Loading File
Initializing...
Chapter 11
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
రైల్వే స్టేషన్ అంతా ప్రయాణికుల సందడితో కళకళలాడుతోంది. ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్న వారందరి మధ్య, దూరం నుంచి వినిపించిన రైలు హారన్ ఆ నిశ్శబ్దాన్ని చీల్చేసింది.
కొద్ది క్షణాల్లోనే భారీ శబ్దంతో రైలు నెమ్మదిగా ప్లాట్‌ఫారమ్‌లోకి ప్రవేశించింది. ఇంజిన్ నుంచి వచ్చిన గాలి ఒక్కసారిగా అందరి ముఖాలను తాకింది.
"వచ్చేసింది..." అని చారిష్మ ఆనందంగా అంది.
రైలు పూర్తిగా ఆగగానే అమర్ ముందుకు వెళ్లి, చారిష్మ చేతిలో ఉన్న ట్రావెల్ బ్యాగ్‌ను తీసుకుంటూ,
"ఇటు ఇవ్వండి... నేను మోస్తాను."
అన్నాడు.
చారిష్మ ఒక్క క్షణం అతని ముఖాన్నే చూస్తూ నిలిచిపోయింది.
ఇంత పెద్ద స్టార్...
దేశం మొత్తం అభిమానించే వ్యక్తి...
తన లగేజ్‌ను మోస్తున్నాడా?
ఆలోచించగానే ఆమె హృదయం
ఆనందంతో నిండిపోయింది.
అమర్ మాత్రం ఎలాంటి స్టార్ హంగులు లేకుండా సహజంగా బ్యాగ్ తీసుకుని కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కిపోయాడు.
చారిష్మ అక్కడే నిలబడి అతన్ని చూస్తూ తన రెండు చేతులతో దిష్టి తీసింది.
"అబ్బా... ఎంత మంచివాడో..."
అని మనసులోనే అనుకుంది.
ఆమె అప్పటికే ఊహల్లో విహరిస్తోంది.
అప్పుడే వెనుక నుంచి రామం వచ్చి ఆమె తలపై మెల్లగా ఒక మొట్టికాయ వేసాడు.
"ఓయ్... కలలు తర్వాత కనూ... ముందు ఎక్కు .....ఇంకొంచెం ఆలస్యమైతే రైలు వెళ్లిపోతుంది."
అన్నాడు.
"అ...!" అంటూ నవ్వుకుంటూ చారిష్మ కూడా లోపలికి ఎక్కింది.
కొద్దిసేపటికి అందరూ తమ తమ సీట్లలో కూర్చున్నారు.
రైలు నెమ్మదిగా కదలడం ప్రారంభించింది.
స్టేషన్ వెనక్కి జారిపోతోంది.
ప్లాట్‌ఫారమ్...
ప్రజలు...
వెలుగులు...
అన్నీ క్రమంగా చిన్నవైపోతున్నాయి.
చారిష్మ మాత్రం కిటికీ పక్కనే కూర్చుని బయటకు చూస్తోంది.
ఆమె కళ్లలో చిన్న పిల్లల ఉత్సాహం.
కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా ఆనందం.
కొన్ని క్షణాల తర్వాత ఆమె నెమ్మదిగా అంది...
"అబ్బా... ఎంతసేపు ఉంటుందో ఈ ప్రయాణం..."
కొద్దిసేపు ఆగి మళ్లీ చిరునవ్వుతో,
"ఎప్పుడెప్పుడు ఆ మంచు పర్వతాలను చూస్తానా అని ఉంది..." అని అంది.
ఆ మాటల్లో అమాయకత్వం ఉంది...
కేదార్‌నాథ్‌పై ఉన్న భక్తి ఉంది...
అంతకన్నా ఎక్కువగా, అమర్‌తో కలిసి చేసే మొదటి ప్రయాణంపై ఉన్న ఆనందం ఉంది.
ఆమె మాటలు విన్న అమర్ పెదవులపై చిన్న నవ్వు మెరిసింది.
కానీ...
ఆ నవ్వు కేవలం కొన్ని క్షణాలే నిలిచింది.
ఎందుకంటే...
అదే మాటలు...
అదే ఉత్సాహం...
అదే స్వరం...
ఎప్పుడో ఒకప్పుడు ఇంకొక అమ్మాయి
కూడా తనతో చెప్పింది.
అతని గుండెల్లో దాచుకున్న ఆ జ్ఞాపకాలు ఒక్కసారిగా మేల్కొన్నాయి.
"హిమాలయాలు..."
"మంచు..."
"ప్రశాంతత..."
"అందుకే ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాను..."
ఆ స్వరం అతని చెవుల్లో మళ్లీ మళ్లీ ప్రతిధ్వనించింది.
అమర్ కళ్ల ముందున్న రైలు కంపార్ట్‌మెంట్ క్రమంగా మసకబారిపోయింది.
అతని మనసు మాత్రం గతంలోకి జారిపోయింది.
ఇక్కడ చారిష్మ ఏదో మాట్లాడుతోంది...
రామం, రామ్ ఇద్దరూ ఏదో సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు...
కానీ అమర్‌కు అవేవీ వినిపించడం లేదు.
చుట్టూ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయినట్టుగా అనిపించింది.
ఒక్కసారిగా అతను సీటులో నుంచి లేచాడు.
ఎవరికీ ఏమీ చెప్పకుండా నెమ్మదిగా కంపార్ట్‌మెంట్ తలుపు దగ్గరకు వెళ్లిపోయాడు.
అతని ప్రవర్తన చూసి రామంకి ఆశ్చర్యమేసింది.
"ఏమైంది సర్...?" అని అడగబోయాడు.
కానీ అమర్ అప్పటికే దూరంగా వెళ్లిపోయాడు.
చారిష్మ కూడా అయోమయంగా అతని వైపు చూస్తోంది.
"ఇప్పుడే బాగానే ఉన్నారు... ఒక్కసారిగా ఏమైందో?"
అని ఆందోళనగా అంది.
అప్పుడే రామ్ చిరునవ్వు నవ్వి,
"మా గౌతమ్‌కి ఇవన్నీ మామూలే."
"కొన్నిసార్లు ఇలా ఒక్కసారిగా అందరి మధ్య నుంచి వెళ్లిపోయి... కాసేపు ఒంటరిగా ఉంటాడు."
"తర్వాత మళ్లీ మామూలుగా వచ్చేస్తాడు."
"టెన్షన్ పడొద్దు."
అన్నాడు.
"గౌతమ్...?"
అని రామం ఆశ్చర్యంగా అడిగాడు.
"అమర్ కాదా ఆయన పేరు?"
చారిష్మ కూడా వెంటనే మాట్లాడింది.
"అవును... గూగుల్‌లో కూడా అమర్ అనే ఉంటుంది."
"నాకూ ఇదే డౌట్ వచ్చింది."
అంది.
రామ్ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నాడు.
తర్వాత లోతుగా ఊపిరి పీల్చుకుని...
"వాడి గతమే..."
"...వాడిని 'అమర్' అనే రాక్‌స్టార్‌గా మార్చింది."
అన్నాడు.
ఆ ఒక్క మాటతో అక్కడ నిశ్శబ్దం నెలకొంది.
చారిష్మ కళ్లలో ఆసక్తి పెరిగింది.
ఆమెకు ఇప్పుడు కేదార్‌నాథ్ కంటే ముందు తెలుసుకోవాలనిపిస్తున్న విషయం ఒక్కటే.
"అమర్ గతం..."
మరోవైపు...
రైలు తలుపు దగ్గర నిలబడి ఉన్న అమర్ దూరంగా వెళ్తున్న పట్టాల వైపు చూస్తున్నాడు.
చల్లని గాలి అతని ముఖాన్ని తాకుతోంది.
కానీ అతని మనసు మాత్రం ఎన్నో సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది.
>>కొన్ని సంవత్సరాల క్రితం...
లడాఖ్...
తెల్లని మంచు పర్వతాల మధ్య ప్రశాంతంగా నిలిచి ఉన్న ఒక ప్రతిష్టాత్మక
విశ్వవిద్యాలయం.
ఆ రోజు కొత్త విద్యార్థుల స్వాగత కార్యక్రమం.
విశాలమైన సెమినార్ హాల్ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది.
కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు...
ప్రొఫెసర్లు...
లెక్చరర్లు...
అందరూ హాల్లో కూర్చొని పరిచయ కార్యక్రమాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.
స్టేజ్‌పై ప్రొఫెసర్ "సిద్ధార్థ్ శోక్లా" కొత్త విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు.
అంతా ప్రశాంతంగానే సాగుతోంది.
అయితే...
హాల్ వెనుకవైపు ఒక్కసారిగా గందరగోళం మొదలైంది.
ఒక విద్యార్థి...
మరో విద్యార్థిని తీవ్రంగా కొడుతున్నాడు.
మిగతా విద్యార్థులు ఆపాలని ప్రయత్నిస్తున్నా...
అతను మాత్రం వినడం లేదు.
ఆ దృశ్యం చూసిన సిద్ధార్థ్ శోక్లా ఒక్కసారిగా ఆగ్రహంతో మైక్ దగ్గరకు పరుగెత్తాడు.
మైక్‌ను బిగిగా పట్టుకుని గట్టిగా అరిచాడు.
"What the hell is going on there?"
"Could you stop it immediately?"
అని గర్జించాడు.
కానీ...
ఆ విద్యార్థి మాత్రం ఒక్క క్షణం కూడా ఆగలేదు.
ఇంకా కోపంగా కొడుతూనే ఉన్నాడు.
సిద్ధార్థ్ మరింత గట్టిగా హెచ్చరించాడు.
"నేను మూడు సంఖ్యలు లెక్కపెడతాను."
"వన్..."
అయినా కొట్టడం ఆగలేదు.
"టూ..."
ఈసారి కూడా అతను వినలేదు.
అక్కడున్న వారందరూ ఉత్కంఠగా చూస్తున్నారు.
"త్రీ..."
అని చెప్పేలోపే...
సెక్యూరిటీ గార్డులు పరుగెత్తుకుంటూ వచ్చి ఇద్దరినీ బలవంతంగా విడదీశారు.
అప్పుడే...
అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యే విషయం తెలిసింది.
కొడుతున్న విద్యార్థి మరెవరో కాదు...
గౌతమ్.
ఆ దృశ్యం చూసిన సిద్ధార్థ్ శోక్లా కళ్లల్లో ఆశ్చర్యం, కోపం రెండూ కలిసి మెరిశాయి.
ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గౌతమ్ దగ్గరకు వచ్చి...
అతని చెంపపై గట్టిగా కొట్టాడు....
హాల్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది...
ఆ తర్వాత ప్రిన్సిపాల్ గారి రూం లో ...
ప్రిన్సిపాల్:-" చూడు గౌతం....మీ నాన్న గారు నా ఫ్రైడ్ కాబట్టి వదిలేస్తున అని మాత్రం అనుకోకు ! ఇది ఇంకోక్కసారి రిపీట్ అయ్యిందో.....you will be terminated!!" అని వార్నింగ్ ఇచ్చాడు......
పక్కనే ఉన్న మడం ఇలా అంది...
" గౌతం...యూ ఆర్ a good student....just have some grip on యూర్ anger..." అని మెల్లగ చెప్పింది....
పక్క నుండి సిద్దార్థ్ ఇలా అరిచాడు...." He doesn't even care....." అని అన్నాడు...అప్పుడు గౌతం నవ్వాడు....కానీ ఆ నవ్వు సిద్దార్థ్ కి నచ్చలేదు...ఎంతైనా ప్రొఫెసర్ కదా !
కోపం తో ఇలా అన్నాడు...." As a punishment....you have to take artificial intelligence classes for your juniors .....for one month " అని అన్నాడు....అప్పుడు గౌతం చాలా సీరియస్ గా చూసాడు.....
ఇప్పుడు మదలైయింది అసలు కథ !!!!
OKA JEEVITHAM
By Writer_aj
Published: July 1, 2026 at 1:34 PM
Your input calibrates the database for others.
Ready to play...