SCREEN ON

Loading File

Chapter 20

Chapter 19
Chapter 20
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 19

MOUNA KAVYAM

Chapter 20
Chapter 19
Chapter 20

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 20

Jump Now

Directory

01

Episode 1

02

Episode 2

03

Episode 3

04

Episode 4

05

Episode 5

06

Episode 6

07

Episode 7

08

Episode 8

09

Episode 9

10

Episode 10

11

Episode 11

12

Episode 12

13

Episode 13

14

Episode 14

15

Episode 15

16

Episode 16

17

Episode 17

18

Episode 18

19

Episode 19

Active
20

Episode 20

21

Episode 21

22

Episode 22

23

Episode 23

24

Episode 24

25

Episode 25

26

Episode 26

27

Episode 27

28

Episode 28

29

Episode 29

30

Episode 30

31

Episode 31

32

Episode 32

Chapter // 19

Episode 19

పద్దు :- "ఏంటి రుక్మిణీ నువ్వు చేసిన పని? ఆ పెళ్లి వాళ్లు నీ మీద అసలు పెట్టుకున్నారు, వాళ్లకి నువ్వు నచ్చావ్!! మరోవైపు శ్యామ్ శ్యామ్ అని అంటావ్? అసలు నీకు ఏం కావాలో నీకే తెలీదు? నువ్వు చేసిన పని చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది నాకు?" అని అరిచేసింది పద్దు.

రుక్మిణీ :- "నన్ను ఏం చేయమంటావ్ అక్క? వాళ్ల ముందు అలా అంటే నాన్న గారి పరువు ప్రతిష్టలు ఏం అవుతాయి? నాకు భయం వేసింది..." అని అంటుంది రుక్మిణీ.

అప్పుడు పద్దు :- "ఆ శ్యామ్ ఎక్కడ ఉన్నాడు? నీకు పెళ్లి అవుతుంది అని తెలిసి కూడా రాలేదు అంటే అసలు నువ్వు అంటే ఇష్టం ఉన్నట్టా లేనట్టా? ఏం అనుకోవాలి అతని గురించి??? నిన్ను ఈ పరిస్థితిలో వదిలిపెట్టాడు?" అని గట్టిగా అడిగింది రుక్మిణీని.

పాపం మన రుక్మిణీ దగ్గర ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం లేదు.

పద్దు :- "ఇదిగో ఇలానే నిశ్శబ్దంగా ఉండి పోయే సమస్యని ఇంతదాకా తెచ్చుకున్నావ్!! అసలు వస్తాడో రాడో తెలియని శ్యామ్ కన్నా కళ్ల ముందే ఉన్న శ్రీకాంత్ ఏ మిన్న! పైగా పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు శ్యామ్ శ్యామ్ అంటూ తిరిగితే నిన్ను కనీ పెంచిన పాపానికి నాన్న అమ్మ ఏం అవ్వాలి? మన కుటుంబంలో ఇలాంటివి ఎప్పుడూ లేవని తెలుసు గా?" అని అంది.

అప్పుడు రుక్మిణీ :- "నువ్వు నాన్న తరఫున ఆలోచిస్తున్నావు అక్క, అది మంచి విషయం. కానీ తల్లితండ్రులు పెళ్లి చేసే వరకే, ఆ తర్వాత మన జీవితం మొత్తం మన భాగస్వామితోనే బ్రతకాలి! అలాంటప్పుడు నచ్చినవారితో బ్రతకడం తప్పు ఎలా అవుతుంది?" అని అంది రుక్మిణీ.

ఆ మాటలు విన్న పద్దుకి కోపం తన్నుకొచ్చింది.

పద్దు :- "అలా అయితే శ్రీకాంత్ వెళ్తేటప్పుడు ఏం అన్నాడో విన్నావ్ గా? అతను ఏం తప్పు చేశాడు అని బాధకి గురి అవ్వాలి?" అని అడిగింది.

అప్పుడు రుక్మిణీ కళ్ళు ఎర్రబడ్డాయి....

Chapter Illustration

కోపంగా రుక్మిణీ :- "ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోలేకపోవడం!! ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకోవడం!" అని బలంగా చెప్పింది.

పద్దు రుక్మిణీ ఆగ్రహం చూసి వెనక్కి తగ్గింది. పెళ్లి చూపుల్లో అందరూ ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకోవడం, మన రుక్మిణీని ఎవ్వరూ ఏమి అడగకపోవడం — అది చాలా పెద్ద తప్పు. కాబట్టి అక్కడ అందరూ తప్పు చేసినట్టే....

అప్పుడు పద్దు :- "నువ్వు నీ జీవితాన్ని నీ చేతులతో నాశనం చేసుకుంటున్నావ్! మంచిది..." అని పద్మిని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అడ్డుగా నిలబడి ఉన్నాడు పద్మిని వాళ్ల ఆయన.

పద్మిని భర్త :- "పెళ్లి చూపులకి రాలేకపోయా, ఆలస్యం అయ్యింది అని బాధపడ్డా. కానీ రాకపోవడమే మంచిది అయ్యిందా? ఏంటి రుక్మిణీ, అంతే కదా?" అని అడిగాడు.

అప్పుడు రుక్మిణీ తల దించుకుని ఏం మాట్లాడలేదు.

పద్దు :- "ఏవండీ, చెల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ఎంత నచ్చచెప్పినా నా మాట వినడం లేదు. మీరైనా చెప్పండి..." అని అంది.

అప్పుడు రఘురాం :- "చూడు రుక్మిణీ, ఆ శ్యామ్ ఎక్కడ ఉన్నా పట్టుకురావడం బాధ్యత నాది. నువ్వు వివరాలు చెప్పు చాలు..." అని అన్నాడు.

ఆ మాట విన్న రుక్మిణీకి ధైర్యం వచ్చింది. వాళ్ల బావగారు అర్థం చేసుకున్నారు అనే విముక్తి కలిగింది మన రుక్మిణీకి. శ్యామ్ వివరాలతో పాటు శ్యామ్ చిన్ననాటి ప్రాణ స్నేహితుడు అయిన ప్రేమ్ గురించి చెప్పింది. ప్రేమ్‌ని కలిస్తే ఏదోలా శ్యామ్‌ని పట్టుకోవచ్చు అనే చిన్న ఆశ...

పద్దు :- "ఏంటి అండి అది? ఏదో చిన్నపిల్ల, దానికి ఏం తెలీదు అనుకుంటే మీరు అలానే అంటున్నారు?" అని అంది.

అప్పుడు రఘురాం :- "తప్పు ఏం ఉంది? తన అభిప్రాయం కూడా ముఖ్యం ఏ కదా?" అని అన్నాడు.

అప్పుడు రుక్మిణీ :- "బావగారు నాకు సపోర్ట్ చేస్తున్నారు అని నీకు కుళ్లు..." అని ఒక హాస్యపూర్వకమైన మాట అంది.

ఆ మాటకి పద్మిని, రఘురాం ఇద్దరూ నవ్వుకున్నారు. వాళ్ల మధ్య ఎలాంటి వైరం లేదు అనడానికి ఇది నిదర్శనం. కేవలం ఒక్క అక్కలా రుక్మిణీ బాగోగుల కోసం ఆలోచించింది మన పద్దు.

ఇక శ్యామ్‌ని వెతికి పట్టుకోవడమే అసలైన లక్ష్యం... చూద్దాం తర్వాత ఏం అవుతుందో.

MOUNA KAVYAM

By Ajay.

Published: May 21, 2026 at 2:33 PM

© 2026 Ajay.. All rights reserved. Do not copy, distribute, or steal.

Memory Verification

పద్దు మరియు రుక్మిణిల సంభాషణను వెనుక నుండి అడ్డుగా నిలబడి విన్నది ఎవరు?

Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...