SCREEN ON

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

04

EPISODE 4

05

EPISODE 5

06

EPISODE 6

07

EPISODE 7

08

EPISODE 8

09

EPISODE 9

10

EPISODE 10

11

EPISODE 11

12

EPISODE 12

13

EPISODE 13

14

EPISODE 14

15

EPISODE 15

16

EPISODE 16

17

EPISODE 17

18

EPISODE 18

19

EPISODE 19

20

EPISODE 20

21

EPISODE 21

22

EPISODE 22

23

EPISODE 23

24

FINAL EPISODE

Active
Chapter // 24

FINAL EPISODE

Storytravel
Love-drama
1 Min Read
Pub: Feb 26, 2026

(గత ఎపిసోడ్ కొనసాగింపు...)

పీటల మీద ఉన్న మహేష్, పల్లవి ఆనందంగా ఈలలు వేస్తారు. ఆ శబ్దానికి పంతులుగారు చెవులు మూసుకుంటారు. అదంతా పక్కనుండి చూస్తున్న ప్రజ్ఞ వాళ్ల నాన్న, అన్నయ్య సీరియస్‌గా వాళ్ల దగ్గరికి వస్తారు.

ప్రజ్ఞ ధైర్యంగా సుశాంత్ ముందుకు వచ్చి, "నాన్నా... మీరు ఒప్పుకోరని నాకు తెలుసు. కానీ సుశాంత్ ఇప్పుడు ఒక సింగర్... ప్రొఫెషనల్ సింగర్," అని గట్టిగా చెబుతుంది.

ప్రజ్ఞ వాళ్ల నాన్న ఏమీ మాట్లాడకుండా నేరుగా జైరామ్ దగ్గరకు వెళ్తాడు.

"నన్ను క్షమించండి బావగారూ... మీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను. ఒక ఆడపిల్ల తండ్రిగా ఆ ఆవేశంలో అలా చేశాను కానీ, మిమ్మల్ని తక్కువ చేసి చూడటం నా ఉద్దేశం కాదు," అని పశ్చాత్తాపంతో అంటాడు.

"అయ్యో, అదేం లేదు లెండి. నాకూ ఒక ఆడపిల్ల ఉందిగా... మీ బాధ నాకు అర్థమవుతుంది. ఎలాగూ వచ్చారు కదా, రండి... నా కూతురిని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్లండి," అని జైరామ్ ఎంతో హుందాగా ఆహ్వానిస్తాడు.

పెద్దల మధ్య మనస్పర్థలు తొలగిపోవడంతో సుశాంత్, ప్రజ్ఞలు ఒకరి పక్కన ఒకరు కూర్చుని ఆ పెళ్లి వేడుకను ఆనందంగా చూస్తుంటారు. వాళ్లిద్దరినీ అలా చూసి రామ్ దూరం నుంచే చాలా సంతోషిస్తాడు. "చివరికి అంతా మంచే జరిగింది," అని మనసులో అనుకుని మురిసిపోతాడు.

(కొన్ని సంవత్సరాల తరువాత)

అలా మొదలైన సుశాంత్ ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగింది. సినిమాల్లో పాడే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. సింగింగ్‌లో తనదైన ముద్ర వేశాడు. మెల్లగా పేరు, ప్రఖ్యాతులు అన్నీ అతని సొంతమయ్యాయి. పెద్దల అంగీకారంతో ప్రజ్ఞతో వివాహం కూడా ఘనంగా జరిగింది.

ఒకరోజు రాత్రి ప్రజ్ఞ పడుకున్న తర్వాత... సుశాంత్ తన అమ్మ డైరీలోని ఆఖరి పేజీ తెరుస్తాడు. అందులో ఇలా రాసి ఉంటుంది:

"A man can't propose to a woman without earning enough money... but a true woman can love him even if he is financially unfit... she will support him. She supports him to grow together and stronger... and finally never leaves him... and I am that woman... I got the best loving husband of my life... and I stayed for him."

అది చదివిన వెంటనే సుశాంత్ తన పక్కనే నిద్రపోతున్న ప్రజ్ఞ వైపు చూస్తాడు. తన అమ్మ రాసిన ఆ మాటలు అక్షరాలా ప్రజ్ఞకు కూడా సరిపోతాయి. తన జీవితంలోకి వచ్చిన ఆ దేవతనే అలా తదేకంగా చూస్తూ ఉండిపోతాడు.

ఆ గదిలో సుశాంత్ వెనుక గోడకు... ఎంతోమంది దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్లతో, అలాగే సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో కలిసి దిగిన ఫోటో ఫ్రేమ్స్ అలంకరించి ఉంటాయి. సుశాంత్ డైరీ చదువుతున్న టేబుల్ వెనక ఉన్న అలమారా నిండుగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు తళతళలాడుతుంటాయి. కానీ, సుశాంత్ దృష్టి మాత్రం ఆ అవార్డుల మీద లేదు... తన జీవితకాల సాఫల్యం (Life time achievement) అయిన ప్రజ్ఞ మీదే నిలిచి ఉంటుంది.

ఇంతలో ఫోన్ మోగడంతో సుశాంత్ ఆలోచనల నుంచి బయటకు వస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుంచి...

"సుశాంత్ సార్... నేను ప్రవీణ్‌ని. ఐయామ్ సో సారీ సార్, ఆరోజు నేను చేసిన దానికి నన్ను క్షమించండి. నేను మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాను సార్... ప్లీజ్," అని దీనంగా అడుగుతాడు.

అది విన్న సుశాంత్ పెదవులపై ఒక చిరునవ్వు విరుస్తుంది. ప్రశాంతంగా, "ఓకే," అని చెప్పి కాల్ కట్ చేస్తాడు.

అలలుగ ఎగసిపడిన ఆ ఆనందాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు సుశాంత్. ఆ అరుపుకి ప్రజ్ఞ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది.

"ఏమైంది?" అని కంగారుగా అడుగుతుంది.

ప్రజ్ఞను గట్టిగా హత్తుకుని, ఎంతో గర్వంగా, తన పోరాటమంతా సఫలమైనంత తృప్తిగా ఇలా అంటాడు సుశాంత్...

"Bloody Satisfying!"

--- శుభం ---

OKA DIARY

By Storytravel

Published: March 4, 2026 at 9:51 AM

© 2026 Storytravel. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...