SCREEN ON

Loading File

Chapter 29

Chapter 28
Chapter 29
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 28

MOUNA KAVYAM

Chapter 29
Chapter 28
Chapter 29

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 29

Jump Now

Directory

01

Episode 1

02

Episode 2

03

Episode 3

04

Episode 4

05

Episode 5

06

Episode 6

07

Episode 7

08

Episode 8

09

Episode 9

10

Episode 10

11

Episode 11

12

Episode 12

13

Episode 13

14

Episode 14

15

Episode 15

16

Episode 16

17

Episode 17

18

Episode 18

19

Episode 19

20

Episode 20

21

Episode 21

22

Episode 22

23

Episode 23

24

Episode 24

25

Episode 25

26

Episode 26

27

Episode 27

28

Episode 28

Active
29

Episode 29

30

Episode 30

31

Episode 31

32

Episode 32

Chapter // 28

Episode 28

తర్వాతి రోజు తెల్లవారుజామున

రుక్మిణీ సూర్యోదయానికి ముందే లేచి, స్నానం చేసి, చక్కగా దేవుడికి పూజ చేసి, తులసికోటకి బొట్లు పెట్టి అలంకరించి, ఇల్లు వాకిలి శుభ్రం చేసి, అందరూ నిద్ర లేవకముందే వంటగదిలో వంట చేయడం మొదలుపెట్టింది. అందరూ వంటగది నుండి వచ్చే ఆ గుమగుమలాడే సువాసనకి లేచారు.

ప్రేమ్ :-

"అబ్బా! ఏంటి వాసన! చూస్తేనే నోరు ఊరిపోతుంది! పళ్ళు తోముకోకపోయినా పర్లేదు, ముందు వెళ్లి తినేయాలి!" అని వంటగది వైపు వెళ్లాడు.

కానీ అక్కడ ముందుగానే అందరూ వంటగది బయట నిలబడి ఉన్నారు.

అందరూ వంటగది దగ్గరకి వచ్చి చూస్తే… మన రుక్మిణీ చక్కగా వంట చేస్తోంది.

తెల్లని వోణి… తడి జుట్టు మల్లెపూలతో అల్లుకుంది… నుదుటిపై చిన్న కుంకుమ బొట్టు… చేతికి గాజుల చప్పుళ్లు చేస్తుంటే… ఆ వంటగది మొత్తం ఒక ఇంటి ఆప్యాయతతో నిండిపోయింది.

పెద్ద పెద్ద ఇత్తడి పాత్రల్లో వేడి వేడి ఉప్మా, పక్కనే నెయ్యి వాసన వస్తున్న పెసరట్టు, కొబ్బరి పచ్చడి, అల్లం చట్నీ, మరి ఇంకో మూలలో బెల్లం పాయసం కూడా సిద్ధంగా ఉన్నాయి.

1980 కాలం నాటి ఆ సాదాసీదా అల్పాహారం… కానీ ఆ వాసనలో ప్రేమ ఉంది… ఆత్మీయత ఉంది.

ప్రేమ్ :-

"చూడు చెల్లమ్మ! నాకు ఆ పెసరట్టులు కొన్ని వేసావనుకో, తిని ఎలా ఉందో చెప్తా!" అని అన్నాడు.

అప్పుడు రుక్మిణీ ఒక్క నవ్వు నవ్వి,

"వెళ్లి మొహం కడుక్కొని రా అన్నయ్య!" అని అంది.

(రుక్మిణీ చేతులు నడుముపై పెట్టుకుని) :-

"ఎవ్వరూ ఇంకా తినరు! ముందు అందరూ వెళ్లి ముఖం కడుక్కొని, పళ్ళు తోముకుని వచ్చి కూర్చోండి!" అని ఆజ్ఞ వేసింది.

అప్పుడే శ్యామ్ ఆ వంటగదిలోకి నేరుగా వెళ్లాడు.

ప్రేమ్ :-

"బాబు! రా, మొహం కడుక్కొని వద్దాం!" అని అన్నాడు.

శ్యామ్ :-

"నేను స్నానం కూడా చేసేశా! నువ్వే లేట్!" అని చెప్పి రుక్మిణీ దగ్గరకి వెళ్లిపోయాడు.

ప్రేమ్ :-

"చెల్లి! నాకు కొన్ని ప్రత్యేకంగా పక్కన పెట్టు, లేకపోతే మొత్తం వీడే తినేస్తాడు!" అని బయటకి వెళ్లిపోయాడు ప్రేమ్.

ఆ మాట విన్న రుక్మిణీ నవ్వుకుంది.

శ్యామ్ మాత్రం పక్కనే నిలబడి ఆమెనే చూస్తున్నాడు.

ఎందుకో… ఆ క్షణంలో రుక్మిణీ అతనికి ఒక ప్రశాంతమైన ఇంటిలా అనిపించింది.

రుక్మిణీ శ్యామ్‌కి తను చేసిన వంటకాలు ఇచ్చి,

"తిని ఎలా ఉన్నాయో చెప్పు!" అని అంది.

శ్యామ్ వాటిని రుచి చూసి,

"అబ్బో! అమోఘం! చాలా బాగా చేసావ్!" అని అన్నాడు.

అంతే కాదు… రుక్మిణీకి కూడా స్వయంగా తన చేత్తో తినిపించాడు.

శ్యామ్ తినిపిస్తున్నాడు అని రుక్మిణీ ఎంతో ఆనందంగా తిని,

"నిజమే! చాలా బాగుంది!" అని అంది.

శ్యామ్ ఆమె వైపు చూసాడు.

ఇద్దరి కళ్ళూ ఒక్క క్షణం కలిశాయి.

అప్పుడే ప్రేమ్ :-

"ఓహో! మేము ఉన్నాం ఇక్కడ!" అని అరిచాడు.

అందరూ నవ్వేశారు.

రుక్మిణీ :-

"అప్పుడే వచ్చేశారా! సరే, అలా కూర్చోండి, వడ్డిస్తా!" అని అంది.

అందరూ నవ్వుకుంటూ అల్పాహారం తింటున్నారు.

ఆ చిన్న ఇంట్లో ఆ ఉదయం ఒక కుటుంబం లాంటి వెచ్చదనం నిండిపోయింది.

రుక్మిణీ వంటగది తలుపు దగ్గర నిలబడి అందరినీ చూస్తోంది.

శ్యామ్ తన చేత్తో తినిపించిన ఆ ఒక్క ముద్ద ఇంకా ఆమె గుండెల్లో తియ్యగా తిరుగుతోంది.

అప్పుడే…

బయట ఆవరణలో ఎవరో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వచ్చారు.

"శ్యామ్ బాబు ఉన్నాడా…?" అని ఒక భారమైన గొంతు వినిపించింది.

అందరూ ఒక్కసారిగా బయట వైపు చూశారు.

గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు వరహాలు.

అతని మొహం మునుపటిలా గర్వంగా లేదు. కళ్ళలో నిద్రలేని రాత్రుల అలసట ఉంది. తల కొంచెం వంగిపోయింది. మనసులో ఏదో పశ్చాత్తాపం అతన్ని లోపల నుండే కరిగిస్తున్నట్టు ఉంది.

శ్యామ్ ఒక్కసారిగా లేచాడు.

అతన్ని చూసిన ప్రేమ్ కనుబొమ్మలు ముడిచాడు. మీనాక్షి విషయం లో జరిగిన అవమానం ఇప్పటికీ అతని మదిలో తాజాగా ఉంది.

కానీ…

మన శ్యామ్ మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందుకి వెళ్లాడు.

"మామయ్య… రండి…" అని గౌరవంగా అన్నాడు.

అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు.

ఇంత అవమానించిన మనిషిని కూడా… ఇంత మర్యాదగా పలకరించగలిగాడు మన శ్యామ్.

శ్యామ్ వెంటనే కుర్చీ తీసి :-

"ఇలా కూర్చోండి మామయ్య…" అని అన్నాడు.

వరహాలు కూర్చోలేకపోయాడు.

అతని చేతులు వణుకుతున్నాయి.

కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు.

ఆ నిశ్శబ్దం… చాలా భారంగా ఉంది.

చివరికి వరహాలు నెమ్మదిగా శ్యామ్ వైపు చూశాడు.

"బాబు…" అని మొదలుపెట్టి ఆగిపోయాడు.

గొంతు కంపించింది.

"ఆ రోజు… నీ మీద చేసిన అవమానం… ఇప్పుడిప్పుడే నా కళ్ళ ముందు తిరుగుతోంది బాబు…" అని అన్నాడు.

శ్యామ్ మౌనంగా వింటున్నాడు.

వరహాలు కళ్ళలో నీళ్లు తిరిగాయి.

"నీ నాన్న చేసిన తప్పులకి… నిన్ను శిక్షించాం మేము… నీ చిన్నప్పటి నుండి నిన్ను దూరం పెట్టాం… నీ గుండె ఎంత బాధపడి ఉంటుందో ఇప్పుడు అర్థమవుతోంది బాబు…"

అతను ఒక్కసారిగా చేతులు జోడించాడు.

"నన్ను క్షమించు…" అని వరహాలు అన్నాడు.

ఆ మాటతో అక్కడ ఉన్న వాళ్ళంతా నిశ్శబ్దంగా అయిపోయారు.

శ్యామ్ వెంటనే దిగ్భ్రాంతిగా :-

"అయ్యో మామయ్య! మీరు పెద్దవారు… అలా చేయొద్దు…" అని అతని చేతులు పట్టుకున్నాడు.

వరహాలు కళ్ళలోంచి కన్నీళ్లు జారిపోయాయి.

"నువ్వు గొప్పోడివయ్యా శ్యామ్… మేము మాత్రం నిన్ను అర్థం చేసుకోలేకపోయాం…"

కొన్ని క్షణాలు మౌనం.

ఆ తర్వాత…

అతను చాలా ధైర్యం కూడబెట్టుకుని చెప్పాడు.

"మీనాక్షి నిన్ను ప్రేమిస్తుంది బాబు…"

ఆ మాట వినగానే…

వంటగదిలో ఉన్న రుక్మిణీ చేతిలోని గరిటె ఆగిపోయింది.

ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.

బయట మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

వరహాలు :-

"నిన్ను పెళ్లి చేసుకుంటే… నేను చేసిన పాపం కొంతైనా కడిగేసుకున్నట్టు అవుతుంది. మళ్ళీ మన కుటుంబం అంతా ఒక్కటై ఉంటే చూడాలి బాబు… ఇది నా చివరి కోరిక అనుకో…"

ఆ మాటలు విన్న రుక్మిణీ ముఖం నెమ్మదిగా వెలుతురు కోల్పోయింది.

పెనం మీద పెసరట్టు మెల్లగా మాడిపోతోంది…

కానీ ఆమెకి అది కూడా తెలియడం లేదు.

ఆమె కళ్ళ ముందు ఒక్కసారిగా ఎన్నో విషయాలు మెదిలాయి.

హరిచంద్ర గారి మాటలు…

కులం గురించి చెప్పి చేసిన అవమానం…

శ్యామ్ ఎదుర్కొన్న నిరాకరణ…

ఇప్పుడు…

శ్యామ్ కుటుంబం మళ్ళీ ఒక్కటయ్యే అవకాశం.

మీనాక్షి అతన్ని ప్రేమిస్తుంది.

ఆ కుటుంబం అతన్ని అంగీకరిస్తోంది.

కానీ…

తన నాన్న?

ఎప్పటికీ ఒప్పుకోరు.

తన వల్ల… మళ్ళీ శ్యామ్ జీవితం సమస్యల్లో పడుతుంది.

రుక్మిణీ గుండె నెమ్మదిగా విరిగిపోతోంది.

"అంటే… శ్యామ్ జీవితంలో నా పాత్ర ఇక్కడితో అయిపోయిందా…?"

అని ఆమె మనసు అడిగింది.

ఆ రెండు రోజులు…

జాతర…

ఆ giant wheel…

ఆ చేతిపట్టుకుని నడిచిన క్షణం…

"అది స్వేచ్ఛ…" అని చెప్పిన శ్యామ్ మాట…

అన్నీ ఒక్కసారిగా జ్ఞాపకాలుగా మారిపోతున్నాయి.

ఆమె కళ్ళలో నీళ్లు నిండిపోయాయి.

కానీ బయటికి రాలేదు.

ఎందుకంటే…

ఆమె ప్రేమ స్వార్థం కాదు.

శ్యామ్ సంతోషంగా ఉంటే చాలు అని అనిపించేంత నిజమైనది.

వంటగదిలో ఒంటరిగా నిలబడి… నెమ్మదిగా తన కన్నీళ్లు తుడుచుకుంది.

"ఈ రెండు రోజులు… నా జీవితానికి చాలు…"

అని మనసులో అనుకుంది.

"ఇక వెళ్లిపోవాలి…"

ఆ నిర్ణయం తీసుకున్న క్షణంలో… ఆమె గుండె లోపల ఏదో కూలిపోయినట్టు అనిపించింది.

Chapter Illustration
✧ ✧ ✧

MOUNA KAVYAM

By Ajay.

Published: May 26, 2026 at 8:12 AM

© 2026 Ajay.. All rights reserved. Do not copy, distribute, or steal.

Memory Verification

అందరూ భోజనం చేస్తుండగా, గుమ్మం దగ్గరకు భారమైన గొంతుతో వచ్చింది ఎవరు?

Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...