Double-tap to translate this word.
Hides UI for distraction-free reading
ఆ రోజు రాత్రి రుక్మిణి తన గదిలో శ్యామ్ రాసిన పుస్తకం చదువుతుంది.
పుస్తకం మొత్తం చదివాక:
> "ఏంటి... కథల పుస్తకానికి ఇంత హడావుడి చేశాడు...
ఈ మాత్రం కథలు బయట చాలా ఉంటాయి...
సరేలే... ఏదో ఒకటి రాసేద్దాం. పాపం అతనికి ఉపయోగపడుతుంది, అంత కదా..."
అని రాయడం మొదలు పెట్టింది.
కానీ ఎంత ఆలోచించినా రాయడం తన వల్ల కావట్లేదు.
అలా అర్థరాత్రి అయ్యింది.
> "నేను మూడు పేజీల ముందుమాట రాయలేకపోతుంటే, అతను 300 పేజీల కథ ఎలా రాశాడో ఏంటో...
బాబోయ్... నా వల్ల కాదు ఇంకా..."
అని ఆ పుస్తకానికి ముందుమాట రాయడం మొదలు పెట్టకుండానే పడుకుండిపోయింది మన రుక్మిణి.
---
మరోపక్క శ్యామ్:
> "రేపు తను ముందుమాట రాసి ఇస్తే నేను తనకి ఎలా thanks చెప్పాలి?
బాగా ఆలోచించాలి...
తింగరి తింగరిగా చెప్పకూడదు..."
అని శ్యామ్ అతనిలో అతనే ఏదో ఏదో ఊహించేసుకుంటున్నాడు.
కానీ పాపం మన శ్యామ్‌కి తెలియని విషయం ఏంటంటే, మన రుక్మిణి అప్పటికే మంచి నిద్రలోకి జారుకుంది.
పాపం ఆ విషయం తెలియక మన శ్యామ్ రాత్రంతా తనతో రేపు ఎలా మాట్లాడాలి అని ఏదో పరీక్షకి prepare అవుతున్నట్టు prepare అవుతున్నాడు.
---
ఉదయం అయ్యింది.
మన శ్యామ్ రుక్మిణిని కలవడానికి బయలుదేరాడు.
అప్పుడే శ్యామ్‌కి ఎదురైంది మీనాక్షి.
> "బావ... ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి..."
అని అడిగింది.
కానీ శ్యామ్ కనీసం తన మొఖం చూడకుండా పక్కకి చూస్తూ:
> "మీనాక్షి... ఏంటి ఇలా వచ్చావ్?"
అని అడిగాడు.
---
అప్పుడు మీనాక్షి (మీనాక్షి వాళ్ల మేనమామ గారి పెద్ద కూతురు):
> "బావ... నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు.
నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు బావ..."
అని చెప్పింది.
అప్పుడు శ్యామ్:
> "చూడు మీనాక్షి...
మీ నాన్నగారు తీసుకున్న నిర్ణయం అయితే, అతను కచ్చితంగా మంచివాడే అయి ఉంటాడు..."
అని అంటాడు.
ఒకపక్క రుక్మిణిని కలవడానికి వెళ్లాలి అనే కంగారు అతని కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది.
---
కానీ హఠాత్తుగా మీనాక్షి శ్యామ్ చేయి పట్టుకుని:
> "బావ... నువ్వు అంటే నాకు చాలా ఇష్టం.
నాకు ఇంకెవరు వద్దు.
నేను నిన్నే ప్రేమిస్తున్నాను...
మా ఇంట్లో ఎవరూ ఏం అనుకున్నా నాకు అనవసరం..."
అని ఏడుపు మొదలు పెట్టింది.
---
అప్పుడు శ్యామ్ తన చేయి విడిపించుకుని:
> "చూడు మీనాక్షి...
మీ వాళ్లకి గానీ, మన మొత్తం కుటుంబానికి గానీ నేను అంటే అసలు ఇష్టం లేదు...
నువ్వు ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు.
నువ్వు ఏదో మైకంలో ఉన్నావ్...
తర్వాత అంతా సర్దుకుంటుంది."
అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు.
---
కానీ వాళ్ల ఇద్దరికీ తెలియకుండా వెనకనుండి ఎవరో మీనాక్షి మరియు శ్యామ్‌లని చూశారు.
అతను ఎవరో కాదు...
శ్యామ్ వాళ్ల మేనమామే!
అదే మీనాక్షి వాళ్ల నాన్న!
---
ఇప్పుడు ఏం అవ్వబోతుందో ఏంటో...
ఇంకా శ్యామ్ రైటర్ అవ్వాలి అనే కల నెరవేరుతుందా? లేదా?
అసలు రుక్మిణి తప్ప ఇంకెవరికి మన శ్యామ్ మనసులో చోటు లేదు అని మనకి అర్థం అయ్యింది.
కానీ.....
MOUNA KAVYAM
By Ajay.
Published: May 16, 2026 at 8:18 AM
తాను 3 పేజీలు రాయలేకపోతుంటే, శ్యామ్ ఎన్ని పేజీల కథ రాశాడని రుక్మిణి ఆశ్చర్యపోయింది?
Your input calibrates the database for others.
Ready to play...