SCREEN ON

Loading File

Chapter 17

Chapter 16
Chapter 17
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 16

MOUNA KAVYAM

Chapter 17
Chapter 16
Chapter 17

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 17

Jump Now

Directory

01

Episode 1

02

Episode 2

03

Episode 3

04

Episode 4

05

Episode 5

06

Episode 6

07

Episode 7

08

Episode 8

09

Episode 9

10

Episode 10

11

Episode 11

12

Episode 12

13

Episode 13

14

Episode 14

15

Episode 15

16

Episode 16

Active
17

Episode 17

18

Episode 18

19

Episode 19

20

Episode 20

21

Episode 21

22

Episode 22

23

Episode 23

24

Episode 24

25

Episode 25

26

Episode 26

27

Episode 27

28

Episode 28

29

Episode 29

30

Episode 30

31

Episode 31

32

Episode 32

Chapter // 16

Episode 16

మరోవైపు మన శ్యామ్ ప్రయాణం మొదలు పెట్టాడు. ఒక్కడే… ఎటు వెళ్తాడో తెలియదు. ఒక నిర్దిష్ట గమ్యం గానీ, గమనం గానీ లేదు. అలా వెళ్తూనే ఉన్నాడు… కొత్త ప్రదేశాలకు. ఇప్పుడు మన శ్యామ్‌కి ఏం కావాలో కాదు, అసలు శ్యామ్ ఎవరో తెలియాలి. ఇప్పుడు శ్యామ్ అస్తిత్వం మీద ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. శ్యామ్ వాటికి సమాధానాలు వెతకడానికి వెళ్తున్నాడు.

ఎవరికీ తెలియని ఒక పల్లెటూరులో ప్రస్తుతం ఆగింది అతని ప్రయాణం. చీకటి అయ్యింది. పక్కనే ఉన్న గుడి వద్ద ఆగి, అతని సంచిలో నుండి దుప్పటి తీసి ఆ గుడిలో ఆ రాత్రి పడుకున్నాడు. ఉదయం అయ్యేసరికి మళ్లీ శ్యామ్ ప్రయాణం మొదలైంది.

అలా ప్రతి రోజు ఏదో ఒక ఊరు వెళ్లడం, అక్కడ ఉన్న జనం మరియు కట్టుబాట్లు అన్నీ తెలుసుకోవడం, అందరితో కలిసి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త కొత్త పరిచయాలు… అలా వెళ్తూ వెళ్తూ అతను చూసిన సంఘటనలు చాలా ఉన్నాయి. అందులో అతను మొదట వెళ్లిన ఒక పల్లెటూరులో జరిగిన సంఘటన చెప్తా:-

శ్యామ్‌కి చాలా అలసటగా ఉంది. చాలా దూరం నడిచి అలసిపోయాడు. దూరంగా ఎక్కువగా కూడిన జనం కనిపించారు. ఆకలితో ఉన్న శ్యామ్‌కి అది ఏదో పెళ్లి అని అర్థమైంది. అక్కడికి వెళ్తే ఏమైనా తినొచ్చు అని వెళ్లాడు.

అక్కడ ఉన్న ఇద్దరు చిన్న పిల్లలు — “లక్ష్మికి ఆరు సంవత్సరాలు, నాకు ఆరు సంవత్సరాలే… మరి నాకెందుకు పెళ్లి చేయట్లేదు?” అని అమాయకంగా అడిగింది ఒక పాప తన స్నేహితురాలిని.

వాళ్ల వయసుకి తెలియకపోయినా ఆ మాటలు విన్న మన శ్యామ్ ఒక్కసారిగా జనాన్ని దాటి పీటల మీద కూర్చున్న ఆ చిన్న పాపను చూసాడు. ఆ పాపకి అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఒక ఆరు ఏళ్ల పాపకి ఒక 33 ఏళ్ల వ్యక్తితో వివాహం చేస్తున్నారు. అది కూడా ఆ వ్యక్తికి అది రెండో పెళ్లి.

అది చూసిన శ్యామ్‌కి కోపం వచ్చేసింది. నేరుగా వాళ్ల దగ్గరకి వెళ్లి — “లేవరా! పైకి లే…” అని గట్టిగా అరిచాడు.

ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్లకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ పెళ్లికొడుకు కాలర్ పట్టుకుని — “ఏరా… నీ వయసు ఏంటి? ఆ పాప వయసు ఏంటి? చేతకానికొడకా?” అని పక్కకి విసిరేశాడు.

అప్పుడు ఆ పెళ్లికొడుకు వాళ్ల అమ్మ మధ్యలోకి వచ్చి — “ఎవడ్రా నువ్వు? అది చిన్న పిల్ల అయినా సరే ఆడపిల్ల ఎప్పటికైనా అత్తారింటికి వెళ్లాల్సిందే. చిన్న వయసు అయితే ఏంటి?” అని ప్రశ్నించింది.

అప్పుడు శ్యామ్ కోపంగా పక్కనే ఉన్న కత్తి తీసి ఆమె పీక మీద పెట్టి ఇలా అన్నాడు:- “అయితే నువ్వు ఎప్పటికైనా చావాల్సినదానివే కదా… చచ్చిపో! అప్పుడు చస్తే ఏంటి? ఇప్పుడు చస్తే ఏంటి?” అని అన్నాడు.

ఆమె భయంతో కేకలు వేసింది. వెంటనే వాళ్ల బంధువులు అందరూ శ్యామ్‌ని చుట్టుముట్టారు. శ్యామ్‌ని వాళ్లు బాగా కొట్టారు. కానీ అదే సమయానికి అక్కడికి ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (వయసులో పెద్ద అతనే) వచ్చి ఆ గొడవని నివారించాడు. గొడవ ఆగింది. పెళ్లి కూడా ఆగిపోయింది.

ఆ పెళ్లి ఆగింది శ్యామ్ వల్లే అని ఆ పాప (పెళ్లికూతురు) వాళ్ల నాన్న శ్యామ్‌ని తిట్టడం ఆపడం లేదు. ఎందుకంటే ఆ తండ్రి ఏదోలా ఆడపిల్లని వదిలించుకోవాలి అని చూసాడు. ఎందుకంటే కొడుకు అయితే కూలీ పనికి వెళ్లి ఎంతో కొంత తెస్తాడు. అదే కూతురు అయితే ఆదాయానికి బదులు వ్యయం అవుతుంది అని అతని నమ్మకం. దాని వల్ల శ్యామ్‌ని అనరాని మాటలు అన్నాడు ఆ పాప వాళ్ల నాన్న.

ఆ పోలీసు మన దెబ్బలు తగిలిన శ్యామ్‌ని అతని ఇంటికి తీసుకుని వెళ్లాడు.

పోలీసు :- “ఏంటి కుర్రోడా ఆ రోషం… వాళ్లు అంతా మంది ఉండగా భయం అనిపించలేదా?” అని అడిగాడు.

అప్పుడు శ్యామ్ :- “ఆ పాపని చూశారు కదా సార్… 6 సంవత్సరాలు అంట… వాళ్ల నాన్న ఆ పాపని వదిలించుకోవడానికి చూశాడు…” అని అన్నాడు.

అప్పుడు ఆ పోలీసు శ్యామ్‌కి చిన్న బ్యాండేజ్ ఇచ్చి — “అయితే నీకు ఎవరు లేరు అంటావ్? అలా రోజుకో ఊరు తిరగడమేనా, లేక ఏమైనా పని చూసుకుందాం అనుకుంటున్నావా?” అని అన్నాడు.

శ్యామ్ ఆలోచించి — “నేను ఒక రైటర్‌ని సార్… ఒక పుస్తకం, పెన్ ఉంటే ఇస్తారా?” అని అడిగాడు.

అప్పుడు ఆ పోలీసు — “కచ్చితంగా ఇస్తాను” అని అన్నాడు.

Chapter Illustration

శ్యామ్ ఆ పుస్తకంలో రాసిన మొదటి అధ్యాయం:-

“బాల్య వివాహాలు — అజ్ఞాన సమాజం”

అందులో — “ఎందుకు తల్లితండ్రులు ఆడపిల్లని అంత త్వరగా ఎవరో ఒకరికి కట్టబెట్టాలని చూస్తారు? ఏం అయినా అంటే ‘ఆడపిల్ల అప్పటికైనా అత్తారింటికి వెళ్లాల్సిందే’ అంటున్నారు. మరి అప్పటికైనా చావాల్సిందే కదా? చచ్చిపోండి అయితే… అది తప్పు కదా!

వాళ్లని కనడం వరకే అధికారం. వాళ్ల జీవితంలో అతి ముఖ్యమైన వివాహం మరియు సొంత నిర్ణయాలలో ప్రతి మనిషికి సమాన హక్కులు ఉంటాయి. నీది ప్రాణం అయితే నీ కూతురిది ప్రాణం కాదా?

బాల్య వివాహాలు ఎలాంటివి అంటే అప్పుడే పుట్టిన పసిపాపను సముద్రం ఈదమన్నట్టే. వాళ్లు బయాలజికల్‌గా పెళ్లికి సిద్ధంగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. అదే జ్ఞానం, ధర్మం.

అది జనం తెలుసుకున్న నాడు చిన్న వయసులో పురిటి నొప్పులతో చనిపోయే అమాయకపు చిన్నారులను కాపాడుకోవచ్చు… ఇకనైనా మేలుకోండి.

జై హింద్.

— రైటర్ శ్యామ్.”

✧ ✧ ✧

MOUNA KAVYAM

By Ajay.

Published: May 19, 2026 at 11:53 AM

© 2026 Ajay.. All rights reserved. Do not copy, distribute, or steal.

Memory Verification

"ఆడపిల్ల ఎప్పటికైనా అత్తారింటికి వెళ్లాల్సిందే. చిన్న వయసు అయితే ఏంటి?" అని శ్యామ్‌ని ఎవరు ప్రశ్నించారు?

Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...