Loading File
Initializing...
Chapter 4
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
వాళ్ల మేనమామ ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ల మామగారి బదులు వాళ్ల మేనత్త సుబ్బలక్ష్మి ఉంది.
> "అత్త... మామయ్య లేరా?"
అని అడిగాడు శ్యామ్.
వాళ్ల అత్త చిరాకుతో:
> "లేరు... రేపు రండి."
అని కోపంగా లోపలికి వెళ్లిపోయింది.
సరేలే, చేసేదేం లేదు అని ఇద్దరూ మళ్లీ వెనక్కి బయల్దేరారు.
అయితే ప్రేమ్ ఇలా అన్నాడు:
> "రే... రేపు మళ్లీ వద్దామా? నాకు ఎందుకో మీ మామయ్య ఇంట్లోనే ఉండి, మీ అత్తని పంపాడు ఏమో అనిపిస్తుంది."
అని అంటాడు.
అప్పుడు శ్యామ్:
> "అలాంటిదేం లేదు రా... మామయ్య మంచోడే."
అని అంటాడు.
ఆ మాట ముగిసేలోపు శ్యామ్ హృదయంలో ఏదో తెలియని అలజడి. ఎందుకో తెలియకుండా చాలా సంతోషంగా ఉన్న భావన కలుగుతుంది.
సడెన్‌గా బస్ ఆగింది.
శ్యామ్ పైకి లేచి ఎవరికోసమో చూస్తున్నాడు. ప్రేమ్, శ్యామ్ బాడీ లాంగ్వేజ్ మారడం గమనించాడు.
శ్యామ్ ఎందుకు చూస్తున్నాడో తెలియకుండానే బస్ డోర్ వైపు చూస్తున్నాడు, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు.
> "ఏంటి ఈడు ఎవరి కోసం చూస్తున్నాడు?"
అని ప్రేమ్ మనసులో అనుకున్నాడు.
ముందుకి చూస్తే అక్కడ హఠాత్తుగా ఒక పెద్ద వెలుగు...
ఆ వెలుగులో పున్నమి చందమామలా ప్రత్యక్షమైంది మన రుక్మిణి.
అంతే...
శ్యామ్ తెలియకుండానే ప్రేమలో పడిపోయాడు. రుక్మిణీ కూడా శ్యామ్ నీ గమనించింది, ఇద్దరి మధ్య ఒక్క క్షణం eye contact కుదిరింది కానీ తను చాలా causal గా కూర్చుంది వాళ్ళ నాన్నమ్మ గారి తో
ఊహాలోకంలోకి జారుకున్నాడు శ్యామ్.
ఉదయం ఎంతో మంది మధ్య చూసిన అమ్మాయి, సాయంత్రం మళ్లీ కనిపించడం ఏం చిన్న విషయం కాదు. అది కచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది.
శ్యామ్ ప్రేమలో ఉండగా మన ప్రేమానంద్‌కి మాత్రం ఉదయం చూసిన ఆ ముసలావిడే (అదే రుక్మిణి వాళ్ల బామ్మగారు) కనిపించారు.
> "చి చి... ఈ దారుణాన్ని చూడడానికే వచ్చానా నేను? అయినా ముసలావిడకి లైన్ వేయడం ఏంట్రా బాబు... ఛీ ఛీ..."
అని అపార్థం చేసుకుంటాడు.
కానీ శ్యామ్ మాత్రం రుక్మిణి చెవికి ఉన్న జుంకాలు చూస్తూ ఉండిపోయాడు.
తన చెవికి ఉన్న ఆ జుంకాలు శ్యామ్‌కి ఎంతగానో నచ్చాయి. అవి తనకి ఎంతో అందాన్ని ఇచ్చాయి.
అలా మెల్ల మెల్లగా పూర్తిగా తనలో నిమగ్నం అయిపోయాడు శ్యామ్.
కానీ మధురమైన క్షణాలు ఎప్పుడూ ఎక్కువ సేపు ఉండవు అని అంటారు కదా...
అలానే జారుకుంది రుక్మిణి ఆ బస్ నుండి.
వాళ్ల స్టాప్ వచ్చి వాళ్లు దిగిపోయారు.
శ్యామ్ కిటికీ నుండి తొంగి చూస్తున్నాడు. వాళ్లు ఎటు వెళ్తారో అని.
అలా వాళ్లని గమనిస్తే వాళ్ల ఇల్లు ఎక్కడో తెలుసుకోవచ్చు అని.
> "రే... వాళ్ల ఇల్లు తెలుసుకోవాలి రా ఎలా అయినా!"
అని అంటాడు.
అప్పుడు ప్రేమ్:
> "రే శ్యాము... నువ్వు ఏం చేస్తున్నావో నీకు ఏమైనా అర్థం అవుతుందా? అది తప్పు కాదురా పాపం. నా మాట విను... నీ వయసుకి తగ్గ అమ్మాయిని చూసి ప్రేమించు. ఆవిడ వయసులో పెద్దది. మనకి అమ్మమ్మ లాంటిది."
అని అంటాడు.
ఆ మాట విన్న శ్యామ్, లాగిపెట్టి చంప మీద ఒకటి కొడతాడు ప్రేమ్‌ని.
> "నేను చెప్పేది ఆ పక్కన ఉన్న అమ్మాయి గురించి!"
అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు.
అప్పుడు ప్రేమ్:
> "ఇది ముందే చెప్పాలి కదా... అనవసరంగా దెబ్బలు తిన్నాను."
అని ఏడుపు మొహంతో అంటాడు.
MOUNA KAVYAM
By Ajay.
Published: May 13, 2026 at 8:05 AM
బస్సులో రుక్మిణి ఎవరితో కలిసి కూర్చుంది?
Your input calibrates the database for others.
Ready to play...