SCREEN ON

Loading File

Chapter 6

Chapter 5
Chapter 6
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 5

OKA JEEVITHAM

Chapter 6
Chapter 5
Chapter 6

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 6

Jump Now

Directory

01

CHARISHMA AND FAMILY

02

The AMAR's concert

03

THE DARK SKY WITHOUT ITS MOON

04

The match fixing plan

05

AMAR's innocence, Arjun's mater plan

Active
06

Sambaihya's pride and ego

07

Ramam's disappointment

08

Charishma's awaited

09

Trip to kedarnath 🌟

10

The station meet up

11

THE PAST OF AMAR

12

Reena hates Gautham ?

13

Is amar pakistani?

Chapter // 05

AMAR's innocence, Arjun's mater plan

Writer_aj
Fantasy
1 Min Read
Pub: Jun 13, 2026
Upd: Jul 15, 2026

మధ్యాహ్నం సమయం...

అమర్ ఇంట్లో అసాధారణమైన నిశ్శబ్దం నెలకొంది.

కుమారి గారు వంటగదిలో ఉన్నారు.

అర్జున్ తన గదిలో ఏదో పనిలో బిజీగా ఉన్నాడు.

రామ్ కూడా ఎక్కడికో వెళ్లాడు.

అంత పెద్ద ఇంట్లో ఆ సమయంలో హాల్లో ఒక్కరే లేరు.

అప్పుడే... ల్యాండ్‌లైన్ ఫోన్ మోగడం ప్రారంభించింది.

ఒకసారి...

రెండుసార్లు...

మూడుసార్లు...

అయినా ఎవరూ ఫోన్ ఎత్తలేదు.

పై అంతస్తులో తన గదిలో ఉన్న అమర్‌కు ఆ శబ్దం వినిపించింది.

మొదట్లో పట్టించుకోలేదు.

కానీ ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉండటంతో చిరాకుగా కుర్చీ నుంచి లేచాడు.

"ఇంత పెద్ద ఇంట్లో ఫోన్ ఎత్తడానికి కూడా ఎవరూ లేరా..."

అని విసుక్కుంటూ కిందికి వచ్చాడు.

హాల్లోకి వచ్చి రిసీవర్ ఎత్తాడు.

"హలో."

అని చల్లగా అన్నాడు.

అవతల నుంచి వెంటనే వాచ్‌మన్ స్వరం వినిపించింది.

"సార్..."

"ఎవరో టీవీ వన్ జీరో జీరో ఫైవ్ ఛానెల్ నుంచి వచ్చారంట సార్."

"లోపలికి వస్తున్నారు."

అమర్ కనుబొమ్మలు ముడిచాడు.

"టీవీ 1005?"

అని ఆశ్చర్యంగా అన్నాడు.

"ఆ పేరుతో ఛానెల్ కూడా ఉందా?"

"అయితే వాడిని లోపలికి ఎందుకు రానిచ్చావు?"

అని కోపంగా అడిగాడు.

వాచ్‌మన్ భయపడిపోయాడు.

"సార్..."

"ఆయన దగ్గర అమ్మగారి ఇన్విటేషన్ కార్డు ఉంది."

"నేను ఆపితే అమ్మగారితో మాట పడలేను సార్."

అది విన్న అమర్ మరింత చిరాకుపడ్డాడు.

"అమ్మ రమ్మంటే మళ్లీ నాకు ఫోన్ చేసి చెప్పడం ఎందుకు?"

అని కోపంగా చెప్పి కాల్ కట్ చేశాడు.

అవతల...

వాచ్‌మన్ మాత్రం ఫోన్ వైపు చూస్తూ నిలబడ్డాడు.

"నేనేం తప్పు చేశానబ్బా?"

అన్నట్లు ముఖం పెట్టుకున్నాడు.

అంతలో...

ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చాడు రామం.

చూడటానికి నిజంగానే ఒక టీవీ రిపోర్టర్‌లా కనిపిస్తున్నాడు.

చేతిలో ఫైల్...

మెడలో ఐడీ కార్డు...

ముఖంలో మర్యాద.

కానీ...

అది అంతా నాటకం.

ఎందుకంటే రామం అసలు జర్నలిస్ట్ కాదు.

అతను ఒక చిన్న స్టార్ట్‌అప్ నడుపుతున్న యువకుడు.

వ్యాపారం కూడా బాగానే సాగుతోంది.

కానీ...తన చెల్లెలి కోరిక కోసం...

ఈరోజు ఇలా నటించక తప్పలేదు.

హాల్లోకి వచ్చిన రామంను చూసి అమర్ మర్యాదగా పలకరించాడు.

"రండి..."

"కూర్చోండి."

అని సోఫా చూపించాడు.

రామం కూర్చున్నాడు.

కానీ...

అతని చూపు మాత్రం అమర్ మీదే ఉంది.

టీవీలో ఎన్నోసార్లు చూసిన వ్యక్తి...

లక్షల మంది అభిమానించే స్టార్...

ఇప్పుడు తన ఎదురుగా కూర్చున్నాడు.

ఆ అనుభూతి వేరేలా ఉంది.

అమర్ చిరునవ్వు నవ్వాడు.

"మిస్టర్ రామం..."

"మీ స్టార్ట్‌అప్ గురించి నాకు తెలుసు."

ఆ మాట విన్న రామం ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

"మీడియా అని ఎందుకు చెప్పారు?"

"మీ స్టార్ట్‌అప్‌ను ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే..."

"ప్రొఫెషనల్‌గా కూడా రావచ్చు కదా."

అన్నాడు.

రామం మనసులో ఒక్కసారిగా వంద ప్రశ్నలు.

'అసలు నా గురించి ఇతనికి ఎలా తెలుసు?'

అని ఆశ్చర్యపోయాడు.

"సారీ సార్..."

"అది..."

అని తడబడుతూ మాట్లాడబోయాడు.

అమర్ గడియారం వైపు చూసి లేచాడు.

"ప్లీజ్..."

"డోంట్ వేస్ట్ మై టైమ్."

"టైమ్ విలువ మీకు తెలుసనుకుంటాను."

అని చెప్పి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు.

అప్పుడే...

రామం గట్టిగా అన్నాడు.

"సార్!"

అమర్ అడుగు ఆగిపోయింది.

"యాక్చువల్లీ..."

"మా సిస్టర్ మీకు చాలా పెద్ద ఫ్యాన్."

"తనకి మాటిచ్చాను."

"ఈ సాయంత్రం ఒక గుడ్ న్యూస్‌తో వస్తానని."

రామం గొంతు ఒక్కసారిగా భారంగా మారింది.

"ఎందుకంటే..."

"తనకి ఎక్కువ సమయం లేదు సార్."

ఆ మాట విన్న క్షణం...

అమర్ అడుగులు ఆగిపోయాయి.

నెమ్మదిగా వెనక్కి తిరిగాడు.

రామం కొనసాగించబోయాడు.

"తను కేవలం కొన్ని రోజులు..."

అని అనబోతుండగా...

పక్కనే నిలబడి ఉన్న అర్జున్ కళ్ళు పెద్దవిగా చేసి చేతితో సైగ చేశాడు.

"ఐదు నెలలు!" అని సైగ చేసాడు అర్జున్..

రామం వెంటనే మాట మార్చుకున్నాడు.

"ఐదు నెలల సమయం మాత్రమే ఉంది సార్."

అన్నాడు.

ఆ మాట విన్న అమర్ ముఖం మారిపోయింది.

కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయాడు.

తన జీవితంలో ఎన్నో విషాద కథలు విన్నాడు.

ఎన్నో బాధలు చూశాడు.

కానీ...

ఎవరైనా తమకు మిగిలింది ఐదు నెలల జీవితం మాత్రమే అని వినడం...

అది వేరే బాధ.

అమర్ నెమ్మదిగా అడిగాడు.

"ఇప్పుడు ఎలా ఉంది?"

ఆ ప్రశ్న చారిష్మ గురించి.

రామం వెంటనే అన్నాడు.

"బాగానే ఉంది సార్."

అని చెప్పగానే...

పక్కన ఉన్న అర్జున్ ముఖం మారిపోయింది.

సెంటర్ టేబుల్ మీద ఉన్న జాంగిరి తీసుకుని రామం వైపు విసిరాడు.

"అసలు బాగోలేదు అని చెప్పు!"

అన్నట్లు కళ్ళతో తిట్టాడు.

రామం చెమటలు పట్టిపోయాడు.

"అదే సార్..."

"బాగానే ఉంది..."

"కానీ..."

"లోలోపల ఎంత కుమిలిపోతుందో..."

"నా చిట్టి చెల్లెలు."

అని కళ్ళు తుడుచుకున్నట్టు నటించాడు.

"తనకి మీ ఆటోగ్రాఫ్ కావాలని ఉంది."

అమర్ కాసేపు ఆలోచించాడు.

తర్వాత చిరునవ్వుతో అన్నాడు.

"ఆటోగ్రాఫ్ కోసమా?"

"తనని చూడడానికి నేనే వస్తాను."

ఆ మాట విన్న వెంటనే...

రామం కళ్ళు పెద్దవయ్యాయి.

అర్జున్ ముఖం వెలిగిపోయింది.

కానీ...

ఈ దృశ్యం మొత్తం గమనిస్తున్న ఇంకొక వ్యక్తి ఉన్నాడు.

రామ్ అమర్ మేనేజర్ !

అతను వెంటనే పరిస్థితి అర్థం చేసుకున్నాడు.

రామం దగ్గరకు వెళ్లి అన్నాడు.

"సార్..."

"సర్‌కి ఈరోజు షెడ్యూల్ లేదు."

"రేపు తప్పకుండా మీ ఇంటికి వస్తారు."

"ఇప్పుడు కొత్త పాట కంపోజ్ చేయాలి."

అని తొందరగా రామంని బయటకు పంపేశాడు.

రామం వెళ్లిపోయాడు.

అమర్ మాత్రం ఆశ్చర్యంగా రామ్ వైపు చూశాడు.

"గౌతమ్..."

అన్నాడు రామ్.

"ఇలా రా."

"నీకు ఒక విషయం చెప్పాలి., అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా !"

అమర్ కనుబొమ్మలు ముడిచాడు.

"ఏమైంది?"

"పాపం..."

"అతన్ని ఎందుకు అలా పంపించేశావ్?"

అని అడిగాడు.

పక్కనే నిలబడి ఉన్న అర్జున్ మాత్రం రామ్‌కి భయంకరమైన సైగ చేశాడు.

"నిజం చెప్తే చచ్చావ్! నా చేతిలో..." అని అన్నాడు అర్జున్

రామ్ గుండెలో గుబులు మొదలైంది.

అమర్ దగ్గరకు వచ్చి భుజం పట్టుకున్నాడు.

"ఏ విషయం?"

"చెప్పు."

రామ్‌కు ఏం చెప్పాలో అర్థం కాలేదు.

చివరికి...

తన జీవితంలోనే అత్యంత చెత్త అబద్ధం చెప్పాడు.

"ఏమీ లేదు రా..."

"నువ్వు బిజీగా ఉన్నట్టు చేస్తేనే..."

"నీ విలువ పెరుగుతుంది."

అన్నాడు.

కొన్ని క్షణాలు నిశ్శబ్దం.

తర్వాత...

ధడాక్!

అమర్ చేయి నేరుగా రామ్ చెంప మీద పడింది.

"నన్ను పిచ్చోడిని అనుకున్నావా?"

అన్నట్లు కోపంగా చూసాడు.

తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు అమర్.

రామ్ తన చెంప పట్టుకుని నిలబడ్డాడు.

అప్పుడే...

అర్జున్ అతని దగ్గరకు వచ్చాడు.

"పాపం రా ఆ అమ్మాయి."

"ఒక్కసారి వెళ్లి చూడు."

"నాకే గనక ఒక కూతురు ఉంటే..."

"అలాంటి అమ్మాయే రావాలని కోరుకుంటాను."

అన్నాడు.

రామ్ ఆశ్చర్యపోయాడు.

"జబ్బు ఉన్న అమ్మాయి కోసం ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నారు?"

అని అడిగాడు.

అర్జున్ వెంటనే అతని రెండో చెంప మీద కూడా ఒకటి వేశాడు.

"ఆ అమ్మాయి ఎవరో కాదు."

"నా చిన్ననాటి స్నేహితుడి కూతురు."

అన్నాడు.

అలా చెప్పి అతను కూడా వెళ్లిపోయాడు.

హాల్లో ఇప్పుడు ఒక్కడే మిగిలాడు రామ్.

రెండు చెంపలు పట్టుకుని...

నెమ్మదిగా సోఫాలో కూర్చున్నాడు.

పెదవుల మీద చిన్న నవ్వు.

కానీ...

కళ్లలో మాత్రం బాధ.

"ఇక్కడ ఏం జరుగుతుందో..."

"అందరికీ తెలుసు...."

"ఒక్క మన అమర్ గాడికి తప్ప."

"అన్నీ తెలిసిన నేను..."

"వాడిని కాపాడలేకపోతున్నాను."

అని మనసులో అనుకున్నాడు.

ఎందుకంటే...

అందరూ చారిష్మ కోసం ఆలోచిస్తున్నారు.

అందరూ అమర్ భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్నారు.

కానీ...

అమర్ గుండెల్లో ఇంకా మానని ఒక గాయం ఉందని...

ఆ గాయం మళ్లీ తెరుచుకుంటే ఏమవుతుందో...

రామ్‌కి మాత్రమే తెలుసు.

ఆ రోజు...

ఒక చిన్న అబద్ధం చెప్పబడింది.

ఒక పెద్ద నిజం దాచబడింది.

మరి ఆ నిజం బయటపడిన రోజు...

ఎవరి జీవితాలు ఎలా మారబోతున్నాయో...

ఇంకా ఎవరికీ తెలియదు....

OKA JEEVITHAM

By Writer_aj

Published: June 30, 2026 at 6:26 AM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...