“ప్రేమ గెలిచింది… కానీ జీవితం ఇంకా ముగియలేదు.”
ధర్మ వీర పురస్కార వేడుక ముగిసిపోయింది.
కానీ…
ఆ రోజు జరిగిన ప్రతి క్షణం ఇంకా ప్రజల గుండెల్లో మోగుతూనే ఉంది.
శ్యామ్ మాట్లాడిన ఆ అరగంట… ఒక రచయిత స్పీచ్ కాదు. ఒక యుగం గొంతెత్తి మాట్లాడినట్టుగా అనిపించింది.
రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఒకే పేరు మాట్లాడుకుంటోంది.
“శ్యామ్.”
అతని పుస్తకం అమ్మకాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పత్రికలు అతని గురించి రాస్తున్నాయి. విద్యార్థులు అతని మాటలు కోట్స్‌గా చెప్పుకుంటున్నారు. అమ్మాయిలు అతని స్పీచ్ వీడియోలు చూసి ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు తమ కూతుళ్లతో మొదటిసారి బహిరంగా మాట్లాడడం మొదలుపెట్టారు.
కానీ…
ఈ అంతా మధ్యలో మన శ్యామ్ మాత్రం మారలేదు.
ఆ రాత్రి…
వేడుక అయిపోయాక అందరూ నెమ్మదిగా ఇంటికి వెళ్లిపోయారు. వేదిక ఖాళీ అవుతోంది. దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి.
ఇంకా తర్వాత శ్యామ్ ఏం ఏం చేశాడు…? రుక్మిణీ, శ్యామ్‌లకు వివాహం అయ్యిందా…? వాళ్లు సంతోషకరమైన జీవితాన్ని జీవించారా…? అసలు శ్యామ్ రాసిన పుస్తకాలు సమాజంలో మార్పుతో పాటు కొత్త సమస్యలను కూడా తెచ్చాయి… కానీ శ్యామ్‌కి అభిమానులతో పాటు శత్రువులు కూడా ఏర్పడ్డారు!
ఎవరు ఆ కొత్త శత్రువులు…?
మౌన కావ్యం అంటే కేవలం రుక్మిణీ – శ్యామ్‌ల ప్రేమ కథే కదా…! మరి ఇప్పుడు ఈ కథ ఎటు వెళ్లబోతోంది…???
మీరు ఏం అనుకుంటున్నారు…?
రుక్మిణీ శ్యామ్‌కి ఆ పుస్తకం ఇచ్చిందా లేదా…?
అన్నిటికీ సమాధానం కావాలి అంటే…
“మౌన కావ్యం” తదుపరి ఘట్టం…
అదే Season 2 కోసం ఎదురు చూడక తప్పదు మరి…
Thanks Giving 💛
నేను ఈ కథ రాసినప్పుడు అసలు అనుకోలేదు… మీరు ఈ కథ చదివి నన్ను ఇంతలా ఆదరిస్తారు అని!
మీరు చూపించిన ఈ శ్రద్ధ, ప్రేమ, ఆప్యాయత అన్నీ వృథా కావు. నా మీద నాకు నమ్మకం కలిగించారు. నన్ను నేను నమ్మడానికి మీ ప్రోత్సాహం ఎంతో తోడ్పడింది.
అందుకే మీ అందరికీ “థాంక్స్” మాత్రమే చెప్పి ఉండలేను…
మీ కోసం నేను ఏం చేయలేను! కానీ ఇంకా మంచి కథలు రాసి… నా కథలతో మిమ్మల్ని అలరిస్తాను!
“మౌన కావ్యం” అనే కథ నాకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పింది. ఎన్నో విషయాలు తెలుసుకునేలా చేసింది. ముఖ్యంగా సమాజం మరియు ప్రజల మనస్తత్వం ఎలా ఉన్నాయో అర్థం అయ్యింది.
అప్పటికి ఇప్పటికీ ఏం మారింది అనేదే పెద్ద విషయం…
ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే… రుక్మిణీ పాత్ర ఎంతో ప్రత్యేకమైనది.
నా జీవితంలో ఎన్ని కథలు రాసినా… ఇలాంటి కథను మళ్లీ రాయగలనో లేదో…
“ఇవాళ కథ ముగిసింది… కానీ శ్యామ్, రుక్మిణీ ఇంకా ఎక్కడో బ్రతుకుతూనే ఉన్నారు.”
God’s Plan. 💛
Season 2 upcoming....💛✨