SCREEN ON

Loading File

Chapter 14

Chapter 13
Chapter 14
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 13

OKA JEEVITHAM

Chapter 14
Chapter 13
Chapter 14

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 14

Jump Now

Directory

01

CHARISHMA AND FAMILY

02

The AMAR's concert

03

THE DARK SKY WITHOUT ITS MOON

04

The match fixing plan

05

AMAR's innocence, Arjun's mater plan

06

Sambaihya's pride and ego

07

Ramam's disappointment

08

Charishma's awaited

09

Trip to kedarnath 🌟

10

The station meet up

11

THE PAST OF AMAR

12

Reena hates Gautham ?

13

Is amar pakistani?

Active
Chapter // 13

Is amar pakistani?

Writer_aj
Fantasy
1 Min Read
Pub: Jun 13, 2026
Upd: Jul 15, 2026

రాత్రి సమయం.

యూనివర్సిటీ హాస్టల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది.

మరుసటి రోజు సెమిస్టర్ పరీక్షలు ఉండటంతో దాదాపు ప్రతి గదిలోనూ విద్యార్థులు పుస్తకాలతో కూర్చున్నారు.

కానీ...

గౌతమ్ గదిలో మాత్రం వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది.

గౌతమ్ తన చేతిలో ఉన్న క్రికెట్ బాల్‌ను గోడకు బలంగా విసురుతూ, మళ్లీ అది తిరిగి రాగానే పట్టుకుంటూ ఏదో

ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు.

అదే గదిలో మరో బెడ్‌పై రామ్ పుస్తకాలు తెరిచి చదువుతున్నాడు.

చివరికి పుస్తకం మూసేసి విసుగుగా అన్నాడు.

"రేయ్ గౌతమ్... రేపు ఎగ్జామ్ ఉంది రా."

"ఇప్పటికే ఏమీ చదవలేదనే టెన్షన్‌లో ఉన్నాను."

"నువ్వేమో బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నావ్!"

అన్నాడు.

గౌతమ్ మాత్రం సమాధానం చెప్పకుండా ఇంకాస్త బలంగా బాల్‌ను గోడకు విసిరాడు.

"ధబ్!"

"ధబ్!"

అని శబ్దం వినిపిస్తోంది.

రామ్ తల పట్టుకున్నాడు.

"టక్... టక్... టక్..."

అంటూ తలుపు కొట్టిన శబ్దం వినిపించింది.

రామ్ ఒక్కసారిగా నవ్వేశాడు.

"వెళ్లు రా... వార్డెన్ సర్ వచ్చినట్టున్నారు."

"ఇక నీ దూల తీరింది."

అన్నాడు.

గౌతమ్ బాల్‌ను పక్కన పెట్టి తలుపు వైపు నడిచాడు.

బయట వార్డెన్ ఉంటాడేమో అనిపించినా, ఆ భయం అతని ముఖంలో మాత్రం కనిపించలేదు.

తలుపు తెరిచాడు.

కానీ...

ఎదురుగా నిలబడి ఉన్నది వార్డెన్ కాదు.

చిరునవ్వుతో అమర్ నిలబడి ఉన్నాడు.

"అన్నా!"

"నేనే... అమర్."

"ఏంటన్నా... నిన్న మీరు చెప్పిన రూమ్ నంబర్‌కి వెళ్లాను.

"అది మీది కాదట."

"అయినా మీరు తప్పు చెప్పే వాళ్లు కాదులే... నేనే కన్ఫ్యూజ్ అయి ఉంటాను."

అంటూ నవ్వుకుంటూ లోపలికి వచ్చేశాడు.

గౌతమ్ మాత్రం లోపలే నిట్టూర్చాడు.

అమర్ మాత్రం గది మొత్తం ఆసక్తిగా చూస్తున్నాడు.

"అన్నా!"

"మన హాస్టల్‌లో ఇంత పెద్ద రూమ్ కూడా ఉందా?"

"అదిగో... ఇంకో బెడ్ కూడా ఖాళీగా ఉంది."

"నేను ఇక్కడికే షిఫ్ట్ అయిపోతే ఎలా ఉంటుంది?"

అన్నాడు.

గౌతమ్ వెంటనే,

"అవసరం లేదు."

"నీ బ్యాచ్ వాళ్లతోనే ఉండు."

అన్నాడు.

కానీ...

అమర్ అప్పటికే లోపలికి వచ్చి ఖాళీ బెడ్ మీద కూర్చున్నాడు.

రామ్ నవ్వు ఆపుకోలేక అడిగాడు.

"సరే తమ్ముడూ... నీ previous college గ్రేడ్ ఎంత వచ్చింది?"

అమర్ గర్వంగా,

"9.2 అన్నయ్య."

అన్నాడు.

రామ్ వెంటనే గౌతమ్ వైపు చూపిస్తూ,

"వాడితో ఎక్కువ తిరిగితే అది 6కి పడిపోతుంది."

"జాగ్రత్త."

అన్నాడు.

అమర్ ఆశ్చర్యంగా గౌతమ్ వైపు చూశాడు.

"అదేంటి అన్నయ్య?"

అన్నాడు.

రామ్ నవ్వుతూ,

"అదే మా జీవితంలో ఉన్న అతిపెద్ద మిస్టరీ."

అన్నాడు.

కొన్ని రోజులకే అమర్ నిజంగానే అదే గదికి మారిపోయాడు.

ఇప్పుడా గదిలో ముగ్గురు రూమ్‌మేట్స్.

రామ్...

గౌతమ్...

అమర్.

రోజులు గడుస్తున్నాయి.

ఒక రోజు రాత్రి...

అమర్ ఆశ్చర్యంగా గౌతమ్ వైపు చూస్తూ అన్నాడు.

"అన్నా... ఒక విషయం అడగనా?"

"చెప్పు."

"ఇంతవరకు నువ్వు ఒక్కసారి కూడా పుస్తకం తెరవడం నేను చూడలేదు."

"మరి టాపర్ ఎలా అయ్యావు?"

అన్నాడు.

గౌతమ్ సమాధానం చెప్పకముందే రామ్ నవ్వేశాడు.

"నువ్వే కాదు రా..."

"నేను కూడా నాలుగేళ్లుగా చూడలేదు."

అన్నాడు.

అమర్ తల గోక్కుంటూ,

"ఇది ఏదో కొత్త టెక్నిక్ అనుకుంటా..."

అని మనసులో అనుకున్నాడు.

కొద్దిసేపటి తర్వాత రామ్ మాట మార్చాడు.

"సరే..."

"నీ పేరు అమర్ కదా."

" నీ హోమ్‌టౌన్ ఏది?"

అని అడిగాడు.

అమర్ కాసేపు మౌనంగా ఉండి నెమ్మదిగా చెప్పాడు.

"కాశ్మీర్."

"కానీ... మా నాన్నగారి కుటుంబం మాత్రమే ఇక్కడ ఉంది."

"మిగతా బంధువులలో చాలామంది సరిహద్దు అవతల ఉంటారు."

"వాళ్లను నేను జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదు."

"ఒంటరిగా పెరిగాను."

"కొన్నిసార్లు వాళ్లందరినీ చూడాలని అనిపిస్తుంది."

"కానీ... పరిస్థితులు అంత సులభంగా ఉండవు."

అని నవ్వడానికి ప్రయత్నించాడు.

ఆ నవ్వులో మాత్రం చిన్న బాధ దాగి ఉంది.

గౌతమ్ నిశ్శబ్దంగా విన్నాడు.

తర్వాత ప్రశాంతంగా అడిగాడు.

"కనీసం వీడియో కాల్ అయినా

మాట్లాడలేదా?"

అమర్ తల ఊపాడు.

"లేదు అన్నా."

"పెద్దలు చెప్పిన కుటుంబ పరిస్థితుల వల్ల చాలా ఏళ్లుగా సంబంధాలు లేవట."

"నేను కూడా వాళ్ల గురించి విన్నదే తప్ప... చూసింది లేదు."

అన్నాడు.

గదిలో కొన్ని క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది.

ఆ వాతావరణాన్ని తేలిక చేయాలని రామ్ నవ్వుతూ గౌతమ్ చెవిలో మెల్లగా అన్నాడు.

"రేయ్... మన సీనియర్లు వీడెవడో తెలియకుండా ర్యాగింగ్ చేస్తే... ముందుగా వాళ్లకే బాంబ్ పెట్టేలా ఉన్నారు"

అన్నాడు.

గౌతమ్ నవ్వుతూ అతని భుజంపై ఒక చరుపు కొట్టి,

"ఓవర్ చేయకు రా."

"వాడు మనలాగే ఇండియన్."

"ముందు రేపటి ఎగ్జామ్ గురించి ఆలోచించు."

అన్నాడు.

అని చెప్పి బాల్ తీసుకుని మళ్లీ గది బయటకు నడిచాడు.

అతను వెళ్లిపోతుండగా...

అమర్ మాత్రం ఒక్కటే ఆలోచిస్తున్నాడు.

"ఈ గౌతమ్ అన్నయ్య... ఎంత అర్థం కాని మనిషో... అంతే మంచివాడిలా కూడా అనిపిస్తున్నాడు..."

ఆ పరిచయం...

ముందు ముందు వారి జీవితాలను ఎంతగా మార్చబోతుందో...

ఆ ముగ్గురిలో ఎవరికీ అప్పటికి తెలియదు.

OKA JEEVITHAM

By Writer_aj

Published: July 9, 2026 at 7:40 AM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...