SCREEN ON

Loading File

Chapter 16

Chapter 15
Chapter 16
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 15

MOUNA KAVYAM

Chapter 16
Chapter 15
Chapter 16

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 16

Jump Now

Directory

01

Episode 1

02

Episode 2

03

Episode 3

04

Episode 4

05

Episode 5

06

Episode 6

07

Episode 7

08

Episode 8

09

Episode 9

10

Episode 10

11

Episode 11

12

Episode 12

13

Episode 13

14

Episode 14

15

Episode 15

Active
16

Episode 16

17

Episode 17

18

Episode 18

19

Episode 19

20

Episode 20

21

Episode 21

22

Episode 22

23

Episode 23

24

Episode 24

25

Episode 25

26

Episode 26

27

Episode 27

28

Episode 28

29

Episode 29

30

Episode 30

31

Episode 31

32

Episode 32

Chapter // 15

Episode 15

మధ్యానం 2:30 అవుతుంది.

రుక్మిణీకి ఎందుకో శ్యామ్‌ని చూడాలి అని అనిపించింది, కానీ తర్వాత ఎలా, ఎప్పుడు, ఎక్కడ కలవాలి ఒకరికి ఒకరు చెప్పుకోలేదు వాళ్లు ఇద్దరూ. దాంతో రుక్మిణీకి శ్యామ్‌ని ఎలా కలవాలో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి అని ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్లు ఉండగా రుక్మిణీ బయటకి వెళ్లాలి అని నిర్ణయం తీసుకుంది. గడప దాటడానికి చాలానే ఆలోచించింది. మొత్తానికి ధైర్యం చేసి గబగబా బయటకి వెళ్లిపోయింది.

తను ఎప్పుడూ వెళ్లే గుడికి వెళ్లింది. బహుశా శ్యామ్ అక్కడికి అదే సమయానికి వచ్చే అవకాశం ఉంటుంది అని. గుడిలో కూచిపూడి నేర్చుకుంటున్న వాళ్లు ఉన్నారు. వాళ్లకి కుంచం ఎడమగా కూర్చుని శ్యామ్ కోసం ఎదురు చూస్తుంది మన రుక్మిణీ. వాళ్ల వెనుక పారుతున్న గోదావరి నది, సాయంత్రం వేళలో వచ్చే సూర్యకాంతికి బంగారం లా మెరుస్తుంది ఆ నది. ఎంతసేపైనా శ్యామ్ రాకపోయే సరికి చాలా బాధగా, విచారంగా కూర్చుంది మన రుక్మిణీ.

అక్కడ నాట్యం చేస్తున్న చిన్నారులు రుక్మిణీని చూసి “ఏం అయ్యింది అక్క?” అని సైగ చేసి అడిగారు. అప్పుడు “ఏం లేదు” అని నవ్వుతూ తల అడ్డంగా ఊపింది రుక్మిణీ. ఇంకా సాయంత్రం అవుతుంది, చీకటి పడేలోపు ఇంటికి వెళ్లకపోతే అంతే సంగతులు అని మన రుక్మిణీ పైకి లేచింది.

అప్పుడు అక్కడ నాట్యం చేస్తున్న ఇద్దరు చిన్నారులు మన రుక్మిణీ కూడా వాళ్లతో కలిసి నాట్యం చేయమన్నారు. వాళ్ల సంతోషం కాదు అనలేక వాళ్లతో కలిసి నాట్యం చేయడం మొదలు పెట్టింది, ఏదో నెమలి నాట్యం చేస్తున్నట్టు. రుక్మిణీ నాట్యం చేస్తున్నంతసేపు అందరూ అవాక్కై చూస్తూ ఉండిపోయారు. రుక్మిణీతో కలిసి నాట్యం చేసే వాళ్లు కూడా రుక్మిణీ నాట్యం చూడడం కోసం వాళ్ల నాట్యం ఆపేసి ఎదురుగా కూర్చున్నారు. ఆఖరికి వాళ్లకి నాట్యం నేర్పిస్తున్న గురువుగారు కూడా ముగ్ధురాలు అయ్యింది.

Chapter Illustration

కానీ నాట్యంలో పడి సమయం మర్చిపోయింది మన రుక్మిణీ. రుక్మిణీ కోసం వాళ్లింట్లో వెతకడం మొదలు పెట్టారు. రుక్మిణీ వాళ్ల నాన్న వాళ్ల డ్రైవర్‌ని,

“రే పక్క ఊరికి వెళ్దాం పద. రుక్మిణీ కనిపించట్లేదు. నువ్వు చెప్పింది నిజమేమో అనిపిస్తుంది” అని చాలా కోపంగా అన్నాడు రుక్మిణీ వాళ్ల నాన్న హరిచంద్ర.

అప్పుడు పక్కనుండి వాళ్ల అమ్మ,

“రుక్మిణీ గుడి దగ్గర ఉంటుంది అండి. పక్క ఊరు వెళ్లాల్సిన అవసరం దానికి ఏంటి? నేను వెళ్లి చూసి వస్తాను ఉండండి” అని వెళ్లింది సుమతి.

“గుడి దగ్గర లేకపోతే ఏం చేయాలో తెలుసు గా?” అని అన్నాడు హరిచంద్ర.

సుమతి వెళ్లి చూస్తే అక్కడ రుక్మిణీ నాట్యం చేస్తూ కనిపించింది. అందరినీ ఆకట్టుకున్న మన రుక్మిణీ నాట్యం. వాళ్ల అమ్మని చూసి ఆగిపోయింది. అందరి మధ్యలో రుక్మిణీని చెంప మీద కొట్టింది వాళ్ల అమ్మ.

“నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలీదు అనుకుంటున్నావా?” అని అంది.

రుక్మిణీకి అర్థం అయ్యింది శ్యామ్ గురించి తెలిసిపోయింది ఏమో అని.

రుక్మిణీని వాళ్లింటికి తీసుకొచ్చారు.

రుక్మిణీని వాళ్ల అమ్మ కొట్టడం, అలాగే ఎప్పుడూ రుక్మిణీకి ఒక మంచి స్నేహితుడిలా ఉండే వాళ్ల నాన్న తనని కోపంగా చూడడం...

“నేను మీకు ఎప్పుడో చెప్పాను, దీనికి గారాబం చేయకండి చెడిపోతుంది అని. నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి ఎలాంటి పని చేసిందో... పరువు తీస్తున్నావ్ కదే” అని కొట్టబోయింది సుమతి.

అప్పుడు వాళ్ల నాన్న ఆపి,

“కొట్టడం పరిష్కారం కాదు. ఎలా చెప్పాలో, ఏం చేయాలో నాకు బాగా తెలుసు” అని అంటాడు రుక్మిణీ వాళ్ల నాన్న.

అప్పుడు రుక్మిణీకి అనుమానం వచ్చింది. శ్యామ్ గురించి ఏమైనా తెలిసిపోయింది ఏమో అని. రుక్మిణీ నోటి నుండి,

“నాన్న... శ్యామ్...” అని అనబోతుంటే,

అప్పుడు వాళ్ల అమ్మ,

“ఇది ఇలా కప్పి గెంతులు వేస్తూ ఉంటే రేపు ఎవడు చేసుకుంటాడు అండి...” అని గట్టిగా అంది సుమతి.

ఆ మాటతో ఊపిరి తీసుకుంది మన రుక్మిణీ. వాళ్ల అమ్మ ఆ మాట అనడం కుంచం ఆలస్యం అయ్యి ఉంటే, శ్యామ్ గురించి రుక్మిణీ మొత్తం చెప్పేదే. ఎందుకంటే అప్పటివరకు శ్యామ్ గురించి తెలిసింది ఏమో అనే కంగారు మన రుక్మిణీ మొహంలో చాలా స్పష్టంగా కనిపించింది.

అప్పుడు రుక్మిణీ వాళ్ల నాన్న,

“ఇకమీదట నువ్వు ఇల్లు దాటి బయటకి వెళ్లడానికి వీలులేదు. ఒకవేళ వెళ్తే నీ పెళ్లి అయ్యాకే. సూరిబాబు గారితో మాట్లాడి సంబంధాలు చూడమంట” అని కోపంగా లోపలికి వెళ్లిపోతాడు.

ఆ మాట వినగానే రుక్మిణీ మనసు ముక్కలైంది. ఒక్కపక్క శ్యామ్ ఏం అయ్యిపోయాడో కనరాలేదు. శ్యామ్ ఎక్కడ ఉంటాడో కూడా తెలీదు. శ్యామ్‌కి కూడా మన రుక్మిణీ వాళ్ల ఇల్లు తెలీదు. ఇప్పుడు వీళ్లు ఎలా కలుస్తారు...?

రుక్మిణీ తన గదిలోకి వెళ్లి ఏడ్చింది. కాసేపు ఆగి తన కళ్లను తుడుచుకుని,

“అసలు ఈ అబ్బాయి ఏంటో... ముందు మాట అనే సాకు తో దగ్గర అయ్యి, ఇప్పుడు అవసరం తీరిపోయాక కనీసం చూడడానికి కూడా రాలేదు... అంతే కలికాలం... అవసరం లేకపోతే ప్రేమ కూడా విలువలేనిదే...” అని బాధతో కూడిన మనోవేదనతో అన్న మాటలు ఆ గది గోడలకి మాత్రమే తెలుసు.

ఆ రోజు మన రుక్మిణీ ఎంత బాధపడిందో...

ఇది ఇలా ఉంటే, ఇంతకీ మన శ్యామ్ గారు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు...?

MOUNA KAVYAM

By Ajay.

Published: May 19, 2026 at 11:53 AM

© 2026 Ajay.. All rights reserved. Do not copy, distribute, or steal.

Memory Verification

గుడి దగ్గర ఉన్న చిన్నారులు ఏ నాట్యం నేర్చుకుంటున్నారు?

Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...