SCREEN ON

Loading File

Chapter 13

Chapter 12
Chapter 13
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 12

OKA JEEVITHAM

Chapter 13
Chapter 12
Chapter 13

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 13

Jump Now

Directory

01

CHARISHMA AND FAMILY

02

The AMAR's concert

03

THE DARK SKY WITHOUT ITS MOON

04

The match fixing plan

05

AMAR's innocence, Arjun's mater plan

06

Sambaihya's pride and ego

07

Ramam's disappointment

08

Charishma's awaited

09

Trip to kedarnath 🌟

10

The station meet up

11

THE PAST OF AMAR

12

Reena hates Gautham ?

Active
13

Is amar pakistani?

Chapter // 12

Reena hates Gautham ?

Writer_aj
Fantasy
1 Min Read
Pub: Jun 13, 2026
Upd: Jul 15, 2026

సెమినార్ హాల్‌లో జరిగిన గొడవ తర్వాత, గౌతమ్‌కు యూనివర్సిటీ యాజమాన్యం ఒక విచిత్రమైన శిక్ష విధించింది.

ఒక వారం రోజుల పాటు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు Artificial Intelligence and Machine Learning (AIML) సబ్జెక్ట్ బోధించాలి.

ఆ శిక్ష విన్న గౌతమ్ పెద్దగా స్పందించలేదు.

"ఒక వారం మాత్రమే కదా..." అనుకుని ఒప్పుకున్నాడు.

మరోవైపు...

ఫస్ట్ ఇయర్ క్లాస్‌రూమ్.

కొత్త విద్యార్థులతో గది మొత్తం నిండిపోయింది.

కొత్త కాలేజీ...

కొత్త స్నేహితులు...

కొత్త వాతావరణం...

ప్రతి ఒక్కరి ముఖంలో చిన్న భయం, కొత్త ఆశలు కనిపిస్తున్నాయి.

"మన క్లాస్ ఎలా ఉంటుందో..."

"టీచర్లు ఎలా ఉంటారో..."

అని అందరూ తమ తమలో మాట్లాడుకుంటున్నారు.

అప్పుడే...

తలుపు నెమ్మదిగా తెరుచుకుంది.

చేతిలో AIML పుస్తకంతో గౌతమ్లో

పలికి అడుగుపెట్టాడు.

అతన్ని చూసిన విద్యార్థులు ఒక్కసారిగా మౌనమయ్యారు.

"సీనియర్ మన క్లాస్‌లోకి ఎందుకు వచ్చాడు?" అనే సందేహంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

ఎవరూ లేచి నిలబడలేదు.

గౌతమ్ కూడా ఏమీ అనకుండా నేరుగాబ్లాక్‌బోర్డు దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు.

వెనుక బెంచీల్లో కూర్చున్న కొందరు అమ్మాయిలు మాత్రం నెమ్మదిగా గుసగుసలాడుతున్నారు.

"చూడడానికి చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు..."

"సీనియర్ అనుకుంటా..."

అని.

ఆ మాటలు విన్న రీనా మొదటిసారి తలెత్తి గౌతమ్‌ను చూసింది.

సెమినార్ హాల్‌లో గొడవ చేసిన అదే అబ్బాయి.

ఆమె తన పక్కన కూర్చున్న ప్రియను మెల్లగా అడిగింది.

"ఇతనే కదా... నిన్న సెమినార్ హాల్‌లో ఒకరిని కొట్టింది?"

ప్రియ తల ఊపింది.

"అబ్బాయి అనకు... మన సీనియర్."

"అసలు వాళ్లు మన రియాను ఏడిపించారట. అందుకే కొట్టాడని విన్నాను."

"అందుకే ప్రిన్సిపాల్ కూడా పెద్దగా ఏమీ అనలేదు.

"పైగా... ఇతనే మన యూనివర్సిటీ టాపర్."

అంది ప్రియ.

రీనా ఆశ్చర్యపోయింది.

"టాపరా...?!"

"అంత బాగా చదివే వాళ్లు ఇంత కోపంగా కూడా ఉంటారా?"

అని మనసులో అనుకుంది.

గౌతమ్ బోర్డు వైపు తిరిగి మార్కర్ చేతిలో పట్టుకుని అన్నాడు.

"సో... నా పేరు గౌతమ్."

"మిగతా నా డీటైల్స్ మీకు అవసరం లేదు."

"ఈ వారం AIML నేను చెబుతాను."

"రోజుకు నలభై ఐదు నిమిషాలు... నేను చెప్పేది సైలెంట్‌గా వింటే చాలు."

"క్లాస్ అయిపోగానే నేను వెళ్లిపోతాను."

అన్నాడు.

అతని గొంతు చాలా ప్రశాంతంగానే ఉన్నా...

అందులో ఒక గంభీరత ఉంది.

క్లాస్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది.

గౌతమ్ చుట్టూ చూసి నవ్వుతూ అడిగాడు.

"ఏంట్రా...? ఎవరూ స్పందించట్లేదు?"

అన్నాడు.

ఆ ఒక్క మాటకే అందరూ ఉలిక్కిపడ్డారు.

"సరే అన్నా..."

అని ఒకేసారి సమాధానం చెప్పారు.

ఆ సమాధానం విన్న గౌతమ్ నవ్వుకున్నాడు.

కానీ...

రీనాకు మాత్రం అతని తీరు అస్సలు నచ్చలేదు.

"అందరినీ భయపెట్టి కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు..."

"పెద్ద మానిప్యులేటర్‌లా ఉన్నాడు."

అని మనసులో అనుకుంది.

బ్రేక్ టైమ్.

రీనా ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తోంది.

"చా... నాకు అస్సలు నచ్చలేదు."

అంది.

ప్రియ నవ్వుతూ,

"మనకెందుకే...?"

"ఒక వారం మాత్రమే కదా."

అని అంది.

అంతలో ఎదురుగా ఒక జూనియర్ విద్యార్థి గౌతమ్ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు.

అతని పేరు...

అమర్.

"అన్నా..."

"క్లాస్ చాలా బాగా చెప్పారు."

"మీరు ఏ హాస్టల్‌లో ఉంటారు?"

"రూమ్ నంబర్ ఏంటి?"

అని అమాయకంగా అడిగాడు.

గౌతమ్ కనుబొమ్మ పైకెత్తి,

"నా రూమ్ నంబర్ తెలుసుకుని ఏం చేస్తావ్?"

అని అడిగాడు.

అమర్ నవ్వుతూ,

"డౌట్స్ వస్తే మీ దగ్గరికి వచ్చేస్తాను అన్నా."

అన్నాడు.

గౌతమ్ చిన్నగా నవ్వుకున్నాడు.

"రూమ్ నంబర్... 218."

అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కానీ...

అది అతని అసలు రూమ్ కాదు.

అమాయకంగా ఎవ్వరూ వచ్చి ఇబ్బంది పెట్టకుండా చెప్పిన అబద్ధం.

పాపం అమర్ మాత్రం అది నిజమే అనుకుని ఎంతో సంతోషంగా వెళ్లిపోయాడు.

ఈ దృశ్యం మొత్తం రీనా, ప్రియ ఇద్దరూ గమనిస్తున్నారు.

"చూశావా?"

"రోడీ కి ఫాలోవర్స్ కూడా ఉంటారేమో."

అంది.

ప్రియ నవ్వుతూ అడిగింది.

"నీకు గౌతమ్ అంటే అంత కోపం

ఎందుకు?"

రీనా కాసేపు ఆలోచించింది.

తర్వాత భుజాలు ఎగరేసి,

"ఏమో..."

"ఎందుకో నచ్చడు."

అంది.

కానీ...

ఆ సమాధానం చెప్పేటప్పుడు ఆమె కళ్లలో కనిపించిన భావం మాత్రం వేరే కథ చెబుతోంది.

అప్పుడే...

అక్కడికి రియా వచ్చింది.

ముఖంలో చిరునవ్వు.

ఆత్మవిశ్వాసంతో గౌతమ్ ముందు నిలబడి,

"Hi Gautham Sir..."

"Actually... I am impressed

with your lecture."

"Can I have your number?"

అని అడిగింది.

గౌతమ్ ప్రశాంతంగా ఆమె వైపు చూసి,

"నీకు తెలుగు రాదా?"

అని అడిగాడు.

రియా నవ్వుతూ,

"కొంచెమే వస్తుంది."

"కానీ ఇది నా నంబర్."

"ఎప్పుడైనా మాట్లాడాలని అనిపిస్తే కాల్ చేయండి."

అని ఒక చిన్న కాగితం అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయింది.

ఆ దృశ్యం చూసిన రీనా మనసులో ఏదో తెలియని అసహనం మొదలైంది.

ఎందుకో చిరాకు వేసింది.

ఆ భావానికి కారణం ఏమిటో తనకే అర్థం కాలేదు.

గౌతమ్ మాత్రం ఆ కాగితాన్ని చూస్తూ నిలబడి ఉన్నాడు.

రీనా అతని పక్కగా వెళ్తూ...

ఉద్దేశపూర్వకంగానే తన భుజంతో అతన్ని ఢీకొట్టింది.

గౌతమ్ వెంటనే వెనక్కి తిరిగి,

"సారీ..."

అన్నాడు.

కానీ రీనా ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి

చూడలేదు.

ఏమీ విననట్టుగా అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోయింది.

గౌతమ్ ఆశ్చర్యంగా ఆమె వెళ్లిన దారినే చూస్తూ నిలిచిపోయాడు.

"తనే వచ్చి ఢీకొట్టింది..."

"నేను సారీ చెప్పినా పట్టించుకోలేదు..."

"వింత అమ్మాయి..."

అని మనసులో అనుకున్నాడు.

ఆ తర్వాత తన చేతిలో ఉన్న రియా నంబర్‌ను మరోసారి చూసాడు.

ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా...

ఆ కాగితాన్ని మడిచి పక్కనే ఉన్న చెత్తబుట్టలో పడేశాడు.

అది చూసిన రీనా దూరం నుంచి తెలియకుండానే చిన్నగా నవ్వుకుంది.

కానీ...

ఆ నవ్వు వెనుక దాగి ఉన్న కారణం

మాత్రం ఇంకా తనకే పూర్తిగా తెలియదు.

కొన్నిసార్లు మన మనసు మనకే నిజం చెప్పదు.

కోపంగా కనిపించే ప్రతి భావం నిజంగా కోపమే కాదు.

కొన్ని అపార్థాలు...

కొన్ని ఇష్టాలు...

కొన్ని అసూయలు...

మనసులోనే దాక్కుని, బయట మాత్రం "నచ్చలేదు" అనే ఒక్క మాటగా బయటపడతాయి.

బహుశా...

అందుకేనేమో...

"ఆడవారి మాటలకు అర్థాలే వేరు..." అంటారు.

OKA JEEVITHAM

By Writer_aj

Published: July 8, 2026 at 8:32 AM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...