Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
చారిష్మ ఇంటి నుంచి తిరిగి వచ్చిన తర్వాత, అమర్ కారులో మొత్తం ప్రయాణం నిశ్శబ్దంగానే ఉన్నాడు.
రామ్ ఎన్నిసార్లు మాట్లాడేందుకు ప్రయత్నించినా, అమర్ మాత్రం కిటికీ బయటకే చూస్తూ ఉన్నాడు.
అతని మనసులో ఏదో జరుగుతోంది.
ఆలోచనలు ఒకదానిపై ఒకటి పడి గందరగోళంగా మారుతున్నాయి.
చారిష్మ ముఖంలో కనిపించిన ఆనందం...
ఆమె గదిలో కనిపించిన తన ఫోటోలు...
ఆమె చెప్పిన కేదార్‌నాథ్ కోరిక...
అన్నీ మళ్లీ మళ్లీ గుర్తొస్తున్నాయి.
ఇంటికి చేరుకున్న వెంటనే అమర్ నేరుగా తన తండ్రి అర్జున్ గది వైపు నడిచాడు.
తలుపు బలంగా తెరిచి లోపలికి వెళ్లిపోయాడు.
అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది.
అది చూసిన కుమారి గుండె ఒక్కసారిగా దడదడలాడింది.
దూరం నుంచి అన్నీ గమనిస్తోంది.
కానీ లోపల ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించడం లేదు.
"ఏమైంది?"
"ఎక్కడైనా మనం చెప్పిన అబద్ధం
అమర్‌కి తెలిసిపోయిందా?"
అని ఆమె మనసు ఆందోళన చెందింది.
ఎందుకంటే...
తన కొడుకు గురించి ఆమెకు బాగా తెలుసు.
అమర్‌కు అబద్ధం అంటే అస్సలు ఇష్టం ఉండదు.
ముఖ్యంగా జాలి కోసం చెప్పిన అబద్ధాలు.
దాదాపు అరగంట తర్వాత...
గది తలుపు తెరుచుకుంది.
అర్జున్ బయటకు వచ్చాడు.
వెంటనే అమర్ కూడా బయటకు వచ్చాడు.
ఇద్దరి ముఖాల్లోనూ ఎలాంటి కోపం కనిపించలేదు.
చాలా సాధారణంగా మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు.
అది చూసిన కుమారి లోపలే ఊపిరి పీల్చుకుంది.
"హమ్మయ్య..."
"నిజం తెలిసి ఉంటే ఇలా ఉండరు."
అని అనుకుంది.
అప్పుడే మెట్ల మీద నుంచి రామ్ రెండు పెద్ద బ్యాగులతో దిగుతూ కనిపించాడు.
అమర్ ఆశ్చర్యంగా చూశాడు.
"ఏంట్రా?"
"రెండు బ్యాగులు ఎందుకు?"
అని అడిగాడు.
రామ్ ఏదో చెప్పబోతుండగా...
కుమారి మధ్యలోనే మాట్లాడింది.
"పోనీలే రా."
"పాపం... వాడు ఎక్కడికైనా వెళ్తాడా?"
"ఎప్పుడూ నీతోనే ఉంటాడు.
"ఈసారి కూడా తీసుకెళ్లు."
అంది.
అమర్ నవ్వాడు.
"సరే."....అన్నాడు.
రామ్ మాత్రం ఇంకా అయోమయంలోనే ఉన్నాడు.
"నన్నెవరు అడిగారు?"
"నేను ఎప్పుడు వస్తానన్నాను?"
అని మనసులో అనుకున్నాడు.
కానీ బయటకు ఏమీ అనలేదు.
కొద్దిసేపటికే ఇద్దరూ రైల్వే స్టేషన్‌కి బయలుదేరారు.
కారులో వెళ్తూ ఉండగా రామ్ చివరికి తన సందేహం అడిగేశాడు.
"సర్..."
"మీరు అనుకుంటే ప్రైవేట్ జెట్‌లో కూడా వెళ్లొచ్చు."
"లేదంటే ప్లేన్‌లో రెండు గంటల్లో చేరిపోవచ్చు."
"మరి ఇలా ట్రైన్ ఎక్కి ఎందుకు వెళ్తున్నారు?"
అని అడిగాడు.
అమర్ కిటికీ బయటకు చూస్తూనే...
"మూసుకుని నాతో రా."
అన్నాడు.
అంతే.
రామ్‌కు ఇంకా ఏమీ అర్థం కాలేదు.
కానీ...
ఎందుకో ట్రైన్ ప్రయాణం అంటే అతనికి అస్సలు నచ్చలేదు.
"ఇక్కడ జనాలు గుర్తుపడితే?"
"మళ్లీ ఫోటోలు..."
"మళ్లీ సెల్ఫీలు..."
"మళ్లీ గోల..."
అని ముందే భయపడుతున్నాడు.
కొద్దిసేపటికి వారు స్టేషన్‌కి చేరుకున్నారు.
అక్కడ ఇప్పటికే చారిష్మ, రామం ఎదురుచూస్తున్నారు.
ప్లాట్‌ఫారమ్ మీద నిలబడి ఉన్న చారిష్మ కళ్లలో ఈరోజు వేరే వెలుగు ఉంది.
అది ఆనందమో...
ఉత్సాహమో...
నమ్మలేని సంతోషమో...
ఆమెకే అర్థం కావడం లేదు.
అమర్ కనిపించిన క్షణంలో...
ఆమె ముఖం మొత్తం వెలిగిపోయింది.
అది గమనించిన రామ్ కాసేపు ఆమెను పరిశీలించి...
అమర్ చెవిలో మెల్లగా అన్నాడు.
"సర్..."
"ఆ అమ్మాయి ఏ యాంగిల్‌లో చూసినా క్యాన్సర్ పేషెంట్‌లా లేదు."
"గీత గోవిందం సినిమాలో రష్మికలా ఉంది."
అన్నాడు.
అమర్ నవ్వు ఆపుకున్నాడు.
"పేషెంట్ అయితే ట్రిప్‌కి సిలిండర్ బాటిల్ పెట్టుకుని రావాలా?"
అన్నాడు.
కానీ రామ్ ఆగలేదు.
"అది కాదు అమర్..."
"ఆ అమ్మాయికి క్యాన్సర్ ఉంటే జుట్టు ఎందుకు ఉంటుంది.
"ఏ దిల్ హై ముష్కిల్‌లో అనుష్కలా గుండు ఉండాలి కదా?"
అని మళ్లీ అన్నాడు.
అంతే...
అమర్ నెమ్మదిగా అతని కాలు మీద బలంగా తొక్కడు
"అమ్మోఓఓ!"
అని రామ్ పెద్దగా అరిచాడు.
చుట్టూ ఉన్న వాళ్లు ఒక్కసారిగా తిరిగి చూశారు.
చారిష్మ కూడా ఆశ్చర్యంగా చూసింది.
తర్వాత నవ్వుకుంటూ అమర్ దగ్గరకు వచ్చింది.
"హాయ్ సర్!"
అని ఉత్సాహంగా పలికింది.
అమర్ కూడా చిరునవ్వుతో పలకరించాడు.
"హాయ్ చారిష్మ."
"ఇతను రామ్."
"నా ఫ్రెండ్... మేనేజర్... బాడీగార్డ్... డ్రైవర్..."
"అన్నీ కలిపి ఒకడే."
అన్నాడు.
"హలో సర్."
అని రామం మర్యాదగా చేయి చాపాడు.
రామ్ కూడా చేయి కలిపాడు.
కానీ అతని ముఖంలో మాత్రం విచిత్రమైన భావం.
"మీ గురించి నాకు మొత్తం తెలుసు..."
అన్నట్టుగా చూస్తున్నాడు.
పాపం చారిష్మకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
పరిస్థితిని కవర్ చేయడానికి...
"నమస్కారం అండి."
అంది.
అంతే.
రామ్ వెంటనే నటన మొదలుపెట్టాడు.
"అదేంటి?"
"ఆయనకి హాయ్..."
"నాకు మాత్రం నమస్కారమా?"
"నేను కూడా ఈ జనరేషన్ వాడినే."
"నాకూ హాయ్ చెప్పాలి."
అన్నాడు.
చారిష్మ ఒక్కసారిగా నవ్వేసింది.
రామం తల పట్టుకున్నాడు.
అమర్ మాత్రం ఇంకోసారి రామ్ కాలు మీద తొక్కాడు.
"అమ్మో!"
అని మళ్లీ అరిచాడు రామ్.
"వీడి మాటలు పట్టించుకోవద్దు."
అని అమర్ నవ్వుతూ అన్నాడు.
తర్వాత అసలు విషయానికి వచ్చాడు.
"రేయ్..."
"టికెట్లు వాళ్లకి ఇవ్వు."
"ట్రైన్ ఏ ప్లాట్‌ఫారమ్‌కి వస్తుంది?"
అని అడిగాడు.
రామ్ ఇంకా కాలి నొప్పి భరిస్తూనే...
"ప్లాట్‌ఫారమ్ నంబర్... రెండు..."
అన్నాడు.
దూరంగా...
ఒక ట్రైన్ హారన్ వినిపించింది.
పట్టాల మీదుగా గాలి దూసుకొచ్చింది.
చారిష్మ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది.
ఇది కేవలం ఒక ప్రయాణం కాదు.
తన జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా కలగన్న వ్యక్తితో గడపబోయే రోజులకు ఆరంభం.
అమర్‌కి ఇది ఒక అభిమానిని సంతోషపెట్టే ప్రయాణం.
రామంకి ఇది నిజం చెప్పాల్సిన ప్రయాణం.
రామ్‌కి మాత్రం...
ఏదో పెద్ద గందరగోళం జరగబోతోందనే అనుమానం.
అయితే...
వారిలో ఎవరికీ తెలియదు.
ఈ రైలు ప్రయాణం...
వాళ్ల జీవితాలను ఊహించని దిశలో తీసుకెళ్లబోతోందని...
OKA JEEVITHAM
By Writer_aj
Published: June 30, 2026 at 11:40 AM
Your input calibrates the database for others.
Ready to play...