SCREEN ON

Loading File

Chapter 19

Chapter 18
Chapter 19
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 18

Hostel memories

Chapter 19
Chapter 18
Chapter 19

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 19

Jump Now

Directory

01

Episode 1

02

Episode 2

03

Episode 3

04

Episode 4

05

Episode 5

06

Episode 6

07

Episode 7

08

Episode 8

09

Episode 9

10

Episode 10

11

Episode 11

12

Episode 12

13

Episode 13

14

Episode 14

15

Episode 15

16

Episode 16

17

Episode 17

18

Episode 18

Active
19

Episode 19

20

FINAL EPISODE "20"✨

Chapter // 18

Episode 18

Writer_aj
Fantasy - friendship
1 Min Read
Pub: Jun 14, 2026
Upd: Jul 17, 2026

మధ్యాహ్నం.

రిజల్ట్స్ డే టెన్షన్ ఇంకా పూర్తిగా తగ్గలేదు.

కానీ బాబూరావు చెప్పిన "వర్ధన్ సీక్రెట్ బిర్యానీ పార్టీ" కథను నిజం చేయాలని నిర్ణయించుకున్న మిత్రబృందం మొత్తం చివరికి ఒక మంచి బిర్యానీ హోటల్‌కి చేరుకుంది.

హోటల్ లోపల మంచి రద్దీ ఉంది.

ఎక్కడ చూసినా బిర్యానీ వాసన.

వెయిటర్లు అటూ ఇటూ తిరుగుతూ ఆర్డర్లు తీసుకుంటున్నారు.

స్టీల్ ప్లేట్ల శబ్దాలు, జనాల మాటలు, పిల్లల అరుపులు...

మొత్తం హోటల్ అంతా సందడిగా ఉంది.

వాళ్లకు ఒక మూలన ఖాళీగా ఉన్న పెద్ద టేబుల్ దొరికింది.

అందరూ వెళ్లి అక్కడ కూర్చున్నారు.

వర్ధన్.

రామకోటి.

పవన్.

బాబూరావు.

కిరణ్.

సాయి.

అర్వింద్.

టేబుల్ చుట్టూ కూర్చున్నా...

వాళ్ల మనసులు మాత్రం ఒక్కచోటే ఉన్నాయి.

రిజల్ట్స్.

అప్పుడే హోటల్‌లో పని చేసే ఒక ఆవిడ నవ్వుతూ వాళ్ల దగ్గరకు వచ్చింది.

"బాబు... ఏమి చెప్పమంటారు?"

అని ఆర్డర్ బుక్ చేతిలో పట్టుకుని అడిగింది.

వర్ధన్ వెంటనే మర్యాదగా అన్నాడు.

"ఇంకా కాదు అమ్మ."

"మేమే పిలుస్తాం."

"జస్ట్ ఫైవ్ మినిట్స్." అని అన్నాడు

అప్పుడు ఆవిడ :-"సరే బాబు."

అని ఆవిడ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఆవిడ వెళ్లిందో లేదో...

అకస్మాత్తుగా అర్వింద్ కుర్చీ నుంచి లేచి నిలబడ్డాడు.

అతని కళ్లలో ఆనందం.

చేతిలో ఫోన్.

"రేయ్య్య్య్!"

అని గట్టిగా అరిచాడు.

అందరూ ఒక్కసారిగా అతని వైపు తిరిగి చూశారు.

"సైట్ ఓపెన్ అయింది రా!"

"నేను ఆల్ క్లియర్!"

అని గట్టిగా నవ్వేశాడు.

అంతే.

టేబుల్ దగ్గర ఒక్కసారిగా హడావిడి మొదలైంది.

ఎవరి జేబులో ఉన్న ఫోన్లు వాళ్లు బయటకు తీశారు.

ఎవరో హాల్ టికెట్ వెతుకుతున్నారు.

ఎవరో రోల్ నెంబర్ గుర్తు చేసుకుంటున్నారు.

ఎవరో సర్వర్ డౌన్ అయిందని తిట్టుతున్నారు.

అందరూ వారి వారి రిజల్ట్స్ చెక్ చేయడంలో బిజీ అయిపోయారు.

కానీ...

ఒక్క వ్యక్తి మాత్రం ఫోన్ బయటకు తీయలేదు.

రామకోటి.

అతను నిశ్శబ్దంగా కూర్చున్నాడు.

ఫోన్ జేబులోనే ఉంది.

అది గమనించిన అర్వింద్ అతని వైపు తిరిగాడు.

"రేయ్!"

"నీ ఫోన్‌లో నెట్ లేదా?"

"ఇలా ఇవ్వు."

"నేనే చూస్తా నీ రిజల్ట్స్."

అన్నాడు.

ఆ మాట విన్న వెంటనే రామకోటి ముఖం మారిపోయింది.

"వద్దు రా."

"ఇప్పటికే మా ఇంట్లో వాళ్లు చూసి ఉంటారు."

"వాళ్లే చెప్తారు."

"నాకు ఇప్పుడే చూడాలని లేదు."

అన్నాడు.

అతని గొంతులో భయం స్పష్టంగా వినిపించింది.

కానీ అర్వింద్ సరదాగా నవ్వుతూ...

"అంత డ్రామా వద్దు."

" నేనే నా ఫోన్ లో చూస్తా."

అని అన్నాడు అరవింద్.

రామకోటి ఒక్కసారిగా కంగారుపడ్డాడు.

"రేయ్ వద్దు!"

అని చెప్పేలోపే...

అర్వింద్ అతని రోల్ నెంబర్ టైప్ చేశాడు.

రామకోటి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.

వెంటనే ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు.

కానీ...

అప్పటికే ఆలస్యమైపోయింది.

స్క్రీన్ మీద రిజల్ట్స్ ఓపెన్ అయ్యాయి.

కొన్ని క్షణాలు...

ఇద్దరూ స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోయారు.

తర్వాత...

అర్వింద్ ముఖంలో ఉన్న నవ్వు మాయమైంది.

అతని కళ్ళు పెద్దవయ్యాయి.

రామకోటి కూడా స్క్రీన్ చూసేశాడు.

FAILED – 3 SUBJECTS

అంతే.

ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయినట్టనిపించింది.

హోటల్‌లోని శబ్దాలు...

జనం...

మాటలు...

అన్నీ చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపించాయి.

రామకోటి స్క్రీన్ వైపే చూస్తున్నాడు.

అతని చేతులు కొద్దిగా వణుకుతున్నాయి.

గత కొన్ని వారాలుగా తండ్రి మాటలు గుర్తొస్తున్నాయి.

"బాగా చదువు నాన్న..."

"ఒక ఉద్యోగం తెచ్చుకో..."

"నేను కూడా ఇక కష్టపడలేకపోతున్నా..."

ఆ మాటలన్నీ ఒక్కసారిగా చెవుల్లో మోగాయి.

అర్వింద్ నెమ్మదిగా అతని భుజం మీద చెయ్యి వేశాడు.

"ఏం పర్లేదు రా కోటి."

"అడ్వాన్స్ సప్లైలో క్లియర్ చేసేద్దాం."

"అంతే కదా."

అన్నాడు.

కానీ రామకోటి స్పందించలేదు.

కొద్దిసేపటి తర్వాత మెల్లగా అన్నాడు.

"నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్ రా."

"నేనే వస్తా."

అని చెప్పాడు.

అర్వింద్ అతని కళ్లలోని బాధ చూసాడు.

ఏమీ మాట్లాడకుండా తల ఊపాడు.

"సరే."

అన్నాడు.

రామకోటి నెమ్మదిగా అక్కడి నుంచి లేచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

అర్వింద్ మళ్లీ టేబుల్ దగ్గరకు వచ్చాడు.

వర్ధన్ గమనించాడు.

"ఏమైంది?"

అని అడిగాడు.

అర్వింద్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు.

కొద్దిసేపు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.

తర్వాత కిరణ్ అన్నాడు.

"పాపం."

"బాధగా ఉంటుంది."

"కాసేపటికి వాడే వస్తాడు."

"వదిలేయండి."

అన్నాడు.

అంతలో...

బిర్యానీ ఆర్డర్ వచ్చింది.

వాసన మొత్తం టేబుల్ చుట్టూ వ్యాపించింది.

అందరి ముందు ప్లేట్లు పెట్టారు.

కానీ...

ఒక ప్లేట్ మాత్రం అలాగే ఉంది.

రామకోటి ప్లేట్.

అతని కుర్చీ ఖాళీగా ఉంది.

మొదట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

"వస్తాడు."

అనుకున్నారు.

ఐదు నిమిషాలు గడిచాయి.

పది నిమిషాలు గడిచాయి.

పదిహేను నిమిషాలు గడిచాయి.

ఇంకా రామకోటి రాలేదు.

వర్ధన్ చివరకు కంగారు పడ్డాడు.

"రేయ్..."

"వాడు ఇంకా రాలేదా?"

అన్నాడు.

అందరూ చుట్టూ చూశారు.

రామకోటి కుర్చీ ఖాళీగానే ఉంది.

అతని బిర్యానీ కూడా ఎవరూ తాకలేదు.

కిరణ్ అన్నాడు.

"ఇక్కడే ఎక్కడో ఉంటాడనుకున్నా."

"ఇంకా రాలేదా?"

ఇప్పుడు అందరికీ కొద్దిగా ఆందోళన మొదలైంది.

అర్వింద్ కూడా ప్లేట్ పక్కన పెట్టేశాడు.

అతనికి ఆకలి ఉన్నా...

తినాలనిపించలేదు.

నెమ్మదిగా లేచాడు.

"నేను చూసి వస్తా."

అన్నాడు....హోటల్ బయటికి వచ్చాడు.

రోడ్డు ఒక వైపు చూశాడు.

మరో వైపు చూశాడు.

హోటల్ ముందు చూశాడు.

పక్క వీధిలో చూశాడు.

కానీ...రామకోటి ఎక్కడా కనిపించలేదు.

అర్వింద్ గుండెల్లో చిన్న భయం మొదలైంది.

వెంటనే తిరిగి లోపలికి వచ్చాడు.

వర్ధన్ లేచిపోయాడు.

"ఏమైంది?"

అర్వింద్ తల ఊపాడు.

"ఎక్కడా కనిపించట్లేదు."

అంతే.

టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్లందరి ముఖాల్లో నవ్వులు మాయమయ్యాయి.

ఒక్కసారిగా హోటల్‌లోని సందడి వాళ్లకు వినిపించడమే ఆగిపోయింది.

అందరి మనసులో ఒకటే ప్రశ్న.

"రామకోటి ఎక్కడికి వెళ్లాడు?"

అతను కేవలం ఒంటరిగా ఉండాలని వెళ్లాడా?

లేదా...

తన బాధతో ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోయాడా?

ఆ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియదు.

వాళ్ల ముందు ఉన్న బిర్యానీ చల్లారిపోతోంది.

కానీ...

వాళ్ల స్నేహితుడు మాత్రం కనిపించడం లేదు.....

రామకోటి ఏం అయ్యిపోయడు?

ఎక్కడ ఉన్నాడు ?

Hostel memories

By Writer_aj

Published: June 27, 2026 at 5:55 AM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...