SCREEN ON

Loading File

Chapter 28

Chapter 27
Chapter 28
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 27

MOUNA KAVYAM

Chapter 28
Chapter 27
Chapter 28

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 28

Jump Now

Directory

01

Episode 1

02

Episode 2

03

Episode 3

04

Episode 4

05

Episode 5

06

Episode 6

07

Episode 7

08

Episode 8

09

Episode 9

10

Episode 10

11

Episode 11

12

Episode 12

13

Episode 13

14

Episode 14

15

Episode 15

16

Episode 16

17

Episode 17

18

Episode 18

19

Episode 19

20

Episode 20

21

Episode 21

22

Episode 22

23

Episode 23

24

Episode 24

25

Episode 25

26

Episode 26

27

Episode 27

Active
28

Episode 28

29

Episode 29

30

Episode 30

31

Episode 31

32

Episode 32

Chapter // 27

Episode 27

అప్పుడే విశ్వనాథ్ గారు శ్యామ్ దగ్గరకి వచ్చి :-

"బాబు, నీ పుస్తకం ప్రింటింగ్ ప్రెస్‌కి ఇవ్వడం జరిగింది. నీకు అవార్డు ఇవ్వడానికి సరిగ్గా ముందు రోజే ఆ పుస్తకం పబ్లిష్ అవ్వబోతోంది," అని శ్యామ్ భుజం మీద చేయి వేసి, శ్యామ్ లక్ష్యం నెరవేరుతుంది అని గర్వంగా చెప్పాడు విశ్వనాథ్.

కానీ శ్యామ్ మొహంలో ఎలాంటి ఆనందం కానీ గర్వం కానీ కనిపించలేదు.

శ్యామ్ :-

"గురువుగారు, నేను కాసేపు రుక్మిణీతో అలా బయటకి వెళ్లాలి!" అని అడిగాడు.

అప్పుడు విశ్వనాథ్ గారు :-

"సరే, కూడా ప్రేమ్‌ని కూడా తీసుకువెళ్లి జాగ్రత్తగా వెళ్లి రండి," అని అన్నాడు.

అప్పుడు శ్యామ్ :-

"రుక్మిణీ గారు, పదండి అలా బయటకి వెళ్లి వద్దాం," అని అన్నాడు.

అప్పుడు భయంతో రుక్మిణీ వద్దు అని అంది. అసలే శ్యామ్‌ని చంపాలి అని చూస్తున్నారు కదా! కానీ శ్యామ్ ధైర్యం చెప్పి రుక్మిణీని బలవంతంగా జాతరకు తీసుకువెళ్లాడు ఆ సాయంత్రం.

సాయంత్రం అవుతుంది…

ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతుంది. ఊరి బయట పెద్ద జాతర మొదలైంది. చుట్టూ రంగురంగుల దీపాలు, పిల్లల నవ్వులు, బొమ్మల అరుపులు, తాతయ్యల హరికథలు… ఆ సందడి అంతా చూస్తుంటే పల్లెటూరు మొత్తం ఒక పండుగలా మారిపోయింది.

కానీ ఆ జన సందోహం మధ్య మన రుక్మిణీ మాత్రం నిశ్శబ్దంగా నడుస్తుంది.

ఆమె మొహంలో నవ్వు లేదు.

కళ్లల్లో ఏదో బాధ.

శ్యామ్ అది గమనిస్తున్నాడు.

రుక్మిణీ మనసులో ఎంత భయం ఉందో, ఎంత గందరగోళం ఉందో అతనికి అర్థమవుతుంది.

శ్యామ్ :-

"ఏంటి రుక్మిణీ గారు… జాతరకి వచ్చి కూడా ఇలా నిరసంగా మొకం పెట్టుకుంటే ఎలా?" అని అడిగాడు.

రుక్మిణీ :-

"నేను రాలేదు… నువ్వే బలవంతంగా తీసుకొచ్చావ్…" అని అంది.

శ్యామ్ నవ్వి :-

"సరే… ఒక అరగంట. ఆ తర్వాత కూడా నీ మొకంలో నవ్వు రాకపోతే… నేనే ఓడిపోయినట్టు."

రుక్మిణీ ఏమి మాట్లాడలేదు.

అప్పుడే పక్కనుండి ఒక చిన్న పిల్లాడు బెలూన్లు అమ్ముకుంటూ వెళ్లాడు.

శ్యామ్ వెంటనే ఒక పెద్ద గులాబీ రంగు బెలూన్ కొనుకుని రుక్మిణీ చేతిలో పెట్టాడు.

రుక్మిణీ :-

"నేను చిన్నపిల్లనా?"

శ్యామ్ :-

"అవును. కోపం వస్తే ఇంకా చిన్నపిల్లలా కనిపిస్తావ్."

రుక్మిణీ నవ్వు ఆపుకునే ప్రయత్నం చేసింది… కానీ చిన్నగా నవ్వేసింది.

అది చూసిన శ్యామ్ మనసులో హాయిగా అనిపించింది.

కొద్దిసేపటి తర్వాత వాళ్లు గాజుల దుకాణం దగ్గర ఆగారు.

అక్కడ రంగురంగుల గాజులు వెలుగుల్లో మెరిసిపోతున్నాయి.

శ్యామ్ ఒక ఆకుపచ్చ గాజుల సెట్ తీసి :-

"ఇవి బాగున్నాయి…" అని అన్నాడు.

రుక్మిణీ ఆశ్చర్యంగా :-

"నీకు గాజుల గురించి కూడా తెలుసా?"

శ్యామ్ :-

"నాకు ఏమీ తెలీదు… కానీ ఇవి నీ చేతికి బాగుంటాయి అని మాత్రం తెలుసు."

ఆ మాటకి రుక్మిణీ సిగ్గుతో తల దించుకుంది.

అప్పుడే అక్కడ giant wheel తిరుగుతుంది.

పిల్లలు అరుస్తూ ఆనందపడుతున్నారు.

శ్యామ్ ఒక్కసారిగా :-

"రండి రుక్మిణీ గారు!" అని ఆమె చేయి పట్టుకుని పరుగెత్తాడు.

రుక్మిణీ :-

"శ్యామ్! వద్దు… నాకు భయం!" అని అంది.

కానీ శ్యామ్ వినలేదు.

ఇద్దరూ giant wheel లో కూర్చున్నారు.

మెల్లగా అది పైకి ఎగిరింది…

జాతర మొత్తం పై నుండి చిన్న చిన్న దీపాల్లా కనిపిస్తుంది.

చల్లని గాలి వాళ్ల మొహాలను తాకింది.

రుక్మిణీ భయంతో కళ్లూ మూసుకుంది.

అప్పుడే శ్యామ్ నెమ్మదిగా :-

"కళ్లూ తెరువు రుక్మిణీ…" అన్నాడు.

ఆమె మెల్లగా కళ్లూ తెరిచింది.

పై నుండి కనిపిస్తున్న ఆ వెలుగులు… ఆకాశం… జాతర… అన్నీ చూసి చిన్నపిల్లలా ఆశ్చర్యపోయింది.

ఎంతో రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వింది రుక్మిణీ.

ఆ నవ్వు చూసిన శ్యామ్ కాసేపు మౌనంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు.

రుక్మిణీ :-

"ఏంటి అలా చూస్తున్నావ్?"

శ్యామ్ చిన్నగా నవ్వి :-

"ఇలానే ఉండాలి నువ్వు… ఈ బాధలు, భయాలు నీకు అస్సలు బాగోలేవు."

ఆ మాట విన్న రుక్మిణీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

కానీ ఈసారి అవి బాధ కన్నీళ్లు కాదు…

తనని అర్థం చేసుకున్న మనిషి దొరికాడనే ఆనందం.

ఆ తిరణాల్లో మన రుక్మిణీ మళ్లీ చిన్నపిల్లగా మారిపోయి అక్కడ జరిగింది అంతా మర్చిపోయి శ్యామ్‌తో ఆహ్లాదకరంగా గడిపింది.

రుక్మిణీ చేతులు ఇంకా భయంతో ఆ ఇనుప రాడ్‌ని గట్టిగా పట్టుకున్నాయి.

కానీ కాసేపటి తర్వాత… ఆమెకి ఆ భయం కూడా నచ్చడం మొదలైంది.

ఎందుకో…

ఆ గాలి…

ఆ ఎత్తు…

ఆ స్వేచ్ఛ…

ఆమె ఎప్పుడూ అనుభవించనిది.

ఎందుకంటే మన రుక్మిణీ జీవితం అంతా ఇంటి గోడల మధ్యే గడిచింది.

చిన్నప్పటి నుండి :-

"అలా చేయొద్దు"

"ఇలా నవ్వొద్దు"

"బయటికి ఎక్కువ వెళ్లొద్దు"

"పాపం పరువు"

అనే మాటల మధ్య పెరిగింది.

పండుగలు కూడా వాళ్ల ఇంటి మేడ మీద నుండే చూసింది గానీ… ఇలా జనాల్లో కలిసిపోయి నవ్వడం… చిన్నపిల్లలా అల్లరి చేయడం… ఎప్పుడూ జరగలేదు.

కానీ ఇప్పుడు…

ఆ giant wheel మీద కూర్చుని…

చల్లని గాలి ముఖాన్ని తాకుతుంటే…

రుక్మిణీకి ఎందుకో తాను ఒక పంజరంలో ఉన్న పక్షిలా అనిపించింది. ఇప్పుడు ఆ పంజరం తలుపు కొంచెం తెరుచుకున్నట్టు అనిపించింది.

కింద జనాలు చాలా చిన్నగా కనిపిస్తున్నారు.

అక్కడ ఎవరూ:

హరిచంద్ర గారు కాదు

పరువు కాదు

పెళ్లి చూపులు కాదు

కేవలం తాను…

మరియు శ్యామ్ మాత్రమే.

రుక్మిణీ మెల్లగా కళ్లూ మూసుకుని గాలిని ఆస్వాదించింది.

ఆమె జుట్టు గాలికి ఎగురుతుంది. కళ్లద్దాలు తీసేసింది మన రుక్మిణీ. అదే తన అసలైన రూపం అన్నట్టు.

అప్పుడే శ్యామ్ ఆమెని చూసి చిన్నగా నవ్వుకున్నాడు.

శ్యామ్ :-

"ఏంటి రుక్మిణీ గారు… ఇప్పుడైనా భయం తగ్గిందా?"

రుక్మిణీ మెల్లగా అతని వైపు చూసి :-

"తెలియదు… కానీ… ఎందుకో చాలా హాయిగా ఉంది…" అని అంది.

శ్యామ్ చేయి పట్టింది. అతని భుజం మీద తల వాల్చింది.

ఆమె మాటల్లో ఒక కొత్త ప్రశాంతత ఉంది.

శ్యామ్ :-

"అది స్వేచ్ఛ."

రుక్మిణీ ఆశ్చర్యంగా చూసింది.

శ్యామ్ :-

"మనసుకి నచ్చినట్టు ఒక్కసారి బ్రతికితే… అదే అనుభూతి వస్తుంది."

ఆ మాట విన్న రుక్మిణీ కాసేపు మౌనంగా ఉండిపోయింది.

ఎందుకో ఆ మాటలు నేరుగా గుండెల్లోకి వెళ్లాయి.

giant wheel కిందకి వచ్చింది.

కానీ రుక్మిణీకి దిగాలి అనిపించలేదు.

కానీ దిగాక తప్పలేదు.

ఇంటికి తిరిగి వెళ్తుండగా —

రుక్మిణీ :-

"శ్యామ్ గారు! మీకోసం రేపు ఏం చేయమంటారు?" అని అడిగింది.

అప్పుడు శ్యామ్ :-

"నువ్వు నీ చేత్తో ఏం చేసినా తింటా! కానీ బాగా వండలేకపోతే అందరి ముందు నీ పరువే పోతుంది," అని హాస్యం చేశాడు.

కానీ రుక్మిణీ ఈసారి నవ్వింది.

శ్యామ్‌కి కూడా కావాల్సింది అదే కదా!

ఇద్దరూ సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లిపోయారు…

ఒకరి చేతిలో ఒకరు చేయి పట్టుకుని… అలా మౌనంగా నడుచుకుంటూ…

Chapter Illustration
✧ ✧ ✧

MOUNA KAVYAM

By Ajay.

Published: May 25, 2026 at 1:33 PM

© 2026 Ajay.. All rights reserved. Do not copy, distribute, or steal.

Memory Verification

శ్యామ్ రుక్మిణీని బయటకు తీసుకెళతానన్నప్పుడు విశ్వనాథ్ గారు ఎవరిని కూడా తోడు తీసుకువెళ్ళమన్నారు?

Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...