SCREEN ON

Loading File

Chapter 9

Chapter 8
Chapter 9
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 8

OKA JEEVITHAM

Chapter 9
Chapter 8
Chapter 9

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 9

Jump Now

Directory

01

CHARISHMA AND FAMILY

02

The AMAR's concert

03

THE DARK SKY WITHOUT ITS MOON

04

The match fixing plan

05

AMAR's innocence, Arjun's mater plan

06

Sambaihya's pride and ego

07

Ramam's disappointment

08

Charishma's awaited

Active
09

Trip to kedarnath 🌟

10

The station meet up

11

THE PAST OF AMAR

12

Reena hates Gautham ?

13

Is amar pakistani?

Chapter // 08

Charishma's awaited

Writer_aj
Fantasy
1 Min Read
Pub: Jun 13, 2026
Upd: Jul 15, 2026

మధ్యాహ్నం...

సూర్యుడు మెల్లగా తన వేడిని తగ్గించుకుంటున్న సమయం.

అమర్ ప్రయాణిస్తున్న కారు నెమ్మదిగా ఒక పాత వీధిలోకి తిరిగింది.

కిటికీ బయట చూస్తూ కూర్చున్న అమర్, చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తున్నాడు.

ఎత్తైన భవనాలు లేవు.

అత్యాధునిక గేట్లు లేవు.

మెరుస్తున్న గాజు గోడలు లేవు.

కానీ...

ఆ ప్రాంతంలో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంది.

ఎన్నో జ్ఞాపకాలను దాచుకున్నట్టుగా అనిపించే నిశ్శబ్దం ఉంది.

కొద్దిసేపటికి...

డ్రైవర్ కారు నెమ్మదిగా ఒక ఇంటి ముందు ఆపాడు.

అమర్ కిటికీ బయటికి చూసాడు.

అతని కళ్ళలో ఒక్కసారిగా ఆసక్తి మెరిసింది.

అది సాధారణ ఇల్లు కాదు.

పాతకాలపు నిర్మాణం.

పెద్ద చెక్క గేటు.

ఎర్రటి పెంకులతో చేసిన పైకప్పు.

ముందు భాగంలో పొడవైన అరుగు.

తెల్లని గోడల మీద కాలం వేసిన ముద్ర.

ఆ ఇంటిని చూస్తుంటే...

ఇప్పటి కాలంలో కాకుండా...

నలభై ఏళ్ల క్రితం తెలుగు సినిమాల్లో కనిపించే ఇల్లు గుర్తొస్తోంది.

అమర్ పెదవులపై చిరునవ్వు మెరిసింది.

"చాలా అందంగా ఉంది."

అని మనసులో అనుకున్నాడు.

"ఇలాంటి ఇళ్లు ఇప్పుడు చాలా అరుదు."

అతనికి తెలియకుండా...

ఆ ఇంటి మీద ఒక అభిమానం కలిగింది.

అదే సమయంలో...

పై అంతస్తులో...

తన గది కిటికీ దగ్గర నిలబడి ఉంది చారిష్మ.

ఉదయం నుంచి ఎదురు చూస్తోంది.

ఎన్నిసార్లు గడియారం చూసిందో...

ఎన్నిసార్లు కిటికీ బయట చూసిందో...

తనకే గుర్తులేదు.

అప్పుడే కారు శబ్దం వినిపించింది.

"వచ్చాడు!"

అని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది.

వెంటనే కిటికీ దగ్గరకు పరుగెత్తింది.

తెర కొద్దిగా పక్కకు జరిపి...

కిందకి తొంగిచూసింది.

అమర్ కారు దిగుతున్నాడు.

కానీ...

కిటికీ కోణం సరిగ్గా లేకపోవడంతో...

అతని ముఖం స్పష్టంగా కనిపించడం లేదు.

ఎంత ప్రయత్నించినా...

ఒక్కోసారి భుజం మాత్రమే కనిపిస్తోంది.

మరోసారి జుట్టు మాత్రమే.

"అయ్యో..."

అని పెదవి కొరికింది.

ఇంత దగ్గరికి వచ్చి కూడా...

సరిగ్గా చూడలేకపోవడం ఆమెకు బాధగా

అనిపించింది.

కింద...

ఇంటి ముందు...

చారిష్మ తల్లి ఒక చెంబులో నీళ్లు తీసుకుని వచ్చింది.

"రండి బాబూ."

"ముందు కాళ్లు కడుక్కోండి."

అంది మర్యాదగా.

అమర్ కాసేపు ఆశ్చర్యపోయాడు.

ఇలాంటి ఆచారాలు ఇప్పుడు చాలా అరుదు.

కానీ...

ఆ మర్యాదలో ఉన్న ఆప్యాయత అతనికి బాగా నచ్చింది.

నవ్వుతూ కాళ్లు కడుక్కున్నాడు.

తర్వాత ఇంట్లోకి అడుగుపెట్టాడు.

అడుగు పెట్టిన క్షణం...

అతని చూపు ఇంటి మధ్యలో ఆగిపోయింది.

ఇంటి నడుమ...

ఒక పెద్ద చెట్టు ఉంది.

దాని చుట్టూ చిన్న వేదికలా నిర్మించారు.

ఆ చెట్టు నీడ మొత్తం ఇంటికి చల్లదనాన్ని ఇస్తోంది.

పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి.

గాలి మెల్లగా వీచి ఆకులు కదులుతున్నాయి.

అమర్ కొద్దిసేపు అక్కడే నిలబడ్డాడు.

"ఇంటి మధ్యలో చెట్టు..."

"వావ్."

"చాలా బాగుంది."

అని అనుకున్నాడు.

ఎందుకో...

ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి...

తన మనసు కొంచెం ప్రశాంతంగా మారుతోంది.

రామం...

అమర్‌ను అందరికీ పరిచయం చేయడం ప్రారంభించాడు.

"సర్..."

"ఇవరు మా అమ్మ."

"ఇవరు మా నాన్న."

"ఇక ఇవిడ నా భార్య కావ్య."

అమర్ అందరికీ నవ్వుతూ నమస్కరించాడు.

వాళ్లు కూడా ఎంతో ప్రేమగా పలకరించారు.

ఇంత పెద్ద స్టార్ తమ ఇంట్లో కూర్చున్నా...

ఎక్కడా అతిగా ప్రవర్తించడం లేదు.

అది అమర్‌కి మరింత నచ్చింది.

పై అంతస్తులో...

చారిష్మ మాత్రం ఇంకా యుద్ధమే చేస్తోంది.

ఒకసారి కిటికీ దగ్గర.

ఒకసారి తలుపు దగ్గర.

మరోసారి బాల్కనీ దగ్గర.

కానీ...

అమర్ ముఖం మాత్రం సరిగ్గా కనిపించడం లేదు.

అంతలో...

కింద నుంచి నవ్వుల శబ్దాలు వినిపించాయి.

సాంబయ్య తన చిన్ననాటి కథలు చెబుతున్నాడు.

అర్జున్‌తో చేసిన అల్లరులు...

పాఠశాల రోజుల జ్ఞాపకాలు...

పాత సంఘటనలు...

అమర్ అవన్నీ వింటూ నవ్వుతున్నాడు.

"ఎంతైనా నాన్నగారి కథలే కదా..."

అని మనసులో అనుకున్నాడు.

కానీ...

చారిష్మకు మాత్రం ఇప్పుడు ఒక విషయం అర్థమైంది.

ఇలా కూర్చుంటే...

ఎప్పటికీ అమర్‌ను చూడలేను.

అందరూ కిందే మాట్లాడుకుంటూ ఉంటారు.

తన గురించి మాట్లాడి...

తర్వాత వెళ్లిపోతాడు.

అది మాత్రం జరగకూడదు.

ఆమె గుండె ధైర్యం చేసింది.

గది తలుపు మెల్లగా తెరిచింది.

మెట్ల వైపు చూసింది.

ఎవరూ లేరు.

నెమ్మదిగా...

ఒక్కో మెట్టు దిగడం ప్రారంభించింది.

ఆమె కాళ్లలో ఉన్న పట్టీలు చిన్న శబ్దం చేస్తున్నాయి.

అందుకే...

ఇంకా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

ఒక్కో మెట్టు...

ఒక్కో ఊపిరి...

ఒక్కో గుండె చప్పుడు...

అలా...

సగం మెట్లు దిగేసింది.

ఇప్పుడు కింద హాల్ కనిపిస్తోంది.

అమర్ కూర్చున్న చోటు కూడా కనిపిస్తోంది.

ఇంకా రెండు మూడు మెట్లు దిగితే...

అతన్ని స్పష్టంగా చూడొచ్చు.

ఆమె గుండె ఆనందంతో కొట్టుకుంటోంది.

అప్పుడే...

కింద నుంచి రామం స్వరం వినిపించింది.

"సరే సర్..."

"పదండి."

"మా చెల్లిని కలిసి వద్దాం."

అన్నాడు.

చారిష్మ ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది.

"వస్తున్నారు!"

"ఇక్కడికే వస్తున్నారు!"

అని ఆనందపడింది.

అయితే...

అప్పుడే ఆమె తల్లి మాట్లాడింది.

"అది అంతే బాబూ..."

"ఎప్పుడూ తన గదిలోనే ఉంటుంది."

"బయటికి రమ్మంటే కూడా రాదు."

"ఒంటరిగానే ఉంటుంది."

అంది.

ఆ మాటలు విన్న అమర్ మెల్లగా నవ్వాడు.

"పోనీలెండి."

"ఎక్కడ ఉంటే ఏముంది?"

"ఆమెకు కంఫర్ట్‌గా ఉంటే చాలు."

"అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు కదా."

అన్నాడు.

ఆ మాటలు వినగానే...

సాంబయ్య ముఖం మారిపోయింది.

అతనికి ఆ మాట నచ్చలేదు.

ఎందుకంటే...

అమర్ వెళ్లిపోతాడేమో అనే భయం వచ్చింది.

కానీ...

ఏమీ మాట్లాడలేదు.

పై మెట్లపై...

ఆ మాటలు విన్న చారిష్మ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది.

"ఏమిటి?"

"ఇబ్బంది పెట్టకూడదా?"

"అంటే..."

"పైకి రారా?"

ఆమె ముఖంలో ఆందోళన కనిపించింది.

వెంటనే తన కాళ్లలో ఉన్న పట్టీలు తీసేసింది.

చేతిలో పట్టుకుంది.

శబ్దం రాకూడదు కాబట్టి.

తర్వాత...

ఎవరూ చూడకుండా...

పరిగెత్తుకుంటూ మళ్లీ పైకి వెళ్లిపోయింది.

పాపం...

సగం మెట్లు దిగిన దగ్గర నుంచే...

వాళ్లు పైకి రావాలని ఎంత ఆశపడిందో.

ఇప్పుడైతే...

తన గదిలో నిలబడి...

తలుపు వైపు చూస్తోంది.

గుండెల్లో ఒకే ఆలోచన.

"ఇంకొన్ని క్షణాలు..."

"ఇంకొన్ని క్షణాల్లో..."

"నేను అమర్‌ను చూస్తాను..."

"ఎన్నో సంవత్సరాలుగా నా కలల్లో చూసిన వ్యక్తిని..."

"నా కళ్ల ముందే చూస్తాను..."

అని.

ఆమెకు తెలియదు...

అదే సమయంలో...

అమర్ జీవితంలో కూడా ఒక మరచిపోలేని క్షణం దగ్గరపడుతోంది.

ఒకరు...

కలలతో ఎదురు చూస్తున్నారు.

మరొకరు...

ఒక అపరిచితురాలిని ఓదార్చడానికి వస్తున్నారు.

కానీ...

విధి మాత్రం...

వాళ్లిద్దరి కోసం ఇంకేదో రాసి పెట్టింది...

OKA JEEVITHAM

By Writer_aj

Published: June 30, 2026 at 10:49 AM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...