SCREEN ON

Directory

01

Episode 01

02

Episode 02

Active
03

Episode 03

04

Episode 04

05

Episode 05

Chapter // 02

Episode 02

Writer_aj
Crime
1 Min Read
Pub: Sep 5, 2026

రుద్ర ఇంటికి తిరిగి వచ్చాడు.

ఇంట్లోకి అడుగుపెట్టగానే తన తమ్ముడు టోనీ కనిపించాడు.

రుద్ర వాళ్ళ తమ్ముడు దగ్గరకు వెళ్లాడు.

“టోనీ....”

అతను ఒక్కసారి రుద్ర వైపు చూసి...

ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

రుద్ర ముఖం మారిపోయింది.

తన సొంత తమ్ముడే తనను పట్టించుకోకపోవడం అతనికి బాధ కలిగించింది.

అతను వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్లాడు.

రుద్ర: “అమ్మా...”

ఆమె అతని వైపు చూసింది.

అమ్మ: “ఏంట్రా?”

రుద్ర కొంతసేపు మౌనంగా ఉన్నాడు.

తర్వాత అడిగాడు.

“టోనీ ఎందుకు నాతో మాట్లాడటం లేదు? బయట వాళ్ళు ఏదోఎదో అంటునారు ఏంటి అమ్మ ? ”

ఆమె ఏమీ మాట్లాడలేదు.

రుద్ర మళ్లీ అడిగాడు.

“నాకు ఏదైనా తెలియని విషయం ఉందా, అమ్మా? నాన్న ఎవరో ఇప్పటికీ అయినా చెప్పమ్మా !!! ” అని ఎప్పుడూ అడగని ప్రశ్న దైర్యం తెచ్చుకుని అడిగేశాడు రుద్ర ...

ఆ ప్రశ్నకు ఆమె కళ్ళల్లో ఏదో మార్పు వచ్చింది.

రుద్ర గమనించాడు.

రుద్ర: “అమ్మా... చెప్పు.”

ఆమె నెమ్మదిగా కూర్చుంది.

ఆమె గొంతులో బాధ ఉంది.

“నువ్వు తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది.”

రుద్ర ఆమె వైపు చూశాడు.

రుద్ర:“ఏంటి?”

కొన్ని క్షణాల మౌనం.

తర్వాత ఆమె చెప్పింది—

“నువ్వు... టోనీ... ఇద్దరూ నా కన్న కొడుకులు కాదు.”

రుద్రకు ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు.

“ఏంటి అమ్మా?”

ఆమె కళ్ళలో నీళ్లు చేరాయి.

“మీ ఇద్దరినీ నేను దత్తత తీసుకున్నాను.”

రుద్ర నిశ్చేష్టుడయ్యాడు.

ఇప్పటివరకు తన జీవితంలో తనకు తెలిసిన ప్రతి విషయం ఒక్కసారిగా ప్రశ్నగా మారిపోయింది.

తన బాల్యం...

తన కుటుంబం...

తన తల్లి...

తమ్ముడు..

అన్నీ.

రుద్ర: “అయితే... నేను ఎవరు?”

ఆమె సమాధానం చెప్పలేదు.

ఎందుకంటే ఆమె దగ్గర ఆ ప్రశ్నకు పూర్తి సమాధానం లేదు.

ఆమె తన గతాన్ని గుర్తుచేసుకుంది.

రుద్ర వాళ్ళ అమ్మ చూడడానికి చాలా పొట్టిగా ఉంటుంది ...

తన కుటుంబంలోని వాళ్లు ఎప్పుడూ ఆమెను ఇతరులతో పోల్చేవారు.

“ఆమె పిల్లలను చూడు...”

“వాళ్ల పిల్లలు ఎంత బాగున్నారు...”

“మా అమ్మాయి కూడా అలా ఉండాలి కదా...”

ఒక్కొక్క మాట...

ఆమె మనసులో ముద్రపడిపోయింది.

ఆమెను తక్కువ చేసి మాట్లాడటం...

ఆమె చిన్న వయసులోనే వేరే పిల్లల ఎదుగుదల తో పోల్చడం!! ఆమె స్నేహితులు ఆమెని వెక్కిరించడం ఆమె కి ఏం మాత్రం నచింది కాదు !

చివరికి ఆమెను తన ఎత్తు గురించి కూడా అవమానించడం మొదలైంది.

మొదట ఆమె నవ్వుతూ భరించింది.

తర్వాత మౌనంగా భరించింది.

ఆ తర్వాత...

ఆమె భరించలేకపోయింది.

రోజులు గడిచేకొద్దీ ఆ మాటలు ఆమె మనసును తినేశాయి.

ఇంకా ఆమెకి పెళ్లి వయసు వచ్చేసరికి ఎవరు చూడడానికి వచ్చిన ఏంటి పిల్ల మరి పొట్టిది ల ఉంది ! మరుగుజ్జు ల ఉంది ! ఎంత లేనొల్లం ఐతే మాత్రం ఈ మరుగుజ్జు నీ చేసుకోవాలా ?" అని అవమానించి వెళ్ళిపోయారు , ఆ బాధ తట్టుకోలేక ఆమె తండ్రి ఎంతగానో ఏడ్చాడు !

ఇంకా మరో పెళ్ళికొడుకుని వెతికి పెళ్లి ఖాయం చేస్తే ఆ పెళ్ళికొడుకు అతను ప్రేమించిన అమ్మాయి ఒకరు ఉన్నారు అని , ఈ పెళ్లి కూతురు నచ్చలేదు అని ఒక ఉత్తరం రాసి వెళ్ళిపోయాడు , అంతే ఆ అవమానం తట్టుకోలేక ఆమె తండ్రి చనిపోయాడు , పుట్టుకతో తల్లి నీ, పెళ్లి కావట్లేదు అని తండ్రిని చంపుకుంది అనే బాధ రోజురోజుకి ఆమెలో ఎక్కువ అయ్యింది

ఒక రాత్రి...

గోరంగా వర్షం పడుతుంది ....ఉరుములు మెరుపులు ....గాలి కూడా చాలా వేగంగా వేస్తుంది...

ఆమె ఒంటరిగా బయటకు నడిచింది...

కళ్లలో కన్నీళ్లు.

మనసులో ఒక్క ఆలోచన.

“ఇంకా ఈ జీవితం ఎందుకు?”

ఆమె తన జీవితాన్ని ముగించుకోవడానికి సిద్ధమైంది.

గోదావరి మీద ఉన్న వంతెన పైకి ఎక్కింది , దూకెయాలి అని అనుకుంది ....దైర్యం తెచ్చుకుంది !!!

అదే సమయంలో...

దూరంగా ఉన్న ఒక డంపింగ్ యార్డ్ వైపు నుంచి ఒక శబ్దం వినిపించింది.

మొదట చాలా మెల్లగా...

చిన్నపిల్లాడి ఏడుపు....

ఆమె అడుగులు ఆగిపోయాయి.

మళ్లీ వినిపించింది.

ఈసారి మరింత స్పష్టంగా.

ఏడుపు.

ఆమె చుట్టూ చూసింది.

ఆ చీకటిలో...

ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి డంపింగ్ యార్డ్ వైపు నడిచింది.

ప్రతి అడుగుతో ఆ ఏడుపు మరింత స్పష్టంగా వినిపిస్తోంది.

చివరికి...

ఆమె అక్కడ ఒక చిన్న బాలుడిని చూసింది.

కేవలం 3 నెలలు ఉంటాయి ఏమో ఆ పసికందు కి !!!

ఒంటరిగా.

ఆ వర్షానికి వణుకుతూ.

ఆమె ఒక్కసారిగా అతని దగ్గరకు పరుగెత్తింది.

ఆ క్షణంలో...

తన జీవితాన్ని ముగించుకోవడానికి వచ్చిన ఒక మనిషి...

మరో జీవితాన్ని కాపాడాలని నిర్ణయించుకుంది" ....

ఆ మూడు నెలల పసి బాలుడే మన రుద్ర !

వాళ్ళ అమ్మ మాటలు విన్న రుద్ర కి ఎంతో ఏడుపు వచ్చింది ! ఆమె చిన్నపాటి నుండి ఎన్ని కష్టాలు అనుభవించిందో రుద్ర కి ఆరోజు అర్ధం అయ్యింది !

రుద్రకు ఆ రోజు తెలియదు—

తనను ఆ చీకటి నుంచి బయటకు తీసిన ఆ వ్యక్తే...

భవిష్యత్తులో తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరిగా మారబోతుందని....తనే అతని తల్లి కానీ తల్లి అవుతుంది అని !!!

కాలం గడిచిపోయింది.

బాల్యంలో ఎదురైన గాయాలు మెల్లగా జ్ఞాపకాలుగా మారాయి.

కానీ కొన్ని గాయాలు మాత్రం...

కాలంతో మానవు.

అవి మనిషి పెరిగే కొద్దీ మరింత లోతుగా మారతాయి.

ప్రస్తుతం — కాలేజీ

కాలేజీ సెమినార్ హాల్ మొత్తం విద్యార్థులతో నిండిపోయింది.

వేదికపై చిత్ర నిలబడి ఉంది.

ఆమె చేతిలో presentation notes ఉన్నాయి.

ముఖంలో నమ్మకం.

కళ్లలో మాత్రం ఒక పెద్ద కల.

“నా goal గురించి చెప్పమంటే...”

ఒక్క క్షణం ఆగింది.

హాల్ మొత్తం ఆమె వైపు చూస్తోంది.

“నేను భవిష్యత్తులో ఒక Psychiatrist అవ్వాలనుకుంటున్నాను.”

కొంతమంది విద్యార్థులు చప్పట్లు కొట్టారు.

చిత్ర చిరునవ్వు నవ్వింది.

“మనిషి శరీరానికి గాయం అయితే మనం వెంటనే కనిపెట్టగలం. కానీ మనసుకి గాయం అయితే అది బయటికి కనిపించదు.”

ఆమె మాటలు కొనసాగాయి.

“అందుకే... మనసులో బాధపడుతున్న వాళ్లను అర్థం చేసుకోవడం, వాళ్లకు సహాయం చేయడం నాకు చాలా ఇష్టం.”

ఆమెకు తెలియదు...

ఆమె ఈ మాటలు చెబుతున్న సమయంలో...

హాల్ వెనుక కూర్చున్న ఒక అబ్బాయి ఆమెనే చూస్తున్నాడని.

అతను ఎవరో కాదు మన రుద్ర !

అతని చూపు చిత్ర మీదే నిలిచిపోయింది.

అది...

రుద్ర ఆమెను మొదటిసారి చూసిన రోజు.

అతనికి అప్పటివరకు తెలియదు—

తన జీవితంలోకి వచ్చిన ఈ అమ్మాయి...

ఒకరోజు తన మనసులో దాగి ఉన్న చీకటిని అర్థం చేసుకునే వ్యక్తిగా మారబోతుందని....

ఇంటికి వెళ్ళే దారిలో చిత్ర గురించే ఆలోచిస్తున్నాడు , చిత్ర ఎంత బాగా మాట్లాడిందో కదా అని పదే పదే తలుచుకుంటున్నాడు ....

Chapter Illustration
✧ ✧ ✧

DISCRIMINATION

By Writer_aj

Published: September 5, 2026 at 10:10 AM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.

Memory Verification

Who wanted to commit s*icide

Prev Next

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...