SCREEN ON

Loading File

Chapter 5

Chapter 4
Chapter 5
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 4

OKA JEEVITHAM

Chapter 5
Chapter 4
Chapter 5

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 5

Jump Now

Directory

01

CHARISHMA AND FAMILY

02

The AMAR's concert

03

THE DARK SKY WITHOUT ITS MOON

04

The match fixing plan

Active
05

AMAR's innocence, Arjun's mater plan

06

Sambaihya's pride and ego

07

Ramam's disappointment

08

Charishma's awaited

09

Trip to kedarnath 🌟

10

The station meet up

11

THE PAST OF AMAR

12

Reena hates Gautham ?

13

Is amar pakistani?

Chapter // 04

The match fixing plan

Writer_aj
Fantasy
1 Min Read
Pub: Jun 13, 2026
Upd: Jul 15, 2026

ఉదయం...

అమర్ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంది.

నిన్న రాత్రి జరిగిన సంఘటన తర్వాత కుమారి గారి మనసు ఇంకా పూర్తిగా తేరుకోలేదు.

తన కొడుకు గుండెల్లో ఎంత బాధ దాగి ఉందో ఆమెకు తెలుసు.

అందుకే ఉదయం నుంచే ఆమె మనసులో ఏదో తెలియని ఆందోళన.

అదే సమయంలో...

హాల్లో కూర్చున్న అర్జున్ ఫోన్‌లో ఎవరోతో మాట్లాడుతున్నాడు.

మొదట్లో సాధారణంగా మొదలైన సంభాషణ క్రమంగా ఆనందంగా మారింది.

"ఒరేయ్!"

అని పెద్దగా నవ్వాడు అర్జున్.

"ఇన్ని రోజులకు గుర్తొచ్చానా నేను?"

అవతల నుంచి ఏదో సమాధానం వచ్చింది.

"ఏమిట్రా... ముప్పై ఏళ్ల క్రితం చూసాను నిన్ను!"

"ఇప్పుడు గుర్తుకువచన?"

అని నవ్వుతూ అన్నాడు.

సోఫాలో కూర్చున్న కుమారి గారు చేతిలో పేపర్ పట్టుకుని ఉన్నారు.

కానీ ఆమె కళ్ళు పేపర్ మీద ఉన్నా...

చెవులు మాత్రం భర్త మాటల మీదే ఉన్నాయి.

ఎవరు?

ఏం మాట్లాడుతున్నారు?

ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాడు?

అని ఆలోచిస్తోంది.

కొద్దిసేపటి తర్వాత కాల్ ముగిసింది.

అర్జున్ ఫోన్ పెట్టి వెనక్కి తిరిగాడు.

అతని ముఖంలో పిల్లవాడి ఆనందం కనిపిస్తోంది.

ఏళ్ల తర్వాత ఏదో విలువైనది తిరిగి దొరికినట్టుగా కనిపించాడు.

అది గమనించిన కుమారి గారు అడిగారు.

"ఏంటి?"

"మీలో మీరే అంత మురిసిపోతున్నారు?"

"ఏమైంది?"

అర్జున్ నవ్వుతూ సోఫాలో కూర్చున్నాడు.

"అదేమంటే..."

"నా చిన్ననాటి స్నేహితుడు..."

అని చెప్పగానే కళ్ళల్లో జ్ఞాపకాలు మెరిశాయి.

"చాలా సంవత్సరాల తర్వాత వాడిని

మళ్లీ కలవబోతున్నాను."

అన్నాడు.

"అంతేనా?"

అని నిర్లక్ష్యంగా అడిగింది కుమారి.

ఆమెకు విషయం ఇంకా అంత ముఖ్యంగా అనిపించలేదు.

కానీ...

అర్జున్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది.

కొంచెం తడబడుతూ...

కొంచెం సంకోచిస్తూ...

ఇలా అన్నాడు.

"అదే కాదు..."

"వాడి కూతుర్ని..."

"మన అమర్‌కి ఇచ్చి పెళ్లి చేద్దామని..."

"మేమిద్దరం చాలా ఏళ్ల క్రితమే అనుకున్నాం."

కుమారి గారి చేతిలో ఉన్న పేపర్ఒ

క్కసారిగా క్రింద పడిపోయింది.

ఆమె ముఖంలో ఆశ్చర్యం...

తర్వాత కోపం.

"ఏమన్నారు?"

అని గట్టిగా అడిగింది.

"వాళ్లు సంబంధం మాట్లాడుకోవడానికి వస్తున్నారు."

అని చెప్పాడు అర్జున్.

"అంతేనా... ?"

అని కుమారి గారు ఒక్కసారిగా లేచారు.

"ఇన్ని సంవత్సరాలు నా కొడుకు ఎక్కడున్నాడో..."

"ఎలా ఉన్నాడో..."

"బతికున్నాడో లేదో కూడా అడగని వాళ్లు..."

"ఇప్పుడు ఒక్కసారిగా సంబంధం కోసం వస్తే..."

"మీరు మర్యాదలు చేస్తారేమో..."

"నేను చేయను!"

అంది కోపంగా.

అర్జున్ కూడా ఆ మాటలు విని కోపగించుకున్నాడు.

"అయితే ఏం చేయమంటావు?"

అని అడిగాడు.

"ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా ఒంటరిగా ఉండమంటావు వాడిని?"

"అవును!"

"వాడికి ఇప్పుడు సమాజంలో మంచి పేరు ఉంది."

"గౌరవం ఉంది."

"వేల మంది అభిమానులు ఉన్నారు."

"కానీ చివరికి వాడు కూడా మనిషే కదా!"

"మనిషి అన్నాక జీవితంలో ఆశలు ఉంటాయి."

"కోరికలు ఉంటాయి."

"ఒక తోడు కావాలి."

"ఒక కుటుంబం కావాలి."

"సంబంధం ఉండబట్టే వాళ్లు వస్తున్నారు."

"లేకపోతే ఎవరు వస్తారు?"

అని అన్నాడు.

ఆ మాటలకు కుమారి గారి కోపం కాస్త తగ్గింది.

కానీ బాధ మాత్రం అలాగే ఉంది.

"మీరు చెప్పింది నిజమే."

అంది నెమ్మదిగా.

"కానీ..."

"వాడు ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేదు."

"ప్రతి రాత్రి ఆమె గురించే ఆలోచిస్తున్నాడు."

"ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలతోనే బతుకుతున్నాడు."

"అలాంటి వాడిని నేను బలవంతంగా పెళ్లి చేసేయాలా?"

అని అడిగింది.

ఆ మాట విన్న అర్జున్ కూడా కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు.

ఎందుకంటే...

తన కొడుకు పరిస్థితి తనకూ తెలుసు.

అప్పుడే...

అతనికి ఒక ఆలోచన వచ్చింది.

"సరే..."

అన్నాడు.

"ముందు వాళ్ళ అన్నయ్య నీ ఒకసారి రమ్మందం" అని అన్నాడు

కుమారి గారు ఆశ్చర్యంగా చూశారు.

"వాళ్ళ అన్నయ్య ఎందుకు?" అని అడిగింది కుమారి ....

అర్జున్ మాత్రం ఏదో పెద్ద ఆలోచనలోనే ఉన్నాడు....

మరోవైపు...

అదే సమయంలో...

నగరానికి మరో మూలలో...

చారిష్మ తన గదిలో కూర్చుని టీవీ చూస్తోంది.

కానీ అది సాధారణ కార్యక్రమం కాదు.

అమర్ ఇంటర్వ్యూ.

ఆమె కళ్ళు టీవీ నుంచి ఒక్క క్షణం కూడా తొలగడం లేదు.

ప్రతి మాటను శ్రద్ధగా వింటోంది.

ఇంటర్వ్యూలో రిపోర్టర్ కొంచెం తెలివిగా ప్రశ్న అడిగాడు.

"సర్..."

"మీ కాన్సర్ట్‌ల ద్వారా వచ్చే ఆదాయంలో సగం చారిటీలకు ఇస్తారని విన్నాం."

"అది నిజంగా సేవ చేయడానికేనా?"

"లేకపోతే ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికా?"

స్టూడియోలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది.

ఆ ప్రశ్న విన్న అమర్ కాసేపు నవ్వాడు.

"ఒకవేళ నేను చారిటీలకు ఇవ్వకుండా ట్యాక్స్ కట్టుకుంటే..."

అన్నాడు.

"డబ్బులో డెబ్బై శాతం నా దగ్గరే ఉంటుంది."

"అదే చారిటీలకు డొనేట్ చేస్తే..."

"నాకు అరవై శాతం మాత్రమే మిగులుతుంది."

"ఇప్పుడు మీరే చెప్పండి."

"నిజంగా డబ్బు సేవ్ చేసుకోవాలనుకుంటే..."

"నేను ట్యాక్స్ కట్టడమే మంచిది కాదా?"

అని ప్రశాంతంగా అడిగాడు.

రిపోర్టర్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది.

ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు.

అమర్ మళ్లీ నవ్వాడు.

"అది నాకు ఆనందాన్ని ఇస్తుంది."

"నేను ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు."

"దాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?"

అని నేరుగా అడిగాడు.

టీవీ ముందు కూర్చున్న చారిష్మ మాత్రం...

ఒక్కసారిగా లేచి...

"వాహ్!"

అంటూ పెద్దగా విజిల్ వేసింది.

"అదిరిపోయింది అమర్!"

అని ఉత్సాహంగా అరిచింది.

అప్పుడే...

బయట నుంచి ఆమె అన్నయ్య లోపలికి వచ్చాడు.

"చారిష్మ!"

అని పిలిచాడు.

"ఈ సాయంత్రం..."

"నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను."

"రెడీగా ఉండు."

అన్నాడు రహస్యంగా నవ్వుతూ.

"ఏంటి?"

అని అడిగేలోపే...

అతను వెళ్లిపోయాడు.

చారిష్మకి ఏమీ అర్థం కాలేదు.

"వీడు మళ్లీ ఏం ప్లాన్ చేస్తున్నాడో!"

అని అనుకుంటూ...

మళ్లీ టీవీ వైపు తిరిగింది.

అమర్ ఇంటర్వ్యూలో ఇంకేం మాట్లాడుతున్నాడో మిస్ అవుతానేమోనని తొందరగా తన గదిలోకి వెళ్లిపోయింది.

ఆమె గది తలుపు గట్టిగా మూసుకున్న శబ్దం వినిపించింది.

అది విన్న ఆమె తల్లి వంటగది నుంచి బయటికి వచ్చింది.

"ఇది ఇంట్లో ఉంటుందా..."

"జైలులో ఉంటుందా..."

అర్థం కావడం లేదు."

"రోజుకి రెండు సార్లు తప్ప ఇంకెప్పుడూ కనిపించదు."

"ఈ బద్ధకం..."

"ఎవడు వస్తాడో గాని..."

"పెళ్లి చేసుకుని తీసుకెళ్తేనే మా కష్టాలు తీరతాయి."

అని నవ్వుకుంటూ అంది.

అప్పుడే...

పక్కన నిలబడి ఉన్న ఆమె భర్త చిరునవ్వుతో ఒక ఫోటో చూపించాడు.

"ఎవడో కాదు..."

"ఇదిగో..."

"ఇతనే మన అల్లుడు."

అన్నాడు.

ఆవిడ ఆశ్చర్యంగా ఫోటో తీసుకుంది..

ఫోటోలో...

స్టేజ్ మీద గిటార్ పట్టుకుని...

చిరిగిపోయిన జీన్స్...

అల్లకల్లోలమైన జుట్టు...

రాక్‌స్టార్ లుక్‌లో ఉన్న అమర్ కనిపించాడు.

కొన్ని క్షణాలు ఫోటోను చూసిన ఆమె...

అమాయకంగా ముఖం పెట్టి అడిగింది.

"ఏంటి ఇది?"

"ఇలా చిరిగిపోయిన ప్యాంట్ వేసుకున్నాడు ఎందుకు?"

"ఆ జుట్టు దువ్వుకోవడం మర్చిపోయాడా?"

"అంత డబ్బున్నట్టున్నారు కదా!"

"కొత్త ప్యాంట్ కొనిపెట్టలేదా వాళ్లు?"

అంది పూర్తి సీరియస్‌గా.

ఆ మాట విన్న ఆమె భర్త నోరు తెరిచి ఆమె వైపు చూసాడు.

ఏం చెప్పాలో అర్థం కాలేదు.

"అది ఫ్యాషన్..."

అని చెప్పాలనుకున్నాడు.

కానీ...

అది వివరించడానికి కనీసం అరగంట పడుతుందని గుర్తొచ్చింది.

అందుకే...

నిశ్శబ్దంగా సోఫాలో కూర్చున్నాడు.

అయితే...

వాళ్లిద్దరికీ తెలియని విషయం ఒక్కటే.

విధి అప్పటికే తన ఆట మొదలుపెట్టింది.

ఒకవైపు...

గతాన్ని మర్చిపోలేని అమర్.

మరోవైపు...

టీవీ స్క్రీన్‌లోనే అతన్ని ప్రేమించడం మొదలుపెట్టిన చారిష్మ.

ఇద్దరి జీవితాలు...

త్వరలోనే ఒకే దారిలో కలవబోతున్నాయా??

OKA JEEVITHAM

By Writer_aj

Published: June 29, 2026 at 11:26 AM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...