SCREEN ON

Directory

01

Episode 1

Active
Chapter // 01

Episode 1

Writer_aj
Horror
1 Min Read
Pub: Jul 10, 2026

నిజంగా ప్రేమిస్తే...

అవతలి వాళ్లు మనల్ని ఎంత లోకువగా చూసినా...

ఎంత తక్కువగా అంచనా వేసినా...

కనీసం మనం ఎలా ఉన్నామో కూడా పట్టించుకోకపోయినా...

చివరికి మనల్ని నీచంగా చూసినా...

అన్నీ భరిస్తాం.

కేవలం ప్రేమించాం కాబట్టి.

కానీ ఎందుకు?

మనకు విలువ ఇవ్వని వాళ్లనే ఎందుకు ప్రేమిస్తాం?

ఎలాంటి కారణం లేకుండానే...

ఒక మనిషి మన జీవితంలో అంత పెద్ద భాగంగా ఎలా మారిపోతాడు?

నిజమైన ప్రేమ చాలా స్వచ్ఛమైనది.

కల్మషం లేనిది.

కానీ ఏ ఒక్క సంబంధంలోనూ ఇద్దరూ ఒకేలా ఉండరు.

ప్రేమను ఇద్దరూ ఒకే విధంగా అర్థం చేసుకోరు... ఒకే విధంగా స్వీకరించరు.

అలాంటి ఇద్దరి కథే...

"నిర్వీర్యం"

అర్థరాత్రి...

ఇల్లు అంత నిశ్శబ్దంగా ఉంది.

సతి తన మూడు నెలల పసిబిడ్డను ఒడిలో పెట్టుకుని మెల్లగా జోలపాట పాడుతోంది.

ఆమె గొంతులోని మాధుర్యం...

ఆమె చేతుల వెచ్చదనం...

ఆమె మాతృత్వం...

ఆ పసివాడికి ఓ ప్రపంచంలా అనిపించాయి.

జోలపాట వింటూ...

తల్లి గుండె చప్పుడు వింటూ...

వాడు ప్రశాంతంగా నిద్రలోకి జారిపోయాడు.

కొద్దిసేపటికే...

సతి కూడా అలసటతో కళ్లు మూసుకుంది.

అదే సమయం...

ఇంటి చీకటిని చీల్చుకుంటూ ముగ్గురు వ్యక్తులు నిశ్శబ్దంగా లోపలికి అడుగుపెట్టారు.

వాళ్ల చేతుల్లో కత్తులు.

లక్ష్యం ఒక్కటే...

సతి... ఆమె బిడ్డ.

సతి నిద్రలో ఉండగానే వారిలో ఒకడు ఆమె నోరు బలంగా మూసేశాడు.

మరొకడు చేతిలోని కత్తిని పైకెత్తాడు.

అది ఆమె గొంతువైపు దిగబోతున్న క్షణంలో...

"ధామ్!"

ఒక బలమైన దెబ్బ.

సతి భర్త ఒక్కసారిగా వచ్చి వాళ్లను తోసిపారేశాడు.

"సతి...!

బాబుని తీసుకుని వెంటనే వెళ్లిపో...

నేను వస్తాను...!"

అని గట్టిగా అరిచాడు.

అక్కడే వాళ్లతో పోరాటం మొదలైంది.

భర్తకు ఏమవుతుందో అన్న భయం...

ఇక మరోవైపు మెలకువ వచ్చిన బాబు గట్టిగా ఏడవడం...

ఈ రెండు దృశ్యాల మధ్య సతి ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాక నిలిచిపోయింది.

అప్పటికే కిందపడిన వారిలో ఒకడు మళ్లీ లేచి...

బాబు వైపు దూసుకొచ్చాడు.

సతి భర్త అతడిని కూడా అడ్డుకున్నాడు.

ఈసారి అతని కళ్లలో కోపం...

భయం...

ఆత్రం...

అన్నీ కలిసిపోయాయి.

"ఇంకా వెళ్లకపోతే...

నేనే నిన్ను చంపేస్తా...

వెళ్లు...!"

అని గట్టిగా అరిచాడు.

సతి బాబును గట్టిగా హత్తుకుని ఇంటి బయటికి పరుగెత్తింది.

కానీ...

కొద్ది రోజుల క్రితమే ప్రసవించిన ఆమె శరీరం...

ఆ వేగాన్ని తట్టుకోలేకపోయింది.

ప్రతి అడుగు...

ఒక బాధ.

ప్రతి ఊపిరి...

ఒక పోరాటం.

ఎట్టకేలకు భవనం బయటకు వచ్చింది.

అప్పుడే...

వెనక నుంచి ఒక కేక.

ఆ కేక...

ఆమె భర్తది.

ఆ ఒక్క అరుపుతోనే...

అతడు ఇక లేడని ఆమెకు అర్థమైపోయింది.

గేటు దగ్గరకు వచ్చేసరికి...

వాచ్‌మన్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

ఆమె చేతుల్లో పసిబిడ్డ.

వెనక ముగ్గురు హంతకులు.

ముందు చీకటి.

ఆమెకు ఒక్కటే తెలుసు...

ఏమైనా సరే...

ఈ బిడ్డ మాత్రం బతకాలి.

నొప్పిని మరిచి మళ్లీ పరుగెత్తడం మొదలుపెట్టింది.

కానీ శరీరం సహకరించలేదు.

కొద్దిదూరం వెళ్లగానే కాళ్లు ఆగిపోయాయి.

పక్కనే ఒక చిన్న కాలువ.

దాన్ని దాటాల్సిందే.

వెనక్కి చూసింది.

ఆ ముగ్గురూ దగ్గరపడుతున్నారు.

ఆమె నిశ్శబ్దంగా తన బిడ్డను చూసింది.

కళ్లలో నీళ్లు నిండిపోయాయి.

"నా ఆయుష్షు కూడా నీకే ఇస్తున్నా రా...

(మాట పడిపోయింది ఒక్కక్షణం)

నీతో ఆడుకోవాలి అనుకున్నా...

నీకు జోలపాటలు పాడాలి అనుకున్నా...

నువ్వు 'అమ్మ' అని పిలిచే రోజు చూడాలని ఎన్నో కలలు కన్నా...

కానీ...

అవి కలలుగానే మిగిలిపోయాయి..."

అని చెప్పలేక గొంతు ఆగిపోయింది.

ఏడుపే సమాధానమైంది.

కాలువ కింద చిక్కుకుని ఉన్న ఒక గాలి టైర్ కనిపించింది.

తన చీర తీసి...

ఆ టైర్‌కు చుట్టి...

ఒక చిన్న తెప్పలా తయారు చేసింది.

అందులో తన బిడ్డను జాగ్రత్తగా పడుకోబెట్టింది.

చివరిసారి...

బిడ్డ నుదుటిపై ముద్దు పెట్టింది.

ఆ తెప్పను మెల్లగా నీటిలోకి వదిలింది.

అది చీకట్లో నెమ్మదిగా దూరమవుతోంది.

ఆమె కళ్లల్లోని కన్నీళ్లు...

మెల్లగా మాయమయ్యాయి.

వాటి స్థానంలో...

అగ్ని వచ్చింది.

తాను చనిపోవడం ఖాయం.

కానీ...

తన భర్తను చంపిన వాళ్లలో కనీసం ఒక్కరినైనా తీసుకెళ్లాలి.

అదే ఆమె చివరి నిర్ణయం.

ఆమె వెనక్కి తిరిగింది.

వాళ్లు ముగ్గురూ కత్తులతో ఎదురుగా నిలబడ్డారు.

కానీ...

ఈసారి...

ఆమె కళ్లలో భయం లేదు.

బెదురు లేదు.

మిగిలింది ఒక్కటే...

ప్రళయం.

వారిలో ఒకడు కత్తితో ఆమెపైకి దూసుకొచ్చాడు.

సతి అతని దాడిని ఆపి అతడిని దగ్గరకు లాగింది.

ఆమె చేతి గోర్లలని అతని పీక లోకి దించింది ! నాలుగు వేళ్ళు అతని పీకలోకి దిగిపోయి !

ఒక్క క్షణంలోనే అతడు నేలపై

కూలిపోయాడు.

అతని మరో చేతిలో ఉన్న కత్తి నీ ఆమె తీసుకుంది

మిగతా ఇద్దరూ ఒక్కసారిగా ఆగిపోయారు.

ఆ చీకట్లో...

రక్తంతో తడిసిన ముఖం...

ఒక చేతిలో కత్తి...

మరో చేతిలో కారుతున్న రక్తం...

ఆమె మనిషిలా కనిపించలేదు.

భద్రకాళిలా కనిపించింది.

భయం పట్టుకున్నా...

"ఆడమనిషే కదా..."

అనే అహంకారం వాళ్లలో ఇంకా మిగిలే ఉంది.

ఇద్దరూ ఒకేసారి దాడి చేశారు.

ఒకడు ఆమెని కత్తితో పొడిచాడు, అదే సమయం లో ఆమె తన చేతిలో ఉన్న కత్తి తో రెండో వాడి తల తీసేసింది ! పొడిచిన మూడో వాడికి అలా ఆమె నిప్పులు కురిపిస్తున ఆ కళ్ళను చూసి తట్టుకోలేకపోయాడు ! పెక్కనే అతని సహచరుడు తల మొండెం వేరుగా పడ్డాయి!

అయినా...

సతి వెనక్కి తగ్గలేదు.

తనలో మిగిలిన చివరి శక్తినంతా కూడగట్టి...

ఆఖరి వాడిని కూడా చంపేసింది , వాళ్ళని చంపేసిన సరే ఆమె క్రోద్దానికి అడ్డులేకుండా పోయింది , ఆమె భర్తను పోగొట్టుకుంది ! బిడ్డను వదిలేసింది ! అన్నిటిని కోల్పోయింది ! అప్పుడే ఆ క్రొద్దం లో ఒక సింహ గర్జన చేసింది

ఆమె గర్జన...

ఆ నిశ్శబ్ద రాత్రిని చీల్చేసింది.

కొన్ని క్షణాల తర్వాత...

అక్కడ నిశ్శబ్దమే మిగిలింది.

ఆమె నిలబడి ఉంది.

కానీ...

అది కేవలం కొన్ని క్షణాలే.

శరీరంలోని రక్తం దాదాపు అంతా కారిపోయింది.

ఆమె మోకాళ్లు వణికాయి.

కళ్ల ముందున్న ప్రపంచం మసకబారింది.

చివరిసారి...

కాలువలో దూరంగా తేలిపోతున్న తన బిడ్డ వైపు చూసింది.

పెదవులపై చిన్న చిరునవ్వు.

తర్వాత...

ఆమె కూడా నేలపై కూలిపోయింది.

అంత రక్తం కోల్పోయాక కూడా...

ఆమె బ్రతికుంటుందని అనుకోవడం...

మన భ్రమే.

Nirviryam

By Writer_aj

Published: July 10, 2026 at 4:20 PM

© 2026 Writer_aj. All rights reserved. Do not copy, distribute, or steal.

Evaluate Chapter

Your input calibrates the database for others.

Ready to play...