SCREEN ON

Loading File

Chapter 4

Chapter 3
Chapter 4
0 %
Text
0%
Assets
0%
Audio
0%

Initializing...

Chapter 3

THE CRIME RATE

Chapter 4
Chapter 3
Chapter 4

Turning the page...

5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 4

Jump Now

Directory

01

EPISODE 1

02

EPISODE 2

03

EPISODE 3

Active
Chapter // 03

EPISODE 3

బయట పడి ఉన్న ఆ తెగిపడిన తలను చూసి వికారానికి గురైన కళ్యాణ్, మెల్లగా లోపలికి అడుగుపెట్టాడు. ఆ గదిలోకి వెళ్లగానే భరించలేని దుర్వాసన ముక్కుపుటాలను తాకింది.

అతని వెంటే లోపలికి వచ్చిన అర్జున్, "కళ్యాణ్! క్రైమ్ సీన్ లో శాంపిల్స్ అన్నీ కలెక్ట్ చేయమని టీమ్‌కి చెప్పేశాను," అన్నాడు.

"గుడ్," అని బదులిచ్చిన కళ్యాణ్ దృష్టి, లోపల పడి ఉన్న మరో మృతదేహం మీద పడింది. ఆ వీభత్సాన్ని చూడగానే కళ్యాణ్ తల భరించలేనంతగా బరువెక్కింది. కళ్లు చికిలిస్తూ, "వీళ్లనెక్కడో చూసినట్లుందే..." అని గొణిగాడు.

"ఎక్కడో ఎందుకు కళ్యాణ్, వీళ్ళు ఈమధ్య బాగా పాపులర్ అయిన ఓ సింథటిక్ క్లాతింగ్ బ్రాండ్ ఓనర్స్," అని బదులిచ్చాడు అర్జున్.

ఆ మాట వినగానే కళ్యాణ్ మదిలో ఏదో మెదిలింది. కొన్ని క్షణాల పాటు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు.

"కళ్యాణ్? ఆర్ యు ఓకే?" అర్జున్ పిలుపుతో ఉలిక్కిపడి వర్తమానంలోకి వచ్చాడు.

"యా... ఐ యామ్ ఓకే," అంటూనే ఆ మృతదేహాన్ని తీక్షణంగా గమనించాడు. "వీళ్లని ఎవడో ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చాడు... తాళ్లతో కట్టేసి నరకం చూపించాడు... ఆ తర్వాత ఏకంగా ఛాతీ మీద చర్మాన్ని వలిచేసి మరీ దారుణంగా చంపేశాడు!" తను చూస్తున్నది చూస్తున్నట్లుగా, ఒక ట్రాన్స్‌లో ఉన్నవాడిలా చెప్పుకుపోయాడు.

ఆ మాటలకు షాక్ అయిన అర్జున్, వెంటనే ఆ మృతదేహాల మీద ఉన్న షర్ట్స్ తొలగించి చూశాడు. కళ్యాణ్ చెప్పినట్లుగానే వాళ్ళ ఛాతీ భాగంలో చర్మం లేదు. ఆ గది నేలంతా ఎండిపోయిన రక్తపు మరకలతో నిండిపోయి ఉంది. "అంటే... ఇది కచ్చితంగా ఎవరో పగపట్టి చేసిన హత్యే కదా!?" అని అడిగాడు అర్జున్ వణుకుతున్న గొంతుతో.

"వాడెవడైనా సరే... ఈ పనిలో వాడికి చాలా అనుభవం ఉంది. తన ఉనికికి సంబంధించిన చిన్న ఆధారం కూడా వదల్లేదంటే, వాడు కచ్చితంగా ప్రొఫెషనల్ కిల్లర్ అయి ఉండాలి. లేదా, వీళ్ళ మీద అంతకంటే బలమైన వ్యక్తిగత పగ అయినా ఉండి తీరాలి," అన్నాడు కళ్యాణ్ ఆలోచనాత్మకంగా.

సరిగ్గా అప్పుడే ఓ ఫింగర్ ప్రింట్ ఎక్స్‌పర్ట్ అక్కడికి వచ్చి, "సార్! ఆ గొడ్డలి మీద ఎలాంటి వేలిముద్రలు పడకుండా హంతకుడు చాలా జాగ్రత్తపడ్డాడు. మనకు ఒక్క శాంపిల్ కూడా దొరకలేదు. హి ఈజ్ వెరీ నటోరియస్ సార్," అని రిపోర్ట్ చేశాడు.

కళ్యాణ్ వెంటనే అలెర్ట్ అయ్యాడు. "అర్జున్! ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాడంటే... కచ్చితంగా వాడు ఏదైనా పెద్ద వెహికల్ వాడి ఉంటాడు. నిన్న రాత్రి ఈ రోడ్ మీద కార్, ట్రక్, జీప్ లేదా వ్యాన్ లాంటివి ఏమైనా వెళ్లడం చూశారేమో ఆరా తీయండి. ఈ ఊరి జనాలను అడిగి ఐ-విట్‌నెస్ కోసం వెతకండి!" అని ఆదేశించాడు.

ఆ సీరియస్ వాతావరణాన్ని బ్రేక్ చేస్తూ... పక్కనే నేల మీద కూర్చున్న బుచ్చిబాబు దయనీయంగా మొహం పెట్టాడు. "అయ్యా... గొడ్డలి ఏదో భలే మెరుస్తుందే అని చూడటానికి వస్తే, ఈ హత్య నేనే చేసినట్లు నన్నిక్కడ కూర్చోబెట్టారేంటయ్యా? నన్ను వెళ్ళనివ్వండయ్యా... నాకు చాలా అర్జెంట్," అంటూ టాయిలెట్ వస్తున్నట్లుగా రెండు వేళ్లు చూపించాడు.

అప్పటికే తన కారు దాకా వెళ్లిన కళ్యాణ్, వెనక్కి తిరిగి... "సరే, వెళ్ళు! కానీ నీ వెంటే మా నితిన్ కూడా ఉంటాడు," అని చెప్పి కారు స్టార్ట్ చేశాడు.

'అదేంట్రా బాబూ... బాత్రూమ్ లోకి వస్తే బాగోదేమో!' అని మనసులో ఏడుపు మొహం పెట్టుకున్నాడు బుచ్చిబాబు.

THE CRIME RATE

By Ajay

Published: March 1, 2026 at 11:55 AM

© 2026 Ajay. All rights reserved. Do not copy, distribute, or steal.
Prev

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...