SCREEN ON
5

Chapter complete

Next File Loading

Jumping to Chapter 18

Jump Now

Directory

01

Episode 1

02

Episode 2

03

Episode 3

04

Episode 4

05

Episode 5

06

Episode 6

07

Episode 7

08

Episode 8

09

Episode 9

10

Episode 10

11

Episode 11

12

Episode 12

13

Episode 13

14

Episode 14

15

Episode 15

16

Episode 16

17

Episode 17

Active
18

Episode 18

19

Episode 19

20

Episode 20

21

Episode 21

22

Episode 22

23

Episode 23

24

Episode 24

25

Episode 25

26

Episode 26

27

Episode 27

28

Episode 28

29

Episode 29

30

Episode 30

31

Episode 31

32

Episode 32

File // 17

Episode 17

శ్యామ్ అతని పుస్తకం రాస్తూ ఉండగా ఆ పోలీస్ వాళ్ల భార్య మండోదరి మన శ్యామ్‌ని చూసింది. ఆ పోలీస్ వాళ్ల ఇంట్లో ఉన్న శ్యామ్‌కి వాళ్లు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. అలాగే ఆ పోలీస్ పేరు నరసింహం, నరసింహం గారి భార్య మండోదరి. ఆవిడ శ్యామ్‌ని చూసి
"ఏమయ్యా, ఈ కుర్రోడు మన అబ్బాయిలా ఉన్నాడు కదా! వాడు బ్రతికి ఉండి ఉంటే అచ్చం ఇలానే ఉండేవాడు ఏమో!" అని శ్యామ్‌ని చూసి మురిసిపోయింది.

"అవును... కుర్రాడికి చాలా ధైర్యం ఎక్కువే. ఇరవై మంది కొట్టడానికి వచ్చినా లెక్కచేయకుండా ఒక పాప జీవితాన్ని కాపాడాడు" అని గర్వంగా చెప్పాడు అతను.

"ఆ కుర్రోడు రైటర్ అని అంటున్నారు కదా, మన విశ్వనాథ్ అన్నయ్య దగ్గరకి పంపిద్దాం. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు. చాలా శ్రద్ధగా రాస్తున్నాడు కదా" అని అంది ఆవిడ. నిజంగా శ్యామ్‌కి గనక అమ్మ ఉండి ఉంటే అలానే అనేది ఏమో, తన కొడుకుని చూసి.

ఆ మాట విన్న నరసింహం "నువ్వు ఎలా అంటే అలా" అని అన్నాడు.

రాత్రి అవుతుంది. శ్యామ్ మంచి నిద్రలో ఉన్నాడు. శ్యామ్‌కి కలలో ఒక జలపాతం, పక్కనే పచ్చని చెట్లు, ఎన్నో పువ్వులు, మంచి సుగంధ సువాసనలు వస్తున్నాయి. మేఘాలు నేలను తాకుతున్నాయి. ఆ మేఘాల మధ్యలో నుండి మన శ్యామ్ వాటిని చీల్చుకుంటూ ముందుకి సాగాడు. రకరకాల నక్షత్రాలు, అంతరిక్ష మేఘాలు, ఉల్కలు, తోకచుక్కలు అన్నీ అక్కడే ఉన్నాయి. శ్యామ్‌కి ఎందుకో అక్కడే రుక్మిణీ ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఏదో అనంతమైన విశ్వం వాళ్ల కలయిక కోసమే వేచి చూస్తున్నట్టు.

అకస్మాత్తుగా వాళ్లు ఉన్న ప్రదేశం చంద్ర మండలం‌గా మారిపోయింది. ఆ చంద్రుడు కాస్త హిమాలయ పర్వతంగా మారాడు. చుట్టూ తెల్లని మంచు. ఆ మంచులో గులాబీ రంగు చీరలో మన రుక్మిణీ ఎంతో అందంగా కనిపిస్తుంది. అచ్చం పెళ్లికూతురిలా ఉంది. వాళ్ల మధ్య ప్రేమ వికసిస్తున్నట్టు ఆమె బుగ్గపై చిరునవ్వు వచ్చింది. సిగ్గు, ఆనందం మరియు ప్రశాంతత. అక్కడ రుక్మిణీ, శ్యామ్‌లు తప్ప ఇంకెవ్వరూ లేరు. అనంతమైన శూన్యం.

ఆ శూన్యంలో శ్యామ్‌ని చూసిన రుక్మిణీ కళ్లలో ఆనంద భాష్పాలు. రుక్మిణీని అలా చూసిన శ్యామ్ వెంటనే తనని హత్తుకోవాలి అని రుక్మిణీ వైపు పరుగులు తీశాడు. కానీ శ్యామ్ ఆమెను అందుకోవాలి అని ప్రయత్నించిన వెంటనే ఆమె అదృశ్యం అయ్యింది. చుట్టూ ఉన్న అద్భుత ప్రదేశం ఒక్కసారిగా ముళ్లబాట అయ్యింది. శ్యామ్ కాలికి ముళ్లు గుచ్చుకున్నాయి.

నిద్ర నుండి లేచాడు శ్యామ్. ఎందుకో ఏంటో శ్యామ్‌కి రుక్మిణీ గుర్తుకు వచ్చింది. అతని సంచి తీసి అందులో మడతపెట్టి భద్రంగా దాచిన ఆ మూడు పేజీలను బయటకి తీశాడు మన శ్యామ్. ఆ రోజు ఆ పేజీలను ఆ పుస్తకంతో ఎందుకు కాల్చలేదో అర్థం అయ్యే ఉంటుంది ఈపాటికి. అది రుక్మిణీ జ్ఞాపకం. అవి మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మన శ్యామ్ దగ్గర. వాటిని చూసిన శ్యామ్ భావోద్వేగానికి గురయ్యాడు. గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చి...

సంఘటన :-

ఆ రోజు శ్యామ్ వాళ్ల మేనమామ ఇంటి నుండి గాయాలతో బస్ స్టాప్ దగ్గర పడి ఉన్న శ్యామ్‌ని అటుగా వెళ్తున్న హరిచంద్ర గారి కార్ డ్రైవర్ చూసి గుర్తుపట్టాడు. ఆ కారులో హరిచంద్ర గారు కూడా ఉన్నారు (రుక్మిణీ వాళ్ల నాన్న).

"అయ్యా, ఆ బాబు మన రుక్మిణీ అమ్మ స్నేహితుడు. నేను చాలా సార్లు చూసా మన రుక్మిణీ అమ్మతో గుడి దగ్గర" అని అన్నాడు.

ఆ మాట విన్న హరిచంద్రకి అనుమానం వచ్చింది. రుక్మిణీకి అసలు స్నేహితులే లేరు. ఉన్న కొంతమంది కూడా లీల మరియు మరో ఇద్దరు అంతే. ఎవరైనా స్నేహితులు ఉంటే వాళ్ల గురించి వాళ్ల నాన్నకి చెప్పడం మన రుక్మిణీకి అలవాటే. కాబట్టి రుక్మిణీ శ్యామ్ గురించి చెప్పలేదు అంటే ఏదో ఉంది అని అనుమానం కలిగింది.

అప్పుడు హరిచంద్ర గారు కార్ దిగి శ్యామ్ దగ్గరకి వెళ్లారు. శ్యామ్‌ని చూసి
"అయ్యో, చాలా గట్టిగా దెబ్బలు తగిలాయి అనుకుంటా పాపం. స్పృహ కోల్పోయాడు. ఏం అయ్యుంటుందో..." అని చెప్పి శ్యామ్‌ని లేపమన్నాడు వాళ్ల డ్రైవర్‌ని.

ఆ డ్రైవర్ శ్యామ్‌ని లేపి తాగడానికి కొన్ని నీళ్లు ఇచ్చి
"ఈయన హరిచంద్ర గారు. మా రుక్మిణీ అమ్మ స్నేహితుడివే కదా నువ్వు? మీ ఇల్లు ఎక్కడో చెప్పు, దించేస్తాం" అని అన్నాడు.

శ్యామ్‌ని కార్ ఎక్కించారు. హరిచంద్ర గారు ఎదురుగా కూర్చున్నారు. వెనక్కి తిరిగి హరిచంద్ర :-
"ఏం జరిగింది బాబు? ఆ దెబ్బలు ఏంటి?" అని అడిగాడు.

అప్పుడు శ్యామ్ :-
"ఆస్తి తగాదాలు అండి" అని అన్నాడు.

అప్పుడు హరిచంద్ర :-
"నీకు మా రుక్మిణీ ఎప్పటి నుండి తెలుసు?" అని అడిగాడు అనుమానంగా.

శ్యామ్ :-
"ఒక పది రోజుల నుండి తెలుసు అండి" అని అన్నాడు.

అప్పుడు హరిచంద్ర :-
"మా రుక్మిణీకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము బాబు. పెళ్లి కుదిరాక మా రుక్మిణీ ఎలాగో నిన్ను పిలుస్తుంది. కానీ తండ్రిగా నేను ముందే చెప్పేస్తున్నా! ఇవిగో వీళ్లలో ఒకరిని కచ్చితంగా చేసుకుంటుంది" అని కొంతమంది వ్యక్తుల ఫోటోలు ముందుగానే చూపించాడు హరిచంద్ర, శ్యామ్ ఏం అంటాడో చూద్దాం అని.

నిజానికి ఆ రోజుల్లో ఆడపిల్లల ఇష్ట ఇష్టాలతో పని లేదు. పెద్దలు ఎవరిని చేసుకోమంటే వాళ్లనే ఇంకా. కానీ ఇక్కడ మన శ్యామ్‌కి ఆ మాట వినగానే గుండె ముక్కలైంది. అప్పుడు శ్యామ్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక క్షణం మాటలు లేవు. ఇప్పటికే శ్యామ్ జీవితంలో అన్నీ కోల్పోయాడు. అసలే శ్యామ్‌కి ముందు వెనుక ఎవరూ లేరు. ఆ ఫోటోలలో ఉన్న వ్యక్తులు చూస్తే బాగా డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తుల్లా ఉన్నారు. ఒక్కసారిగా రుక్మిణీ వాళ్ల స్థాయి ముందు శ్యామ్ అసలు నిలవలేడు అని అర్థం చేసుకున్నాడు.

శ్యామ్ పరిస్థితిని పైన ఉన్న అద్దంలోనుండి గమనిస్తున్నాడు డ్రైవర్. ఆ పరిస్థితి ఎవరికి రాకూడనిది. అలాంటి పరిస్థితిలో శ్యామ్ బరువైన గుండెతో ఒక చిరునవ్వు నవ్వి :-
"వీళ్లలో ఎవరైనా పర్లేదు సార్... మన రుక్మిణీని బాగా చూసుకుంటే చాలు" అని అన్నాడు శ్యామ్.

ఆ మాట విన్న హరిచంద్రకి శ్యామ్ ఒక స్నేహితుడు మాత్రమే అని నమ్మకం కలిగింది.

హరిచంద్ర :-
"ఆ... అవును బాబు అది నిజమే. అది సరే, మీది ఏ కులం?" అని అడిగాడు అతను.

శ్యామ్ అతని వైపు ఆశ్చర్యంగా చూసి వాళ్ల కులం ఏంటో చెప్పాడు.

హరిచంద్ర :-
"ఓ ఆ కులమా! పర్లేదు, మీ కులంలో వారినే ఎవరినైనా చూసి చేసుకో బాబు. పెళ్లితో అయినా అదృష్టం కలిసి వస్తుంది ఏమో!" అని సలహా ఇచ్చాడు హరిచంద్ర.

హరిచంద్ర మనసులో ఏం ఉందో శ్యామ్‌కి అర్థం అయ్యింది.

శ్యామ్ :-
"సర్, కార్ ఆపండి... ఇక్కడికి పక్కనే మా ఇల్లు" అని అన్నాడు.

కార్ ఆగింది. శ్యామ్ నడుచుకుంటూ బాధతో వాళ్ల ఇంటి ముందు కుప్పకూలిపోయాడు. ఇప్పుడు అతని జీవితంలో రుక్మిణీ ఇంకా లేదు అని అర్థం అయ్యింది. శ్యామ్‌కి తన అనే వాళ్లే లేకుండా పోయారు పూర్తిగా. ఇంకా ప్రేమ్ ఎంత స్నేహితుడు అయినా ఎంత కాలం అతని మీద ఆధారపడతాడు...

కాబట్టి అన్నిటినీ వదిలిపెట్టి ఎవరికి తెలియకుండా అందరికీ దూరంగా వెళ్లిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే అందరికీ దూరం అయ్యాడు.

ప్రాణంగా ప్రేమించిన రుక్మిణీ లేదు. జీవితంలో ఒక మార్గం చూపించే మేనమామే తనని తరిమేశాడు. అది కూడా లేని అపనింద అతని మీద పడింది. శ్యామ్‌తో మాట్లాడినందుకు పాపం మీనాక్షి జీవితం కఠినంగా మారింది. శ్యామ్ తల్లిదండ్రులు చేసిన తప్పులు అతన్ని పూర్తిగా అందరికీ దూరం అయ్యేలా చేశాయి.

ఇంకా రుక్మిణీ కూడా శ్యామ్‌ని పెళ్లి చేసుకుంటే తను కూడా శ్యామ్‌తో కష్టాల పాలవుతుంది అని భావించి మన శ్యామ్ కారులో హరిచంద్ర గారితో అలా అన్నాడు. ముఖ్యంగా శ్యామ్ వాళ్ల కులం గురించి చెప్పినప్పుడు హరిచంద్ర అన్న మాటలు కూడా గుర్తుకొచ్చి, ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడు శ్యామ్ వాళ్ల వీధిలో నడుస్తూ.

(ప్రస్తుతం నరసింహం గారి ఇంట్లో ఉన్నాడు.)

ఇది మన శ్యామ్‌కి ఎదురైన చేదు అనుభవం. అందరూ ఉన్న శ్యామ్ ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు ఎవరు లేని శ్యామ్ ఏం చేస్తాడో చూద్దాం!
Prev Next

Ready to play...