్కనే అమర్...
ఇద్దరూ కలిసి నవ్వుతూ నడుస్తున్నారు...
అలాంటి ఊహల్లో మునిగిపోయింది.
అదే సమయంలో...
బయట నిలబడ్డ రామం తన తండ్రితో మెల్లగా అన్నాడు.
"నాన్న..."
"నేను కూడా వాళ్లతో కేదార్‌నాథ్ వెళ్తాను."
"అమర్ మంచి మూడ్‌లో ఉన్నప్పుడు నిజం చెబుతాను."
"ఆ తర్వాత..."
"చారిష్మను పెళ్లి చేసుకోవాలా వద్దా..."
"అది పూర్తిగా అతని ఇష్టం."
అని అన్నాడు.
కానీ...
రామంకి తెలియదు.
కొన్ని నిజాలు...
ఆలస్యంగా బయటపడితే...
అవి కేవలం మనుషుల్ని బాధపెట్టవు.
వారి జీవితాలనే మార్చేస్తాయి...
OKA JEEVITHAM
By Writer_aj
Published: June 30, 2026 at 10:58 AM
Your input calibrates the database for others.
Ready to play...