Loading File
Initializing...
Chapter 6
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
సాయంత్రం...
రామం జీవితంలో చాలా రోజుల తర్వాత ఇంత సంతోషంగా ఉన్న రోజు అది.
ఇంటికి వస్తున్నంతసేపూ అతని ముఖంలో చిరునవ్వు చెదరలేదు.
కారు ఆపి ఇంట్లోకి అడుగుపెట్టగానే...
చేతిలో ఉన్న ఆఫీస్ బ్యాగ్‌ను సోఫా మీద విసిరేశాడు.
షూస్ కూడా సరిగ్గా తీసే ఓపిక లేకుండా...
మెట్ల మీద రెండు రెండు మెట్లు దాటుకుంటూ పైకి పరుగెత్తాడు.
నేరుగా చారిష్మ గది ముందు ఆగి...
తలుపు గట్టిగా తెరిచాడు.
"చారిష్మా...!"
అని పెద్దగా అరిచాడు.
గదిలో మంచం మీద కూర్చొని ఏదో పుస్తకం చదువుతున్న చారిష్మ ఉలిక్కిపడి చూసింది.
" ఏంటి ?" అని కంగారు పడింది...
రామం మాత్రం ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోకుండా మాట్లాడడం ప్రారంభించాడు.
"అతన్ని కలిశాను!"
"అమర్‌ని!"
"అబ్బో... ఎంత మంచోడో తెలుసా?"
"అంత పెద్ద స్టార్ అయినా అసలు పొగరు లేదు."
"చాలా డౌన్ టు ఎర్త్."
"చాలా తెలివైనవాడు."
"మాట్లాడే విధానం..."
"ఆలోచించే విధానం..."
"ప్రవర్తించే తీరు..."
అన్నీ అద్భుతంగా ఉన్నాయి."
రామం కళ్లల్లో ఉత్సాహం మెరుస్తోంది.
"ఎందుకో తెలియదు కానీ..."
"నువ్వు ఆ ఇంటికి కోడలిగా వెళ్తావు అనుకుంటే..."
"నాకే చాలా లక్కీగా అనిపిస్తోంది."
"నీ వల్ల నా బిజినెస్ ప్రమోషన్స్ కూడా ఈజీ అవుతాయి."
"నా కంపెనీ ఇంకో లెవెల్‌కి వెళ్తుంది."
"మన జీవితాలే మారిపోతాయి."
అని ఊపిరి తీసుకోకుండా మాట్లాడేశాడు.
చారిష్మ మాత్రం నోరు తెరిచి చూస్తోంది.
ఒక్క మాట కూడా అర్థం కాలేదు.
"ఏంట్రా అన్నయ్యా?"
"దారిలో దిష్టి నిమ్మకాయ ఏదైనా తొక్కి వచ్చావా?"
"ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా?"
అని వెటకారంగా అడిగింది.
రామం మనసులో మాత్రం...
"అయ్యో... దీనికి బుర్ర లేదని మర్చిపోయాను."
అని అనుకున్నాడు.
"సరే."
"ఇక్కడ కూర్చో."
"జరిగింది మొత్తం చెబుతాను."
అన్నాడు.
ఆ తర్వాత...
అమర్ ఇంటికి వెళ్లిన విషయం...
అర్జున్‌తో సంభాషణ...
పెళ్లి సంబంధం...
అమర్ గురించి...
అన్నీ ఒక్కొక్కటిగా వివరంగా చెప్పాడు.
ఆ మాటలు వింటున్న కొద్దీ...
చారిష్మ ముఖం మారిపోతోంది.
మొదట ఆశ్చర్యం...
తర్వాత నమ్మలేని ఆనందం...
తర్వాత ఉత్సాహం...
చివరికి...
ఆమెకు తాను కలలో ఉన్నానో...
నిజంగా ఉన్నానో కూడా అర్థం కాలేదు.
ఎన్నో సంవత్సరాలుగా అభిమానిస్తున్న వ్యక్తి...
తన జీవితంలోకి రావచ్చని ఎప్పుడూ ఊహించలేదు.
ఆనందంతో ఆమె కళ్ళు మెరిశాయి.
"నిజమా?"
"నిజంగానా?"
అని పదేపదే అడిగింది.
ఆ తర్వాత...
ఆమె ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచింది.
గదిలో నుంచి పరుగెత్తుకుంటూ బయటికి వచ్చింది.
హాల్‌లోకి వెళ్లింది.
మళ్లీ వంటగదిలోకి వెళ్లింది.
మళ్లీ మెట్ల దగ్గరకు వచ్చింది.
ఇంట్లో చిన్న పిల్లలాగా గెంతులు వేస్తూ తిరుగుతోంది.
ఆ ఆనందానికి హద్దులే లేవు.
అది చూసి...
ఆమె తల్లి...
తండ్రి...
రామం భార్య...
అందరూ నవ్వుకుంటున్నారు.
అవును...
రామానికి ఇప్పటికే పెళ్లయింది.
అతని భార్య ప్రస్తుతం గర్భవతి కూడా.
ఆమె కడుపు మీద చేయి పెట్టుకుని...
చారిష్మ చేస్తున్న అల్లరిని చూసి నవ్వుతోంది.
ఇంట్లో చాలా రోజుల తర్వాత ఇంత ఆనందం కనిపించింది.
అప్పుడే...
రామం మళ్లీ వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు.
"అమ్మాయి..."
"కొంచెం భూమి మీద ఉండు."
"నేరుగా ఆకాశంలోకి ఎగిరిపోకు."
అన్నాడు.
"ఎందుకంటే..."
"ఆ అమర్‌కి నువ్వంటే ఇష్టం లేదు."
"అసలు నువ్వెవరో కూడా తెలియదు."
ఆ మాట విని చారిష్మ కాసేపు ఆగింది.
ఆప్పుడే
సాంబయ్య మాట్లాడాడు.
"అది మాత్రమే కాదు అమ్మా."
"ఆ అబ్బాయికి పెళ్లి మీద అసలు ఆసక్తి లేదట."
"గతంలో కోటీశ్వరుల సంబంధాలు కూడా వద్దన్నాడట."
"అందుకే..."
"మనం వెళ్లి మాట్లాడడం ఎందుకు అనుకున్నాను."
"నేనే వద్దు అన్నాను."
"కానీ..."
"నా స్నేహితుడు అర్జున్ మాత్రం ఒప్పుకోలేదు."
"నీ ఫోటో చూసి..."
"నా కోడలు అయితే ఇలాంటి అమ్మాయే రావాలి."
అని పట్టుబట్టాడు.
ఆ మాట విన్న చారిష్మ చిన్నగా నవ్వింది.
"నన్ను చూసాక ఇష్టం వస్తుంది లే నాన్న."
"నాకు అమర్‌ని కలవాలి."
అని అల్లరి పిల్లలా చెప్పింది.
ఆమె కళ్లల్లో కనిపిస్తున్న ప్రేమ...
ఆరాధన...
అభిమానం...
అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కానీ...
రామం ముఖం ఒక్కసారిగా సీరియస్ అయింది.
ఇంకో విషయం చెప్పాలి.
అతను నెమ్మదిగా...
అమర్ ఇంట్లో తాను చెప్పిన అబద్ధం మొత్తం చెప్పేశాడు.
చారిష్మకు ప్రాణాపాయం ఉందని...
కొన్ని నెలలే బతుకుతుందని...
అదే కారణంగా అమర్ స్పందించాడని...
అన్నీ చెప్పేశాడు.
ఒక్క క్షణం...
ఇల్లు మొత్తం నిశ్శబ్దమైంది.
సాంబయ్య చెయ్యి నేరుగా రామం చెంప మీద పడింది.
అందరూ షాక్ అయ్యారు.
"ఇదేనా నీ తెలివి?"
"దీనినే దిగజారడం అంటారు!"
అని కోపంతో అరిచాడు.
రామం చెంప పట్టుకున్నాడు.
సాంబయ్య కళ్లలో కోపం మాత్రమే కాదు...
ముప్పై సంవత్సరాలుగా దాచుకున్న బాధ కూడా కనిపిస్తోంది.
"నువ్వు అడిగావు కదా..."
"నేను ఇన్ని సంవత్సరాలు అర్జున్‌తో ఎందుకు మాట్లాడలేదని?"
"చెబుతాను విను!"
అతని గొంతు వణికింది.
"ఒకసారి అతని ఆఫీస్‌కి వెళ్లాను."
"ఆరు గంటలు..."
"ఆరు గంటలు ఒక్కడినే కూర్చోబెట్టాడు."
"నేను ఎదురు చూస్తున్నాననే విషయం కూడా పట్టించుకోలేదు."
"చివరికి ఆఫీస్ అయిపోయాక వచ్చి..."
"ఏం అనుకోకు రా సాంబా..."
"రేపు రా..."
"ఖాళీగానే ఉన్నావుగా..."
అని నవ్వాడు."
"ఆ రోజు నా ఆత్మగౌరవం ఎంత దెబ్బతిందో తెలుసా?"
"ముప్పై సంవత్సరాలు అయినా నేను మర్చిపోలేదు."
"ఇప్పుడు..."
"నా కూతురిని వాళ్ల ముందు జాలి పడే స్థితిలో చూపించావు."
"అది నాకు తట్టుకోవడం కష్టం."
అని అన్నాడు.
చారిష్మ కళ్లలో నీళ్లు తిరిగాయి.
తండ్రి బాధ అర్థమైంది.
అన్నయ్య ఉద్దేశం కూడా అర్థమైంది.
కొన్ని క్షణాలు మౌనంగా నిలబడి...
తర్వాత నెమ్మదిగా చెప్పింది.
"నాన్న..."
"ఆ కోపాలు..."
"ఆ బాధలు..."
"అన్నీ అప్పటి విషయాలు."
"ఏమైందో జరిగిపోయింది."
"కానీ ఇప్పుడు చూడండి..."
"ఆయనే కదా..."
"నన్ను కోడలిగా తీసుకురావాలని అంటున్నారు."
"ఒక విధంగా చూస్తే..."
"గెలిచింది మీరే."
అంది.
సాంబయ్య తల దించుకున్నాడు.
తన కూతురు ఎంత పెద్దదైందో...
ఎంత పరిణతి చెందిందో...
ఆ క్షణంలో అర్థమైంది.
అయినా...
ఒక తండ్రి గుండె మాత్రం ఒప్పుకోవడం లేదు.
"నీకు లేని జబ్బు ఉందని చెప్పడం..."
"అది అవమానం కాదా?"
అని అడిగాడు.
చారిష్మ కళ్లలో ఒక్కసారిగా ప్రేమ మెరిసింది.
"పర్లేదు నాన్న."
"అతనంటే నాకు ఇష్టం."
"చాలా ఇష్టం."
"ప్లీజ్ నాన్న..."
అని బతిమాలింది.
సాంబయ్య కాసేపు ఆమెను చూశాడు.
తన కూతురు ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి...
ఇంకేం చెప్పలేకపోయాడు.
"సరే."
"మీ ఇష్టం."
అని చెప్పి అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్లిపోయాడు.
అతని ముఖంలో విచిత్రమైన భావన.
ఒకవైపు...
అమర్‌తో సంబంధం వస్తోందనే ఆనందం.
మరోవైపు...
తన కూతురు ఎక్కడైనా వాళ్ల ముందు చిన్నబోతుందేమో అన్న భయం.
అదే తండ్రి మనసు.
బయటకు ధైర్యంగా కనిపిస్తుంది.
కానీ...
లోపల మాత్రం కూతురు కోసం ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది.
ఆ రాత్రి...
చారిష్మ ఆనందంతో నిద్రపోలేదు.
సాంబయ్య ఆందోళనతో నిద్రపోలేదు.
రామం తన అబద్ధం గురించి ఆలోచిస్తూ నిద్రపోలేదు.
కానీ...
వాళ్లలో ఎవరికీ తెలియని విషయం ఒక్కటే.
అమర్ జీవితంలో దాగి ఉన్న ఆ గతం...
చాలా త్వరలో అందరి జీవితాలను మార్చబోతోంది...
OKA JEEVITHAM
By Writer_aj
Published: June 30, 2026 at 7:03 AM
Your input calibrates the database for others.
Ready to play...