SCREEN ON

Loading File

Chapter 8

Chapter 7
Chapter 8
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 7

OKA JEEVITHAM

Chapter 8
Chapter 7
Chapter 8

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 8

Jump Now

Directory

01

CHARISHMA AND FAMILY

02

The AMAR's concert

03

THE DARK SKY WITHOUT ITS MOON

04

The match fixing plan

05

AMAR's innocence, Arjun's mater plan

06

Sambaihya's pride and ego

07

Ramam's disappointment

Active
08

Charishma's awaited

09

Trip to kedarnath 🌟

10

The station meet up

11

THE PAST OF AMAR

12

Reena hates Gautham ?

13

Is amar pakistani?

Chapter // 07

Ramam's disappointment

Writer_aj
Fantasy
1 Min Read
Pub: Jun 13, 2026
Upd: Jul 15, 2026

మరుసటి రోజు...

ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించకముందే...

చారిష్మ మాత్రం నిద్రలేచింది.

సాధారణంగా అయితే ఇంకో గంట అయినా దుప్పటి కప్పుకుని పడుకునే అమ్మాయి.

కానీ ఈరోజు పరిస్థితి వేరు.

ఈరోజు...

తను ఎన్నో సంవత్సరాలుగా అభిమానిస్తున్న వ్యక్తిని చూడబోతోంది.

అదీ కేవలం టీవీలో కాదు...

ఎదురుగా.

నిజంగా.

అందుకే రాత్రంతా సరిగా నిద్ర కూడా పట్టలేదు.

స్నానం చేసి...

జుట్టు ఆరబెట్టుకుని...

తనకు బాగా నచ్చిన దుస్తులు వేసుకుంది.

చిన్నగా మేకప్ వేసుకుంది.

చేతికి గాజులు.

చెవులకు చిన్న జుమ్కాలు.

ముఖంలో ఆనందం.

కళ్లల్లో మెరుపు.

అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది.

ఒకసారి...

రెండుసార్లు...

మూడుసార్లు...

"వావ్ చారిష్మ..."

అని తనకే తాను చెప్పుకుంది.

"నువ్వు ఈరోజు చాలా బాగున్నావు."

"అమర్ నిన్ను చూసి ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతాడు."

అని నవ్వుకుంది.

తర్వాత ఆనందంగా హాల్‌లోకి వచ్చింది.

అప్పుడే...

ఆమెను చూసిన రామం తల పట్టుకున్నాడు.

"అయ్యో భగవంతుడా!"

"ఇంత తింగరిది ఏంట్రా బాబు!"

అని నిట్టూర్చాడు.

చారిష్మకు ఏమీ అర్థం కాలేదు.

ఆనందంగా తిరిగి చూపిస్తూ...

"ఎలా ఉన్నాను అన్నయ్యా?"

అని అడిగింది.

రామం నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు.

ఒక్కసారిగా...

టప్!...అని తల మీద చిన్న మొట్టికాయ వేశాడు.

"అమ్మా తింగరిదానా!"

"నిన్న నేను అక్కడ ఏమన్నాను?"

"నీకు క్యాన్సర్ ఉందని చెప్పాను."

"కొన్ని నెలలే బతుకుతుందని చెప్పాను."

"అలాంటిది నువ్వు ఇలా సినిమా హీరోయిన్‌లా రెడీ అయి..."

"ముఖంలో వెలుగులు మెరిపిస్తూ..."

"ఇంకో రెండు గంటల్లో డాన్స్ చేస్తానన్నట్టు కనిపిస్తే..."

"ఎవడు నమ్ముతాడు?"

అన్నాడు.

చారిష్మ తల నిమురుకుంటూ నిలబడింది.

మొట్టికాయ బాగానే తగిలింది.

కానీ...

అన్నయ్య చెప్పింది కూడా నిజమే అనిపించింది.

"సారీ అన్నయ్య."

అంది చిన్న పిల్లలా.

"సరే."

"నార్మల్‌గానే ఉంటాను."

అని మొహం ముడుచుకుంది.

అది చూసి రామం నవ్వుకున్నాడు.

తర్వాత తన భార్య కావ్య వైపు చూసి సైగ చేశాడు.

"దీనిని రెడీ చెయ్యి."

అని.

తర్వాత కార్ తాళాలు తీసుకుని...

అమర్‌ను తీసుకురావడానికి బయలుదేరాడు.

కావ్య నవ్వుకుంటూ చారిష్మ చేయి పట్టుకుంది.

"రా."

"ఇప్పుడు నేను నిన్ను రెడీ చేస్తాను."

అంది.

చారిష్మ ఆనందంగా వెళ్లింది.

కానీ...

పది నిమిషాల తర్వాత...

ఆమె ఆనందం మొత్తం మాయమైంది.

ఎందుకంటే...

కావ్య నిజంగానే ఒక పేషెంట్‌లా తయారు చేసింది.

ముఖానికి మేకప్ తీసేసింది.

జుట్టు సరిగ్గా కట్టేసింది.

మెరిసే డ్రెస్ తీసేసి...

సాధారణమైన లైట్ కలర్ డ్రెస్ వేసింది.

కళ్ల కింద కొద్దిగా డార్క్ షేడ్ కూడా పెట్టింది.

అద్దం ముందు నిలబడి చూసుకున్న చారిష్మ షాక్ అయిపోయింది.

"ఇది నేనా?"

"లేక హాస్పిటల్ నుంచి ఇప్పుడే డిశ్చార్జ్ అయిన వాళ్లలో ఎవరైనా?"

అని అనుకుంది.

కళ్లలో నీళ్లు తిరిగాయి.

"వదినా..."

అని ఏడుపు ముఖంతో పిలిచింది.

"ఎంత బాగా రెడీ అయ్యానో తెలుసా?"

"ఇప్పుడు నన్ను ఎందుకు ఇలా చేసావు?"

"ప్లీజ్ వదినా."

"అన్నయ్య వెళ్లిపోయాడు కదా."

"ప్లీజ్."

అని బతిమాలింది.

కానీ కావ్య మాత్రం ఒప్పుకోలేదు.

"లేదు."

"ఈరోజు నువ్వు పేషెంట్‌లాగే కనిపించాలి."

"అది ప్లాన్."

అంది.

చారిష్మ ముఖం చిన్నబోయింది.

అద్దం ముందు నిలబడి...

"అమర్ ముందు మాత్రం ఇలా కనిపించను..."

అని మనసులో ప్రమాణం చేసింది.

మరోవైపు...

రామం అప్పటికే అమర్ ఇంటికి చేరుకున్నాడు

అమర్ కూడా సిద్ధంగానే ఉన్నాడు.

తెల్లటి షర్ట్...

లైట్ బ్లూ జీన్స్...

సాధారణమైన లుక్.

ఎంత పెద్ద స్టార్ అయినా...

అతని సింప్లిసిటీ మాత్రం అలాగే ఉంటుంది.

"వెళ్దామా?"

అని అడిగాడు.

"వెళ్దాం సార్."

అన్నాడు రామం.

ఇద్దరూ ఇంటి బయటకు వచ్చారు.

కారు దగ్గరికి చేరుకున్నారు.

అప్పుడే...

అమర్ ఒక్కసారిగా ఆగిపోయాడు.

ఏదో గుర్తొచ్చినట్టు ముఖం మారిపోయింది.

"ఒక్క నిమిషం."

అని చెప్పి...

ఒక్కసారిగా ఇంట్లోకి పరుగెత్తాడు.

రామం ఆశ్చర్యంగా చూశాడు.

"ఏమైంది?"

అని రామ్ వైపు తిరిగి అడిగాడు.

రామ్ భుజాలు ఎగరేశాడు.

"వాష్‌రూమ్‌కి వెళ్లాడేమో."

"వస్తాడు లే."

"మనం కారులో కూర్చుందాం."

అన్నాడు.

ఇద్దరూ కారులో కూర్చున్నారు.

కొన్ని నిమిషాల తర్వాత...

అమర్ బయటకు వచ్చాడు.

కానీ...

అతని చేతిలో ఒక పెద్ద ప్యాకెట్ ఉంది.

చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు.

కారులో కూర్చున్నాక...

రామం ఆసక్తిగా అడిగాడు.

"అది ఏమిటి సార్?"

అమర్ చిన్నగా నవ్వాడు.

ప్యాకెట్ తెరిచాడు.

లోపల ఒక అందమైన పెయింటింగ్ ఉంది.

ఆకాశంలో నల్లని మేఘాల మధ్య...

ఒక చిన్న వెలుగు కిరణం కనిపిస్తోంది.

ఆ కిరణం వైపు చూస్తూ నిలబడ్డ ఒక చిన్న అమ్మాయి.

పెయింటింగ్ కింద ఒక పేరు రాసి ఉంది.

"There Is Hope"

"దీనిని నిన్న రాత్రి వేసాను."

అన్నాడు అమర్.

"మీ చెల్లెలి కోసం."

రామం ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు.

అమర్ ఆ పెయింటింగ్ వైపు చూస్తూ మెల్లగా అన్నాడు.

"జీవితంలో ఎంత చీకటి వచ్చినా..."

"ఆశ మాత్రం ఉండాలి."

"అందుకే ఈ పేరు పెట్టాను."

తర్వాత చిరునవ్వు నవ్వాడు.

"ఉట్టి చేతులతో వెళ్లడం బాగోదు కదా."

"కనీసం ఇది అయినా తీసుకెళ్దాం అనుకున్నాను."

ఆ మాటలు విన్న రామం గుండె ఒక్కసారిగా భారమైంది.

కారు కిటికీ బయటకు చూస్తూ మౌనంగా కూర్చున్నాడు.

ఎందుకంటే...

ఆ పెయింటింగ్‌లోని ప్రతి రంగు...

ప్రతి గీత...

ప్రతి భావం...

ఒక అబద్ధం మీద నిర్మించబడినవి.

అమర్‌కు తెలియదు.

చారిష్మకు ఎలాంటి జబ్బు లేదు.

ఆమె చనిపోవడం లేదు.

ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉంది.

కానీ...

అతను మాత్రం ఆమె కోసం రాత్రంతా

మేల్కొని...

ఒక పెయింటింగ్ వేశాడు.

ఆమె మనసుకు ధైర్యం ఇవ్వాలని.

ఆమె జీవితంలో ఆశ నింపాలని.

కారు ముందుకు వెళ్తోంది...

కానీ...

రామం మనసులో మాత్రం ఒకే ఆలోచన.

"ఈ అబద్ధం ఎంత ముందుకు వెళ్తే..."

"అంత పెద్ద సమస్య అవుతుంది."

"నిజం బయటపడిన రోజు..."

"అమర్ కళ్లల్లో నేను ఎలా చూస్తాను?"

అని.

అయినా...

ఇప్పుడిక వెనక్కి తిరిగే దారి లేదు.

ఒక అబద్ధం...

ఇప్పటికే అందరి జీవితాల్లోకి అడుగుపెట్టింది.

ఇప్పుడు అది ఎవరిని ఎక్కడికి తీసుకెళ్తుందో...

కాలమే చెప్పాలి......

OKA JEEVITHAM

By Writer_aj

Published: June 30, 2026 at 10:38 AM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...