Loading File
Initializing...
Chapter 19
Turning the page...
Continue your journey — select a new file
Double-tap to translate this word.
మధ్యాహ్నం రెండు గంటలు దాటుతోంది.
బిర్యానీ హోటల్‌లో కాసేపటి క్రితం వరకు నవ్వులు, సరదాలు వినిపించాయి.
కానీ ఇప్పుడు...
అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది.
రామకోటి కనిపించడం లేదు.
మొదట్లో...
"వస్తాడు లే..."
అని అనుకున్నారు.
తర్వాత...
"కొంచెం దూరం వెళ్లి ఉంటాడు..."
అని అనుకున్నారు.
కానీ సమయం గడుస్తున్న కొద్దీ...
వాళ్లందరికీ భయం మొదలైంది.
వర్ధన్, అర్వింద్, పవన్, సాయి, బాబూరావు...
ఎవరి ప్లేట్లో బిర్యానీ ఉందో వాళ్లకే గుర్తు లేదు.
అందరూ అర్ధాంతరంగా భోజనం వదిలేసి లేచిపోయారు.
ఒక్క కిరణ్ మాత్రం...
ప్లేట్ వైపు చూసాడు.
మిత్రుల వైపు చూసాడు.
మళ్లీ ప్లేట్ వైపు చూసాడు.
వాళ్లంతా బయటికి పరిగెత్తుతుండగా...
కిరణ్ మాత్రం గబగబా తినడం మొదలుపెట్టాడు.
"వాళ్లు వెళ్లిపోయేలోపు ముగించాలి..."
అని యుద్ధ ప్రాతిపదికన తింటున్నాడు.
చివరికి..
ప్లేట్‌లో చివరి ముద్ద మాత్రమే మిగిలింది.
దానిని కూడా నోట్లో వేసుకుని...
నీళ్లు తాగి...
లేచి బయటికి వెళ్లబోతున్నాడు.
అప్పుడే...
హోటల్‌లో పని చేసే ఆవిడ ఎదురుగా వచ్చి నిలబడింది.
"తమ్ముడు!"
"బిల్ కట్టకుండా ఎక్కడికి పోతున్నావ్?"
అంది ఆ అక్కా
కిరణ్ నోట్లో ఇంకా అన్నం ఉంది.
"వాళ్లు కట్టలేదా?"
అని ఆశ్చర్యంగా అడిగాడు.
ఆవిడ మొహం సీరియస్ అయింది.
"లేదు." అని గట్టిగా చెప్పింది
అంతే.
కిరణ్ గుండె జారి పడిపోయింది.
"అక్కా!"
"అందరి బిల్లు నేనొక్కడినే ఎలా కడతాను?"
"నా బిల్లు మాత్రం కడతాను."
"నన్ను వెళ్లనివ్వు."
అన్నాడు.
ఆవిడ చేతులు కట్టుకుని నిలబడి...
"కుదరదు."
అని ఒక్క మాట చెప్పింది.
కిరణ్ దాదాపు ఏడ్చే స్థితికి వచ్చాడు.
"అక్కా..."
"వాళ్లు ఎక్కడికీ పారిపోలేదు."
"మా ఫ్రెండ్ కనిపించడం లేదు."
"వాడిని వెతుకుతున్నారు."
"ఇప్పుడే వస్తారు."
"ఈలోపు నా బిల్లు తీసుకుని నన్ను వదిలేయ్ అక్క"
అన్నాడు.
ఆవిడకు మాత్రం అస్సలు కనికరం రాలేదు.
"ఎంట్రా!"
"బిల్ అడిగితే ఇంత గోల చేస్తున్నావ్?"
"నోరు మూసుకుని అక్కడే కూర్చో."
"వాళ్లు వచ్చేవరకు నువ్వు కదలడానికి వీల్లేదు."
అని తీర్పు చెప్పేసింది.
పాపం కిరణ్.
స్నేహితుడు కనిపించడం లేదనే టెన్షన్ ఒకవైపు...
బిర్యానీ బిల్లు మరోవైపు...
అలా హోటల్‌లోనే చిక్కుకుపోయాడు.
మరోవైపు...
అర్వింద్, వర్ధన్ ఇద్దరూ రోడ్ల మీద వెతుకుతున్నారు.
ప్రతి వీధిలో చూస్తున్నారు.
ప్రతి బస్ స్టాప్ దగ్గర చూస్తున్నారు.
కానీ...
రామకోటి జాడ లేదు.
అప్పుడే ఊపిరి సలపకుండా బాబూరావు పరుగెత్తుకుంటూ వచ్చాడు.
"రేయ్!"
"ఒక విషయం తెలిసింది!"
అన్నాడు.
వర్ధన్ వెంటనే అడిగాడు.
"ఏమైంది?"
బాబూరావు ఊపిరి పీల్చుకుని అన్నాడు.
"వాడు ఎవరో బైక్ మీద లిఫ్ట్ ఎక్కాడంట!"
అంతే.
అర్వింద్, వర్ధన్ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు.
"నిజమా?"
"ఎటు వెళ్లాడంట?"
అని వర్ధన్ అడిగాడు.
బాబూరావు చేతితో ఒక దిశ చూపించాడు.
"అటు వెళ్లాడట."
అన్నాడు.
అర్వింద్ వెంటనే గడియారం చూసాడు.
2:16 PM
అతని ముఖం ఒక్కసారిగా సీరియస్ అయింది.
"రేయ్!"
"ఇంకో గంటలో హాస్టల్‌కి వెళ్లకపోతే పెద్ద సమస్య."
"మనం బయటికి వెళ్లిన విషయం వార్డెన్ మేడమ్‌కి తెలిసిపోతుంది."
"మళ్లీ ఇంకో గొడవ వద్దు."
అని అన్నాడు.
తర్వాత వెంటనే నిర్ణయం తీసుకున్నాడు.
"బాబూరావు."
"సాయి."
"మీ ఇద్దరూ హాస్టల్‌కి వెళ్లిపోండి."
"నేను, వర్ధన్, పవన్ కలిసి రామకోటిని వెతుకుతాం."
అన్నాడు ఆర్వీంద్
కానీ బాబూరావు వెంటనే అభ్యంతరం చెప్పాడు.
"మేమూ వస్తాం."
"ఇలాంటి టైమ్‌లో ఎలా వెళ్తాం?"
అన్నాడు.
సాయి కూడా తల ఊపాడు.
కానీ ఈసారి వర్ధన్ మాట్లాడాడు.
"మావా..."
"ఏదైనా సమస్య అయితే అందరం ఇరుక్కుపోతాం."
"కనీసం మీరు వెళ్లండి."
అన్నాడు.
కొద్దిసేపు ఆలోచించిన తర్వాత...
బాబూరావు, సాయి ఇద్దరూ ఒప్పుకున్నారు.
వాళ్లు హాస్టల్ వైపు బయలుదేరారు.
మరోవైపు...
వర్ధన్, అర్వింద్ ఒక ఆటో ఆపి ఎక్కారు.
పవన్ అయితే వెళ్తున్న ఓ బైక్ ఆపి లిఫ్ట్ అడిగాడు.
ముగ్గురూ మూడు దారుల్లో వెతకడం మొదలుపెట్టారు.
హాస్టల్
సాయి, బాబూరావు గేటు దాటి లోపలికి వచ్చారు.
కానీ...
వాళ్ల అదృష్టం అంత బాగోలేదు.
గేటు దగ్గరే కొంతమంది సీనియర్లు నిలబడి ఉన్నారు.
వాళ్లను చూడగానే...
ఒక సీనియర్ చేతితో పిలిచాడు.
"ఏరా!"
"ఇక్కడికి రండి."
అన్నాడు.
బాబూరావు గుండె ఒక్కసారిగా దిగిపోయింది.
సాయి కూడా టెన్షన్ పడ్డాడు.
ఇద్దరూ నెమ్మదిగా దగ్గరకు వెళ్లారు.
సీనియర్ చేతులు కట్టుకుని అడిగాడు.
"ఎక్కడికి వెళ్లారు?"
అంతే.
బాబూరావు నోరు తెరిచాడు.
కానీ...
ఏం చెప్పాలో అర్థం కాలేదు.
అప్పుడు సాయి మెల్లగా అన్నాడు.
"అన్నా..."
"రిజల్ట్స్ వచ్చాయి కదా..."
"అందుకే చిన్న పార్టీ—"
అని పూర్తిగా చెప్పేలోపే...
సీనియర్ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు.
"మాకు చెప్పాలి కదా!"
"ఎవడి పర్మిషన్ తీసుకుని వెళ్లారు?"
"హాస్టల్ అంటే ఆటలా ఉందా?"
"ఎవరికిష్టం వచ్చినట్టు బయటికి వెళ్లిపోవడానికి?"
సాయి, బాబూరావు ఇద్దరూ తలలు వంచుకున్నారు.
కానీ సీనియర్ ఇంకా ఆగలేదు.
"నేను చూడలేదనుకున్నారా?"
"మీరు మొత్తం ఏడుగురు వెళ్లారు."
"ఇప్పుడు తిరిగి వచ్చినది ఇద్దరే."
"మిగతా ఐదుగురు ఎక్కడ?"
అన్నాడు.
అంతే.
బాబూరావు కళ్ళల్లో ఒక్కసారిగా కోపం మెరిపించింది.
ఉదయం నుంచీ టెన్షన్.
రామకోటి కనిపించడం లేదు.
స్నేహితులు బయట వెతుకుతున్నారు.
ఇప్పుడు ఇక్కడ ప్రశ్నలు.
అతని గుండెలో కోపం మెల్లగా పెరుగుతోంది.
సాయి మాత్రం పక్కనే నిలబడి...
"మావా..."
"ఇప్పుడు ఏదైనా తేడా మాట్లాడకు..."
అని నెమ్మదిగా చెప్పాడు.
కానీ...
బాబూరావు ముఖం చూస్తుంటే...
అతను ఏదో చెప్పబోతున్నట్టు కనిపిస్తోంది.
అదే సమయంలో...
ఎక్కడో నగరంలో...
రామకోటి ఇంకా కనిపించడం లేదు.
అతని ఫోన్ స్విచ్ ఆఫ్.
అతను ఎక్కడ ఉన్నాడో...
ఎవరితో ఉన్నాడో...
ఎవరికీ తెలియదు.....?????
Hostel memories
By Writer_aj
Published: June 27, 2026 at 6:33 AM
Your input calibrates the database for others.
Ready to play...